Salim Malik
-
కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఆ జట్టు మాజీ ఆటగాళ్లు. బాబర్ ఆజం బృందం ఆట తీరును విమర్శిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఐసీసీ ఈవెంట్లలో దాయాది పాక్‌పై భారత జట్టు విజయపరంపర కొనసాగుతోంది. న్యూయార్క్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన మరోసారి పాక్‌ను విజయానికి దూరం చేసింది.చివరి వరకు నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాకిస్తాన్.. భారత్‌ను 119 పరుగులకే కట్టడి చేసింది.నసీం షా, హ్యారిస్ రవూఫ్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ఆమిర్ రెండు, షాహిన్ ఆఫ్రిది ఒక్కో పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(31) శుభారంభం అందించినా.. మిగిలిన వాళ్ల నుంచి అతడికి సహకారం అందలేదు.టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా అద్భుత రీతిలో బౌలింగ్ చేస్తూ.. పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు పరుగులు రాబట్టడం పక్కనపెడితే వికెట్‌ను ఎలా కాపాడుకోవాలో తెలియక బ్యాటర్లు తలలు పట్టుకున్నారు.ఉద్దేశపూర్వకంగానే?ఈ క్రమంలో నత్తనడకన సాగిన పాక్‌కు ఇన్నింగ్స్ 113 పరుగుల వద్ద ముగిసిపోయింది. ఫలితంగా ఆరు పరుగుల తేడాతో పాక్‌కు ఓటమి తప్పలేదు. ఇక పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రిజ్వాన్ 44 బంతుల్లో 31 పరుగులు చేయగా.. ఇమాద్ వసీం అతడి తర్వాతి స్థానంలో నిలిచాడు.ఇమాద్ వసీం 23 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులే చేశాడు. మిగతా వాళ్లు కూడా బుమ్రా ‘డాట్’ మ్యాజిక్కు చిత్తై చెత్త స్ట్రైక్‌రేటు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ ఇమాద్ వసీంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇమాద్ ఇన్నింగ్స్ గమనిస్తే.. అతడు ఉద్దేశపూర్వకంగానే బంతులు వృథా చేసినట్లు అనిపించిందని ఆరోపించాడు. అతడి వల్లే లక్ష్య ఛేదన మరింత సంక్లిష్టంగా మారిందని సలీం మాలిక్ విమర్శించాడు. చదవండి: వాళ్ల నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం.. రెండు గెలిస్తేనే: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc) -
'ఇక చాలు.. కెప్టెన్సీ నుంచి తప్పుకో'
టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమితో పాక్ కెప్టెన్ బాబర్‌పై విమర్శలు ఎక్కువైపోయాయి. అందునా టీమిండియాతో మ్యాచ్‌లో బాబర్ గోల్డెన్ డక్ అయిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా బాబర్ ఆజం స్థిరంగా పరుగులు సాధించడంలో విఫలమవుతూ వస్తున్నాడు. దీనికి తోడు కెప్టెన్సీలోనూ అనుకున్న విధంగా రాణించకపోవడంతో అతనిపై ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే పాక్ మాజీ ఆటగాడు సలీమ్ మాలిక్ బాబర్ ఆజంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టున నడిపించలేకపోతే కెప్టెన్సీ నుంచి వైదొలగడం మంచిదంటూ చురకలంటించాడు. ఇలాంటి తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లో సీనియర్ ఆటగాడి పాత్ర జట్టులో కీలకంగా మారుతుంది. కెప్టెన్ గందరగోళానికి గురైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అనుభవజ్ఘులు ఆ సమయంలో మార్గనిర్దేశం చేస్తారు. అందుకే ఒక సీనియర్ ఆటగాడు ఫాస్ట్ బౌలర్‌కు తగిన సూచనలు చేయాలని నేనెప్పుడూ చెప్తుంటాను. ఇన్నేళ్ల అనుభవం ఉన్నా జట్టును సమర్థంగా నడిపించలేకపోవడం.. చేసిన తప్పులనే మళ్లీ పునరావృతం అవుతుంటే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మంచిది. ఇక నీ సేవలు చాలు.. ఇప్పటికైనా కెప్టెన్సీ నుంచి తప్పుకో'' అంటూ పేర్కొన్నాడు. ఇక టీమిండియాతో ఓటమి అనంతరం పాకిస్తాన్ గురువారం(అక్టోబర్ 27న) జింబాబ్వేతో తలపడనుంది. చదవండి: మైకెల్ వాన్‌ను మళ్లీ ఆడేసుకున్న వసీం జాఫర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అతనో చేత కాని బౌలర్.. నన్ను ఔట్ చేసుకోలేక ఏడ్చేవాడు..!
తాను లంచం ఆఫర్ చేశానంటూ ఆసీస్ మాజీ ఆటగాడు షేన్ వార్న్ చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ స్పందించాడు. వార్న్.. ఓ చేత కాని బౌలర్ అని, అప్పట్లో నన్ను ఔట్ చేసుకోలేక ఏడ్చేవాడని, ఆ కసితోనే నాపై ఫిక్సింగ్ ఆరోపణలకు పాల్పడ్డాడని కౌంటరిచ్చాడు. ఈ మధ్య కాలంలో చాలా మందికి తమ పుస్తకావిష్కరణల సందర్భంగా వివాదాలు క్రికెట్ చేయడం అలవాటుగా మారిందని, ఈ వివాదాల వల్ల వచ్చే పబ్లిసిటీని వారు క్యాష్ చేసుకుంటున్నారని, వార్న్ కూడా అలాంటి చీప్ స్టంట్‌నే ప్లే చేశాడని ధ్వజమెత్తాడు. వార్న్‌కు తాను లంచం ఆఫర్ చేసిన విషయం 26 ఏళ్ల తర్వాత గుర్తుకు వచ్చిందా, ఒక వేళ అదే నిజమైతే అతను ఇన్నాళ్లు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించాడు. తన డ్యాక్యుమెంటరీని మార్కెట్ చేసుకోవడం కోసమే వార్న్ ఇదంతా చేస్తున్నాడని, అతని ఆరోపణల్లో ఇది తప్ప, మరో ఉద్దేశం కనిపించ లేదని, 26 ఏళ్లు గడిచినా వార్న్ నన్ను గుర్తుపెట్టుకోవడం సంతోషమేనని మాలిక్ చెప్పుకొచ్చాడు. కాగా, తన డాక్యుమెంటరీ "షేన్" కోసం ఇచ్చిన ఇంటర్వూ సందర్భంగా షేన్ వార్న్.. సలీం మాలిక్‌పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 1994 పాక్ పర్యటనలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు సలీం మాలిక్.. తనకు 2,76,000 అమెరికన్ డాలర్ల లంచం ఆఫర్ చేశాడని వార్న్ ఆరోపించాడు. తనతో పాటు సహచర ఆటగాడు టిమ్ మేకు కూడా సలీం లంచం ఆఫర్ చేశాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చదవండి: పాక్ మాజీ కెప్టెన్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు -
పాక్ మాజీ కెప్టెన్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు
Shane Warne: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 1994 పాక్ పర్యటన సందర్భంగా నాటి పాక్ కెప్టెన్ సలీం మాలిక్ తనకు లంచం(2, 76,000 అమెరికన్ డాలర్లు) ఆఫర్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సామర్ధ్యం మేరకు ఆడకూడదని, తనతో పాటు మరో ఆసీస్ ఆటగాడు టిమ్ మేకు వార్నింగ్ కూడా ఇచ్చాడని బాంబు పేల్చాడు. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్న తన డాక్యుమెంటరీ "షేన్" కోసం ఇచ్చిన ఇంటర్వూలో ఈ సంచలన ఆరోపణలు చేశాడు. నాటి పాక్ పర్యటనలో భాగంగా కరాచీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సామర్ధ్యం మేరకు బౌలింగ్ చేయకూడదని, వికెట్లు తీసే ప్రయత్నం చేయకుండా వైడ్ బంతులు విసరాలని తనతో పాటు టిమ్ మేకు సలీం మాలిక్ ప్రలోభాలతో కూడిన వార్నింగ్ ఇచ్చాడని వార్న్ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో పాక్ ఓటమి అంచుల్లో ఉండిందని, అదే జరిగితే ఆ దేశ ఆటగాళ్ల ఇళ్లపై అభిమానులు దాడి చేస్తారని మాలిక్ తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడని వార్న్ తెలిపాడు. సదరు విషయాన్ని తాను, మే.. నాటి ఆసీస్ కెప్టెన్ మార్క్ టేలర్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నాడు. వార్న్ చేసిన ఈ వ్యాఖ్యలతో పాక్ క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. వివాదాలకు కేంద్ర బిందువు అయిన వార్న్ ఆరోపణల్లో ఎంత మేరకు నిజం ఉందో వేచి చూడాలి. కాగా, వార్న్.. 2003 ప్రపంచకప్‌కు ముందు డోపింగ్ పరీక్షలో పట్టుబడి ఏడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. చదవండి: ఎగిరెగిరిపడకండి.. ఇంకో మ్యాచ్ ఉంది.. సఫారీలకు బుమ్రా స్ట్రాంగ్ వార్నింగ్ -
ఇంకా నాపై నిషేధం ఎందుకు?
కరాచీ: తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ విన్నవించాడు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి, అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఓ వీడియో సందేశాన్ని పంపాడు. తనపై కొనసాగుతున్న నిషేధాన్ని తొలగించి, తాను కోచ్‌గా చేసుకోవడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశాడు. (‘గేర్’ మార్చి దంచి కొట్టిన వేళ..!) ప్రస్తుతం తనకు దేశానికి, ఆటగాళ్లకు కోచ్‌గా చేయాలని ఉందని వీడియో మెస్సేజ్‌లో పేర్కొన్నాడు. కాగా, 1995లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు.. పాకిస్తాన్లో పర్యటించినప్పుడు సలీమ్ మాలిక్.. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆస్ట్రేలియా ఆటగాళ్లు షేన్ వార్న్, మార్క్ వా, టిమ్ మేలు మాలిక్ భారీగా ముడుపులు అందుకున్నాడని ఆరోపణలు వ్యాపించాయి. దీనిపై పీసీబీ సుదీర్ఘ విచారణ తర్వాత మాలిక్‌పై జీవిత కాల నిషేధం విధించారు. 2000లో మాలిక్ తప్పుచేసినట్లు తేలడంతో అతనిపై నిషేధం పడింది. కాగా, 2008లో మాలిక్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ పాకిస్తాన్ కోర్టు తీర్పునిచ్చింది. (హర్మన్ మ్యాజిక్ ట్రిక్కు ఫ్యాన్స్ బౌల్డ్..!) కాగా, మాలిక్‌పై నిషేధం విషయంలో పీసీబీ తగ్గకపోవడంతో అతను క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో పాలుపంచుకోవడానికి దూరం కావాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం తాను కోచ్‌గా చేయాలనుకుంటున్నానని, దాంతో తనపై ఉన్న నిషేధాన్ని తొలగించాలంటూ పీసీబీ, ఐసీసీలను కోరాడు. 1982-99 మధ్య కాలంలో పాకిస్తాన్ తరఫున 103 టెస్టులు, 283 వన్డేలను మాలిక్ ఆడాడు. 2008లో నేషనల్ అకాడమీలు కోచ్‌గా చేయడానికి మాలిక్ దరఖాస్తు చేసుకోగా, 2012లో పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్‌గా చేయడానికి అప్లై చేసుకున్నాడు. ఈ రెండు సందర్భాల్లోనూ మాలిక్ దరఖాస్తులను కనీసం పట్టించుకోలేకపోవడం గమనార్హం. -
'పాకిస్తాన్ కు కష్టాలు తప్పవు'
కరాచీ: త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అక్కడ కష్టాలు తప్పవని ఆ దేశ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ అభిప్రాయపడ్డాడు. చాలా కాలం తర్వాత ఇంగ్లిష్ గడ్డపై అడుగుపెడుతున్న పాకిస్తాన్‌కు అటు ఆట పరంగానే కాకుండా, వాతావరణ పరంగా కూడా ఇబ్బందులు తలెత్తె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. గత కొంతకాలంగా సీమ్ బౌలింగ్‌కు ఎంతమాత్రం అనుకూలించని యూఏఈలో మాత్రమే ఆడిన పాకిస్తాన్, పేస్ బౌలింగ్ స్వర్గధామంలా ఉన్న ఇంగ్లిష్ పిచ్‌లపై ఎలా నెట్టుకొస్తుందనేది ఆసక్తికరమేనని మాలిక్ తెలిపాడు. ప్రపంచంలో ఇద్దరు అత్యుత్తమ బౌలర్లు కల్గిన ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కచ్చితంగా పాకిస్తాన్ కు ఒక సవాలేనన్నాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్తాన్ నాలుగు టెస్టు మ్యాచ్ లు, ఐదు వన్డేలు ఆడనుంది. -
'కోచ్ రేసులో నేనున్నాను'
కరాచీ: మేజర్ టోర్నమెంట్లు జరిగిన ప్రతిసారి పాకిస్తాన్ క్రికెట్ కోచ్ ఆందోళనకు గురవుతుంటాడు. ఎందుకంటే ప్రత్యర్థిగా భారత్ ఎదురవడం, దాయాది చేతిలో ఓటమి చవిచూడటం మనకు తెలిసిందే. ఇప్పటివరకు ప్రపంచకప్ లాంటి మేజర్ ఈవెంట్లలో భారత్ పై నెగ్గిన చరిత్ర ఆ జట్టుకు లేదు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ చేతిలో ఓటమి తర్వాత ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తడంతో కోచ్ పదవికి తానే స్వయంగా రాజీనామా చేస్తున్నట్లు వకార్ యూనిస్ ప్రకటించాడు. బోర్డుకు రాజీనామా లేఖను అందించాడు. అప్పటినుంచీ ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. 53 టెస్టులు, 283 వన్డే మ్యాచ్ లు ఆడిన పాక్ మాజీ క్రికెటర్ సలీం మాలిక్ కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు. కోచ్ రేసులో తాను ఉన్నట్లు పాక్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ వెల్లడించాడు. పాక్ జట్టుకు కోచ్ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని, ఆ పదవికి ఆప్లై చేస్తానని చెప్పాడు. అయితే సలీం మాలిక్ పై పాక్ బోర్డు విధించిన నిషేధం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలతో 2000లోనే అతడిపై వేటు పడిన విషయం తెలిసిందే. పాక్ జట్టు ఇటీవలే ఇంజమామ్ ను జాతీయ సెలెక్టర్ గా నియమించింది. కోచ్ పదవికి విదేశీయుల పేర్లను పరిశీలించడం కూడా పాక్ క్రికెట్ బోర్డు మొదలుపెట్టింది. విదేశీ కోచ్ ను తీసుకురావడం అనేది వృథా ప్రయత్నమని పేర్కొన్నాడు. జస్టిస్ మాలిక్ ఖయ్యూం కమిషన్ తనపై నిషేధం విదించాలని గతంలో నిర్ణయించిన మాట వాస్తవమేనని, అయితే ఎప్పటివరకు తాను క్రికెట్ కు దూరంగా ఉండాల్సి వస్తుందో తెలియదన్నాడు. ఆ వివరాలపై స్పష్టతలేదంటూనే.. ఏ ఫార్మాట్లోనూ తాను క్రికెట్ ఆడలేదని అందుకే జాతీయజట్టుకు సేవలు అందించాలని భావిస్తున్నట్లు వివరించాడు. -
ఫిక్సింగ్ వనంలో...మిస్టర్ ‘క్లీన్’
