T20 World Cup: Ex-Pak Player Salim Malik Says Babar Azam Should Quit Pakistan Captain - Sakshi
Sakshi News home page

Babar Azam: 'ఇక చాలు.. కెప్టెన్సీ నుంచి తప్పుకో'

Published Wed, Oct 26 2022 9:58 PM | Last Updated on Thu, Oct 27 2022 9:30 AM

Ex-Pak Player Salim Malik Says Babar Azam Should Quit Pakistan Captain - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమితో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌పై విమర్శలు ఎక్కువైపోయాయి. అందునా టీమిండియాతో మ్యాచ్‌లో బాబర్‌ గోల్డెన్‌ డక్‌ అయిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా బాబర్‌ ఆజం స్థిరంగా పరుగులు సాధించడంలో విఫలమవుతూ వస్తున్నాడు. దీనికి తోడు కెప్టెన్సీలోనూ అనుకున్న విధంగా రాణించకపోవడంతో అతనిపై ట్రోల్స్‌ మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే పాక్‌ మాజీ ఆటగాడు సలీమ్‌ మాలిక్‌ బాబర్‌ ఆజంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టున నడిపించలేకపోతే కెప్టెన్సీ నుంచి వైదొలగడం మంచిదంటూ చురకలంటించాడు.

ఇలాంటి తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లో సీనియర్‌ ఆటగాడి పాత్ర జట్టులో కీలకంగా మారుతుంది. కెప్టెన్‌ గందరగోళానికి గురైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అనుభవజ్ఘులు ఆ సమయంలో మార్గనిర్దేశం చేస్తారు. అందుకే ఒక సీనియర్‌ ఆటగాడు ఫాస్ట్‌ బౌలర్‌కు తగిన సూచనలు చేయాలని నేనెప్పుడూ చెప్తుంటాను. ఇన్నేళ్ల అనుభవం ఉన్నా జట్టును సమర్థంగా నడిపించలేకపోవడం.. చేసిన తప్పులనే మళ్లీ పునరావృతం అవుతుంటే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మంచిది. ఇక నీ సేవలు చాలు.. ఇప్పటికైనా కెప్టెన్సీ నుంచి తప్పుకో'' అంటూ పేర్కొన్నాడు. ఇక టీమిండియాతో ఓటమి అనంతరం పాకిస్తాన్‌ గురువారం(అక్టోబర్‌ 27న) జింబాబ్వేతో తలపడనుంది.

చదవండి: మై​కెల్‌ వాన్‌ను మళ్లీ ఆడేసుకున్న వసీం జాఫర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement