కరాచీ: త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అక్కడ కష్టాలు తప్పవని ఆ దేశ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ అభిప్రాయపడ్డాడు. చాలా కాలం తర్వాత ఇంగ్లిష్ గడ్డపై అడుగుపెడుతున్న పాకిస్తాన్కు అటు ఆట పరంగానే కాకుండా, వాతావరణ పరంగా కూడా ఇబ్బందులు తలెత్తె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు.
గత కొంతకాలంగా సీమ్ బౌలింగ్కు ఎంతమాత్రం అనుకూలించని యూఏఈలో మాత్రమే ఆడిన పాకిస్తాన్, పేస్ బౌలింగ్ స్వర్గధామంలా ఉన్న ఇంగ్లిష్ పిచ్లపై ఎలా నెట్టుకొస్తుందనేది ఆసక్తికరమేనని మాలిక్ తెలిపాడు. ప్రపంచంలో ఇద్దరు అత్యుత్తమ బౌలర్లు కల్గిన ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ కచ్చితంగా పాకిస్తాన్ కు ఒక సవాలేనన్నాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్తాన్ నాలుగు టెస్టు మ్యాచ్ లు, ఐదు వన్డేలు ఆడనుంది.