బాబర్ ఆజంతో సర్ఫరాజ్ అహ్మద్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కు తన మకాం మార్చాలని సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టెస్టుల్లో పాక్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న సర్ఫరాజ్ అహ్మద్‌కు.. మహ్మద్ రిజ్వాన్‌తో పాటు యువ వికెట్ కీపర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురువుతోంది.
దీంతో అతడిని సెలక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక వేళ సెలక్టర్లు ఎంపిక చేసినా.. తుది జట్టులో చోటు అంతంతమాత్రమే. తన క్రికెట్ భవిష్యత్తు సందిగ్ధంలో పడడంతో పాకిస్తాన్‌ను విడిచిపెట్టి లండన్ వెళ్లాలని సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
యూకేలో ఉంటూ కౌంటీలు, ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడాలని సర్ఫరాజ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే అహ్మద్ తన సొంత దేశాన్ని వదిలి యూకేకు వెళ్లినా త్వరలో పాకిస్తాన్‌లో జరగనున్న పీఎస్‌ఎల్ లో మాత్రం ఆడతానని సర్ఫరాజ్ సృష్టం చేసినట్లు వినికిడి. ఇప్పటికే తన ప్రాతినిథ్యం వహిస్తున్న క్వెట్టా గ్లాడియేటర్స్ ఫ్రాంచైజీకి సర్ఫరాజ్ ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది.
అయితే దేశం విడిచి వెళ్లడంపై సర్ఫరాజ్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టులలో పాకిస్తాన్ తరపున సర్ఫరాజ్ ఆడాడు. తొలి టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్న అహ్మద్.. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో అతడిని రెండో టెస్టుకు జట్టు మేనెజ్‌మెంట్ పక్కన పెట్టేసింది. రెండో టెస్టుకు సర్ఫరాజ్ స్ధానంలో మహ్మద్ రిజ్వాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఓవరాల్‌గా సర్ఫరాజ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20ల్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో 6 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 6,164 పరుగులు చేశాడు. కాగా 2017లో అతడి సారథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ సొంతం చేసుకుంది.
చదవండి: Sania Mirza: సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్!
Comments
Please login to add a commentAdd a comment