క్రికెట్లో ఫిక్సింగ్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది పాకిస్థాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ నుంచి స్పాట్‌ఫిక్సింగ్ దాకా అన్ని రకాల అక్రమాల్లోనూ పాక్ క్రికెటర్లే అగ్రగణ్యులు. ఫిక్సింగ్‌కు పాల్పడి జరిమానాలకు గురైన వారు, నిషేధం ఎదుర్కొన్న వారు, చివరికి జైలు శిక్షలు కూడా అనుభవించిన వారు ఆ దేశ క్రికెటర్లలో ఉన్నారు. సలీం మాలిక్‌ను మొదలుకొని నిన్న మొన్నటి మహ్మద్ ఆమిర్, సల్మాన్ భట్, ఆసిఫ్‌ల దాకా పాక్ క్రికెటర్ల వ్యవహారం తెలిసిన విషయమే. ఆ స్థాయిలో మలినమైన పాకిస్థాన్ క్రికెట్లో... గంజాయి వనంలో తులసి మొక్కలా నిలిచాడు ఆ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్. 1992-2003 మధ్య కాలంలో పాక్ జట్టు తరపున 37 టెస్టులు, 166 వన్డేలు ఆడిన లతీఫ్.. 6 టెస్టులు, 25 వన్డేల్లో జట్టుకు సారథ్యం కూడా వహించాడు. అయితే తాను ఆడుతున్న రోజుల్లోనే క్రికెటర్ల ‘లాలూచీ’లను పసిగట్టిన లతీఫ్ ఆనాడే వాటి గురించి వ్యాఖ్యానించాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక పాక్ క్రికెటర్ల ఫిక్సింగ్ వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ వస్తున్నాడు. అంతేకాదు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు చీఫ్ ప్యాట్రన్‌గా ఆ దేశాధ్యక్షుడు జర్దారీ ప్రకటించుకోవడాన్ని లతీఫ్ తప్పుబట్టాడు. ఈ విషయంపై కోర్టునూ ఆశ్రయించాడు. ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన మాజీ లెగ్‌స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్‌ను జాతీయ క్రికెట్ అకాడమీలో పదవికి ఎంపిక చేయడంపైనా కోర్టుకెళ్లాడు. ఆటగాళ్ల ఫిక్సింగ్ వ్యవహారంపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశాడు. లతీఫ్ వ్యవహారశైలిపై పీసీబీకి ఆగ్రహం కలిగినా.. అతని ఆరోపణల్లో నిజముండడంతో కిమ్మనలేకపోయింది. సొంతంగా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసి యువ క్రికెటర్లకు శిక్షణనిస్తూ పీసీబీ నుంచి ఎటువంటి పదవులూ ఆశించకుండా నిజాయితీగా నిలబడ్డాడు. లతీఫ్లోని నిజాయితీని గమనించిన పీసీబీ.. చివరికి అతనికి వర్ధమాన క్రికెటర్లు ఫిక్సింగ్ వంటి అడ్డదారులు తొక్కకుండా చైతన్య పరిచే బాధ్యతను అప్పగించింది. తన పని తాను చేస్తూనే అక్రమాలపై ఎలుగెత్తడం మాత్రం లతీఫ్ మానలేదు. దీంతో కొద్ది కాలానికే తన పదవిని కోల్పోవాల్సివచ్చింది. మళ్లీ తాజాగా లతీఫ్‌కు జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి చేపట్టాల్సిందిగా ఆహ్వానం అందింది. అయితే దీనిని నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ఫిక్సింగ్‌కు ఆరోపణలున్నవారు, అవినీతిలో కూరుకుపోయినవారు పీసీబీలో, సెలక్షన్ కమిటీలో ఉన్నారని, అటువంటి వారితో కలిసి తాను పనిచేయబోనని లతీఫ్ కుండబద్దలు కొట్టారు. నిత్యం వివాదాల్లో ఉండే పాకిస్థాన్ క్రికెట్లో మచ్చలేని వ్యక్తిగా నిలిచిన లతీఫ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.