షాహిద్ అఫ్రిది (ఫైల్ ఫొటో)
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి భారత్‌కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ ఆక్రమించిన కశ్మీర్‌లో పరిస్థితి దారుణంగా ఉందని, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఐక్యరాజ్య సమితి ఎందుకు అడ్డుకోవడం లేదని ట్వీటర్ వేదికగా ప్రశ్నించాడు.
‘భారత్ ఆక్రమించిన కశ్మీర్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అణచివేత పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం తమ గళాన్ని వినిపిస్తున్న అమాయక ప్రజలు అన్యాయంగా తుపాకీ తూటాలకు బలైపోతున్నారు. ఈ హింసను ఐక్యరాజ్యసమితి, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఎందుకు అడ్డుకోలేకపోతున్నాయి.’ అని ట్వీట్ చేశాడు.
Appalling and worrisome situation ongoing in the Indian Occupied Kashmir.Innocents being shot down by oppressive regime to clamp voice of self determination & independence. Wonder where is the @UN & other int bodies & why aren't they making efforts to stop this bloodshed?
— Shahid Afridi (@SAfridiOfficial) 3 April 2018
ఇక అఫ్రిది భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం ఇదే తొలిసారేం కాదు. గతంలో 2016 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇదే కశ్మీర్ అంశం ప్రస్తావిస్తూ భారత్‌కు వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. ఈ పాక్ మాజీ క్రికెటర్ తాజా వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017లో అంతర్జాతీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అఫ్రిది పాక్ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 98 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. 2011 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొన్న పాక్ జట్టుకు సారథిగాను వ్యవహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment