ఇదేమి జెర్సీరా బాబు.. పుచ్చకాయలా ఉంది! మీకో దండం! | Pakistans leaked jersey for T20 World Cup 2022 gets trolled on Twitter | Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: ఇదేమి జెర్సీరా బాబు.. పుచ్చకాయలా ఉంది! మీకో దండం!

Published Mon, Sep 19 2022 8:44 PM | Last Updated on Mon, Sep 19 2022 9:17 PM

Pakistans leaked jersey for T20 World Cup 2022 gets trolled on Twitter - Sakshi

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌-2022 కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు తమ కొత్త జెర్సీని సోమవారం అవష్కరించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఇక పాకిస్తాన్‌ కొత్త జెర్సీపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డును దారుణంగా ట్రోలు చేస్తున్నారు.

గత కొన్నేళ్లుగా ముదురు ఆకుపచ్చ లేదంటే లేత ఆకుపచ్చ రంగు జెర్సీలు ధరిస్తూ వస్తుంది. అయితే  ఈ రెండు రంగులు కలపి కొత్త జెర్సీని పీసీబీ తాయారు చేసింది. అయితే అభిమానులు మాత్రం పాకిస్తాన్‌ జెర్సీ పుచ్చకాయను తలపించేలా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు.

మరి కొంత మం‍ది సెంటర్ ఫ్రూట్ మింగిల్ చాక్లెట్ కవర్‌తో ఈ జెర్సీని పోలుస్తున్నారు. కాగా ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌-2022 కోసం భారత్‌, ఆస్ట్రేలియా వంటి ఆగ్రశ్రేణి జట్లు తమ న్యూ జెర్సీలను లాంచ్‌ చేశాయి.


చదవండిLLC 2022: మిచెల్ జాన్సన్‌కు వింత అనుభవం.. హోటల్ గదిలో పాము!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement