Sarfaraz Ahmed
-
పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్.. దేశాన్ని వీడనున్న స్టార్ ఆటగాడు!?
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్కు తన మకాం మార్చాలని సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టెస్టుల్లో పాక్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న సర్ఫరాజ్ అహ్మద్‌కు.. మహ్మద్ రిజ్వాన్‌తో పాటు యువ వికెట్ కీపర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురువుతోంది. దీంతో అతడిని సెలక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక వేళ సెలక్టర్లు ఎంపిక చేసినా.. తుది జట్టులో చోటు అంతంతమాత్రమే. తన క్రికెట్ భవిష్యత్తు సందిగ్ధంలో పడడంతో పాకిస్తాన్‌ను విడిచిపెట్టి లండన్ వెళ్లాలని సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. యూకేలో ఉంటూ కౌంటీలు, ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడాలని సర్ఫరాజ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే అహ్మద్ తన సొంత దేశాన్ని వదిలి యూకేకు వెళ్లినా త్వరలో పాకిస్తాన్లో జరగనున్న పీఎస్ఎల్ లో మాత్రం ఆడతానని సర్ఫరాజ్ సృష్టం చేసినట్లు వినికిడి. ఇప్పటికే తన ప్రాతినిథ్యం వహిస్తున్న క్వెట్టా గ్లాడియేటర్స్ ఫ్రాంచైజీకి సర్ఫరాజ్ ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే దేశం విడిచి వెళ్లడంపై సర్ఫరాజ్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టులలో పాకిస్తాన్ తరపున సర్ఫరాజ్ ఆడాడు. తొలి టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్న అహ్మద్.. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని రెండో టెస్టుకు జట్టు మేనెజ్మెంట్ పక్కన పెట్టేసింది. రెండో టెస్టుకు సర్ఫరాజ్ స్ధానంలో మహ్మద్ రిజ్వాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఓవరాల్‌గా సర్ఫరాజ్ తన కెరీర్లో ఇప్పటివరకు 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20ల్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో 6 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 6,164 పరుగులు చేశాడు. కాగా 2017లో అతడి సారథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ సొంతం చేసుకుంది. చదవండి: Sania Mirza: సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్! -
ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. చివరికి పాక్- కివీస్ మ్యాచ్ ఏమైందంటే?
కరాచీ వేదికగా పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కూడా 0-0తో డ్రాగానే ముగిసింది. ఇక ఆఖరి రోజు ఆటలో పాక్ విజయానికి 15 పరుగులు అవరసమవ్వగా.. అదే విధంగా న్యూజిలాండ్ గెలుపుకు ఒక్క వికెట్ దూరంలో ఉన్న సమయంలో వెలుతురులేమి కారణంగా ఆటను అంపైర్లు నిలిపివేశారు. దీంతో ఇరు జట్లు డ్రాతో సరిపెట్టుకున్నాయి. కాగా 319 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 9 వికెట్లు 304 పరుగులు సాధించింది. అయితే పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అద్భుతమైన సెంచరీతో తమ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 118 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 78 పరుగులతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 449 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాకిస్తాన్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్ అదనంగా మరో 277 పరుగులు చేసి పాకిస్తాన్ ముందు 319 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సర్ఫరాజ్ అహ్మద్‌కు అవార్డు లభించింది. అదే విధంగా ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ కూడా సర్ఫరాజ్‌నే వరించింది. చదవండి: IND vs SL: కెప్టెన్‌గా తొలి ఓటమి.. హార్దిక్ పాండ్యాపై గంభీర్ కీలక వాఖ్యలు -
Babar Azam: పాక్ తరఫున ఎవరికీ సాధ్యం కాని ఫీట్! కోహ్లితో సమంగా నిలిచి
Pakistan vs England, 2nd T20I- Babar Azam Records: ఇంగ్లండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం. గత కొన్నాళ్లుగా స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకున్న అతడు.. అద్భుత సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 66 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(51 బంతుల్లో 88 పరుగులు) కూడా బాబర్‌కు తోడు కావడంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే.. ఇంగ్లండ్ విధించిన భారీ లక్ష్యాన్ని పాక్ ఛేదించింది. 203 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. టీ20లలో రెండో శతకం కరాచీ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో విజయంతో వ్యక్తిగతంగా.. కెప్టెన్‌గా బాబర్ ఆజం పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ కుడిచేతి వాటం గల బ్యాటర్‌కు ఇది రెండో సెంచరీ. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ తద్వారా పాక్ తరఫున ఒకటి కంటే ఎక్కువ శతకాలు సాధించిన మొదటి బ్యాటర్‌గా అతడు నిలిచాడు. కాగా 2021లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో బాబర్ ఆజం.. పొట్టి ఫార్మాట్లో మొదటి శతకం(122 పరుగులు) సాధించాడు. సర్ఫరాజ్ రికార్డు బద్దలు ఇక టీ20 కెప్టెన్‌గా 30వ విజయం అందుకున్న బాబర్ ఆజం.. సర్ఫరాజ్ అహ్మద్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పాక్ తరఫున 49 అంతర్జాతీయ టీ20లకు సారథిగా వ్యవహరించిన బాబర్ ఆజం.. 30 విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా సర్ఫరాజ్ అహ్మద్ 37 మ్యాచ్‌లలో పాకిస్తాన్‌కు సారథ్యం వహించి 29 విజయాలు అందుకున్నాడు. విరాట్ కోహ్లితో సమంగా.. ఇక టీ20 కెప్టెన్సీ రికార్డులో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లితో సమంగా నిలిచాడు బాబర్ ఆజం. పొట్టి ఫార్మాట్లో కెప్టెన్‌గా 50 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 30 మ్యాచ్‌లలో తన జట్టును గెలిపించగా.. బాబర్ సైతం ఇంగ్లండ్‌తో రెండో టీ20తో ఈ ఫీట్ నమోదు చేశాడు. చదవండి: CPL 2022: డుప్లెసిస్ అద్భుత సెంచరీ.. టీ20 ఫార్మాట్లో నాలుగోది! కానీ పాపం.. Road Safety World Series 2022: సచిన్ క్లాస్..యువీ మాస్; ఇండియా లెజెండ్స్ ఘన విజయం Records tumbling win 💥 Incredible effort from @babarazam258 and @iMRizwanPak 👏#PAKvENG | #UKSePK pic.twitter.com/LUOT01yozW — Pakistan Cricket (@TheRealPCB) September 22, 2022 -
PSL: ఆటగాళ్ల బూతు పురాణం.. వీడియో
అబుదాబి: పాకిస్తాన్ సూపర్‌లీగ్(పీఎస్ఎల్-6)లో ఆటగాళ్ల మధ్య బూతు పురాణం చోటుచేసుకుంది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది పరస్పరం ఒకరినొకరు దూషించుకున్నారు. మంగళవారం క్వెటా గ్లాడియేటర్స్, లాహోర్ ఖలండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. క్వెటా గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో షాహిన్ వేసిన బంతి సర్ఫరాజ్ హెల్మెట్‌ను తాకుతూ థర్డ్‌మన్ దిశగా వెళ్లింది. అప్పటికే అంపైర్ నోబాల్ అని ప్రకటించగా.. సర్ఫరాజ్ పరుగు తీసి నాన్‌స్ట్రైక్ ఎండ్‌కు చేరుకున్నాడు. షాహిన్ అఫ్రిదిని ఉద్దేశించి.. '' నాకే బౌన్సర్ వేస్తావా..'' అన్నట్లుగా కోపంతో చూశాడు. దీంతో బంతి వేయడానికి సిద్ధమవుతున్న అఫ్రిది వెనక్కి వచ్చి సర్ఫరాజ్‌ను తిడుతూ ముందుకు దూసుకొచ్చాడు. అయితే ఇంతలో లాహోర్ కెప్టెన్ సోహైల్ అక్తర్, సీనియర్ ఆటగాడు మహ్మద్ హపీజ్ వచ్చి వారిద్దరిని విడదీశారు. ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దరికి సర్ది చెప్పి అక్కడినుంచి పంపించేశారు. ఓవర్ ముగిసిన అనంతరం హఫీజ్ సర్ఫారజ్ దగ్గరికి వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఒక సీనియర్ ఆటగాడిపై నియంత్రణ కోల్పోయి అఫ్రిది ఇలా చేయడంపై అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వెటా గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 158 పరుగులు చేసింది. గ్లాడియేటర్స్ బ్యాటింగ్‌లో వెథర్లాండ్ 48 పరుగులతో ఆకట్టుకోగా.. కెప్టెన్ సర్ఫరాజ 34, అజమ్ ఖాన్ 33 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ ఖలందర్స్ 18 ఓవర్లలో140 పరుగులకే ఆలౌట్ అయి 18 పరుగులతో ఓటమిని చవిచూసింది. చదవండి: ప్లీజ్ ఇలాంటివి వద్దు.. మంచినీరు మాత్రమే తాగండి: రొనాల్డో ఆస్పత్రి పాలైన డుప్లెసిస్ Exchange Of Words Between Sarfaraz Ahmed & Shaheen Shah Afridi#HBLPSL6 #PSL6 #qgvslq pic.twitter.com/PW1rV8E8UO — Cricket Posting (@Cricket_Posting) June 15, 2021 -
అలాంటి వారికి ప్రదర్శనతోనే సమాధానమివ్వాలి
కరాచీ : పాకిస్తాన్ టెస్టు జట్టు కెప్టెన్ అజహర్ అలీ తన సహచర ఆటగాడైన సర్ఫరాజ్ అహ్మద్‌కు మద్దతునిస్తున్నట్లు పేర్కొన్నాడు. సర్ఫరాజ్‌ను విమర్శించేవారిని ఏదో ఒకరోజు తన ప్రదర్శనతోనే సమాధానమిస్తాడని తెలిపాడు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఇంగ్లండ్, పాక్‌ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ అహ్మద్ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని తేలిగ్గా స్టంపింగ్ చేసే అవకాశాన్ని జారవిడిచాడు. దీంతో మొయిన్ అలీ 61 పరుగులతో జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచి విజయానికి దగ్గరగా తీసుకువచ్చాడు. కానీ చివరికి 191 పరుగులే చేసిన ఇంగ్లండ్ జట్టు కేవలం 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సర్ఫరాజ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ కామెంట్ చేశారు. అలీని ఔట్ చేసే సువర్ణవకాశాన్ని చేజేతులా మిస్ చేసిన సర్ఫరాజ్‌ను అందరూ విమర్శించారు. అంతేగాక అతనిపై జోకులు కూడా పేల్చారు. దీనిపై సర్ఫరాజ్ తన ట్విటర్లో తనను విమర్శించిన వారినుద్దేశించి ఉర్ధూ భాషలో ఘాటుగాఏనే స్పందించాడు. సర్ఫరాజ్ చేసిన ట్వీట్‌కు తాను మద్దతిస్తున్నట్లు టెస్టు జట్టు కెప్టెన్ అజహర్ అలీ పేర్కొన్నాడు. (చదవండి : వైజ్ కెప్టెన్ ఉన్నాడు.. వైస్ కెప్టెన్ ఎందుకు?) 'భయ్యా.. మీకు చాలా మంది అభిమానులున్నారు.. అందులో నేను కూడా ఒకడిని. నిన్ను విమర్శించేవారికి నీ ప్రదర్శనతోనే సమాధానం చెప్తావు. అల్లా కూడా ఎప్పుడు నీవెంటే ఉంటాడు. పాకిస్తాన్ జట్టుకు ఎన్నోసార్లు ఉపయోగపడ్డావు.. ఈ సిరీస్‌లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉన్నావు.. దానిని అలాగే కొనసాగించు.'అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గతంలో సర్ఫరాజ్ పాక్ జట్టుకు టీ20, టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిచిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో కెప్టెన్ పదవి పోయాకా తన నిరాశజనకమైన ప్రదర్శనతో జట్టులో సుస్థిర స్థానం కోల్పోయాడు. -
‘సరైన టైమ్‌లో కెప్టెన్‌గా తీసేశారు’
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించడాన్ని మాజీ కెప్టెన్, మాచీ చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ తీవ్రంగా తప్పుబట్టాడు. పాకిస్తాన్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన సర్ఫరాజ్‌ను మరి కొంతకాలం కెప్టెన్‌గా కొనసాగిస్తే బాగుండేదన్నాడు. సరైన టైమ్‌లో సర్ఫరాజ్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించడం నిజంగా దురదృష్టకరమన్నాడు. ఒక కెప్టెన్‌గా ఎంతో అనుభవం సాధించి తప్పుల్ని సరిదిద్దుకుంటున్న క్రమంలో సర్ఫరాజ్‌కు ఉద్వాసన చెప్పడం సరైన నిర్ణయం కాదన్నాడు. ‘ పాక్ క్రికెట్‌కు చాలా గొప్ప విజయాలను సర్ఫరాజ్ అందించాడు. ఎన్నో గుర్తిండిపోయే విజయాలు సర్ఫరాజ్ కెప్టెన్సీలో చూశాం. కానీ అతను అనుభవం గడించి తప్పుల్ని సరి చేసుకుంటున్న సమయంలో కెప్టెన్‌గా తప్పించడం బాధాకరం. సర్ఫరాజ్ కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు చాంపియన్స్ ట్రోఫీని గెలవడంతో పాటు టీ20ల్లో నంబర్ స్థానానికి చేరింది. (బయో సెక్యూర్ క్రికెట్ సాధ్యమేనా?) దాంతో పాటు మంచి విజయాలను కూడా జట్టుకు అందించాడు. కెప్టెన్‌గా మరికొంత కాలం ఉండటానికి సర్ఫరాజ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. అతనిపై నమ్మకం లేకనే పాక్ క్రికెట్ బోర్డు సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా తీసేసింది. ఇక్కడ ఇంకా ఓపిక పడితే బాగుండేది’ అని ఇంజీ తెలిపాడు. 2016 నుంచి 2019 వరల్డ్‌కప్ వరకూ పాక్ క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా సేవలందించిన ఇంజమామ్.. గత వరల్డ్‌కప్‌లో పాక్ క్రికెటర్లు అభద్రతా భావానికి లోను కావడంతోనే నాకౌట్‌కు చేరకుండా నిష్క్రమించాల్సి వచ్చిందన్నాడు. ఇక్కడ కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను నిందించాల్సిన అవసరం లేదన్నాడు. విపరీతమైన ఒత్తిడి కారణంగా సరిగా ఆడలేమని మనసులో పెట్టుకుని అందుకు మూల్యం చెల్లించుకున్నారన్నాడు. గతంలో మూడు ఫార్మాట్లకు సర్పరాజ్ కెప్టెన్‌గా ఉండగా, వరల్డ్‌కప్ తర్వాత అతన్ని సారథ్య బాధ్యతలు తొలగించారు. తొలుత వన్డే, టీ20 ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను తీసేసిన తర్వాత టెస్టు ఫార్మాట్ నుంచి కూడా సారథిగా తీసేశారు. బాబర్ అజామ్‌కు వన్డే, టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించగా, అజహర్ అలీకి టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన జట్టులో సర్ఫరాజ్‌కు పీసీబీ అవకాశం కల్పించడం అతనికి ఊరటనిచ్చే అంశం.(‘ఎంతో మెరుగయ్యా.. కానీ నా వైపు చూడలేదు’) -
కలెక్టర్ మెడకు చుట్టుకుందా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ కుమార్, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సంచలనంగా మారింది. 1.30 నిమిషాల ఆడియో టేప్‌ను శనివారం కొందరు వ్యక్తులు వైరల్ చేయగా.. అందులో కలెక్టర్ సూచనలు, సంజయ్ కృతజ్ఞతలే ఎక్కువగా ఉన్నాయి. కాగా ఈ సంభాషణ 8 నిమిషాలు జరిగిందని, కట్, మిక్స్ విధానం ద్వారా కొందరు తమ సంభాషణను వక్రీకరించి వైరల్ చేశారని కలెక్టర్ సర్ఫరాజ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. దీనిపై ‘సాక్షి’దృష్టి సారించి 8 నిమిషాల ఒరిజినల్ ఆడియో టేప్‌ను సంపాదించింది. ఇందులో కూడా సంజయ్ సందేహాలను కలెక్టర్ నివృత్తి చేయడమే ఎక్కువగా ఉన్నాయి. తెరపైకి నరోత్తం మిశ్రా కేసు పెయిడ్ న్యూస్ కారణంగా 2017లో మూడేళ్ల అనర్హత వేటు పడ్డ మధ్యప్రదేశ్ మంత్రి, దాటియా నియోజకవర్గం ఎమ్మెల్యే నరోత్తం మిశ్రా కేసు గురించి కలెక్టర్ సర్ఫరాజ్.. బండి సంజయ్‌కు ఫోన్లో వివరించడం గమనార్హం. శ్వేత చానల్ అనే లోకల్ కేబుల్‌లో వచ్చిన వార్తలను ‘పెయిడ్ న్యూస్’గా పేర్కొంటూ సంజయ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫోన్ కాల్లో అదే విషయాన్ని కలెక్టర్ గుర్తు చేస్తూ ‘శ్వేత చానల్ ఫిర్యాదుకు సంబంధించి ఆర్డర్ ఇచ్చాను. 10వ తేదీలోపు ఈసీ నుంచి వచ్చిన వ్యయ పరిశీలకుడికి దానిని అందజేయవచ్చు’అని సూచించడం గమనార్హం. టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఫాలో అప్ చేసుకోమని సూచించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. అలాగే ఒక రాష్ట్రానికి చెందిన హైకోర్టు ఓ ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించిన విషయం వార్తా పత్రికలో చూశానని కలెక్టర్ చెబుతూ..దానిని వాట్సాప్‌లో పెడతానని సంజయ్‌కు చెప్పడం కాల్లో స్పష్టంగా ఉంది. ఎన్నికల్లో సిబ్బంది మీద ఒత్తిడా? అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరీంనగర్లో ఉద్యోగుల మీద ఒత్తిడి ఉన్నట్లు కలెక్టర్ సర్ఫరాజ్.. బండి సంజయ్‌కు చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చిందనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అవతలి వ్యక్తులకు సపోర్టు చేశారనికలెక్టర్తో సంజయ్ చెప్పగా.. ‘ఉండొచ్చు. మా స్టాఫ్ అంతా ఒత్తిడిలో పనిచేస్తున్నారు’అని పేర్కొనడం గమనార్హం. స్వయంగా కలెక్టరే స్టాఫ్ మీద ఒత్తిడి ఉందని పేర్కొనడాన్ని మంత్రి గంగుల కమలాకర్ తప్పుబట్టారు. ఇదే సంభాషణలో ‘మీరు లేకపోతే కరీంనగర్ ఎన్నిక జరిగేది కాదు’అనే ధోరణితో సంజ య్ మాట్లాడగా... దానికి తాను అంగీకరిస్తున్నానని చెబుతూ నే ఉద్యోగం పోతదనే భయం పెట్టి మరీ వీలైనంత వరకు న్యూట్రల్‌గా ఎన్నిక జరిపేందుకు ప్రయత్నించానని కలెక్టర్ చెప్పడం విశేషం. ప్రభుత్వ రహస్యాలు వారికెందుకు?: గంగుల ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తన ఓటమి లక్ష్యంగా పనిచేశారని మంత్రి గంగుల కమలాకర్ బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఓడిన అభ్యర్థులు ఫిర్యాదులు చేయడం, కోర్టులను ఆశ్రయించడం సహజమే కానీ, ఆ అభ్యర్థులకు రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న అధికారి సలహాలు, సూచనలు చేయడాన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రికి ఆడియో టేప్ 8 నిమిషాల ఆడియో టేప్‌ను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు మంత్రి గంగుల కమలాకర్పంపించారు. తనను ఓడించేందుకు బీజేపీ అభ్యర్థితో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని లిఖి తపూర్వక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. కలెక్టర్‌పై వచ్చిన ఆరోపణలపై సీఎస్ విచారిస్తున్నట్లు సమాచారం. జిల్లా పోలీస్ స్పెషల్ బ్రాంచి అధికారులు ఈ లీకైన ఆడియో టేపులను ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిసింది. కలెక్టర్: రెండు రోజుల క్రితం ఏదో హైకోర్టు ఒక ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసింది. పరిమితికి మించిన వ్యయం కేసులో.. ఆ న్యూస్ క్లిప్పింగ్ మీకు పంపుతాను. ఇంకొకటి నరోత్తం మిశ్రా కేసు. అది పెయిడ్ న్యూస్ వల్ల ఉంది. శ్వేత చానల్‌పై కంప్లెయింట్ చేశారు కదా.. దానికి నేను ఆర్డర్ ఇచ్చాను. ఫర్ పెయిడ్ న్యూస్. దాన్ని తీసుకుని కూడా మీరు వెళ్లొచ్చు. జనవరి 10 వరకు ఫైనలైజ్ అవుతది. అది ఫాలోఅప్ చేసుకోండి. మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఎక్కడ డిస్క్వాలిఫై అయిండో ఒకట్రెండు రోజుల పేపర్లో చూశాను. అది మీకు పెడతాను. బండి సంజయ్: ఆర్ఓఆర్ బాగా సపోర్ట్ చేసిన్రు సార్ వాళ్లకు.. కలెక్టర్: ఉండొచ్చు. ఇప్పుడు ఎట్లా ఉందంటే.. మా స్టాఫ్ అంతా చాలా ప్రెషర్ మీద వర్క్ చేస్తున్నారు. సంజయ్: మీ భయంతోనే చేసిన్రు సార్. మీరు లేకుంటే కరీంనగర్ ఎలక్షన్ జరిగేది కాదు. కలెక్టర్: ఐ అగ్రీ టు దట్. చాలా వరకు నేనే పుష్ చేశాను. లేకపోతే ఉద్యోగం పోతది. ఇది పోతది.. అది పోతది అని భయపెట్టి యాజ్ ఫార్ యాజ్ పాజిబుల్ న్యూట్రల్ గా చేసుకునే ప్రయత్నం చేసినారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ చేసిన ఫోన్ కాల్ సంభాషణలోని కొన్ని పాయింట్లు ఇవి. -
ధోని రిటైర్మెంట్ కాలేదు కదా? మరి..
ఇస్లామాబాద్: టెస్టు, టీ20 ఫార్మట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి సర్పరాజ్ అహ్మద్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)తప్పించడంతో అతడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సర్ఫరాజ్ కెరీర్ చరమాంకంలో పడిందని త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను సర్ఫరాజ్ సతీమణి ఖుష్బత్ సర్ఫరాజ్ ఖండించారు. తన భర్త ఇంకా సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడి దేశానికి అనేక విజయాలను అందిస్తాడని ధీమా వ్యక్తం చేస్తోంది. ‘సర్ఫరాజ్ ఎందుకు రిటైర్మెంట్ తీసుకోవాలి? అతడి వయసు ఇప్పుడు 32 ఏళ్లే. ధోని వయసెంతా? అతడు రిటైర్ అయ్యాడా? 38 ఏళ్లైనా ధోని ఇంకా క్రికెట్ ఆడటం లేదా? మా ఆయన కచ్చితంగా తిరిగి జట్టులోకి వస్తాడు. సర్ఫరాజ్ గొప్ప ఫైటర్. ఇక కెప్టెన్సీ నుంచి తప్పించడం పట్ల ఏ మాత్రం నిరాశ చెందటం లేదు. పీసీబీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాం. కెప్టెన్సీ నుంచి తప్పించడంతో సర్ఫరాజ్ క్రికెట్ ప్రయాణం ముగిసిపోలేదు. కెప్టెన్సీ నుంచి తప్పించడంతో సర్ఫరాజ్ ఇంకా స్వేఛ్చగా ఆడతాడు’అంటూ ఖుష్బత్ పేర్కొంది. ఇక సర్ఫరాజ్ అహ్మద్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇది శుభపరిణామం అని అతి కొద్ది మంది పేర్కొనగా.. చాలా మంది తప్పుబట్టారు. టీ20లో పాక్‌ను నంబర్ వన్ జట్టుగా తీర్చిదిద్దిన సర్ఫరాజ్‌పై వేటువేయడంపై మండిపడుతున్నారు. బాబర్ అజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే అతడి ఆటను దెబ్బతింటుందని జావెద్ మియాందాద్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. -
ఆ మ్యాచే మా కొంపముంచింది: పాక్ కెప్టెన్
లండన్ : వెస్టిండీస్‌తో జరిగిన ప్రపంచకప్ ఆరంభ మ్యాచే తమ కొంపముంచిందని పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్ ఘోర ఓటమే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసిందన్నాడు. తమ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చినా అదృష్టం కలిసిరాలేదని తెలిపాడు. ఇక పాకిస్తాన్ 5 మ్యాచ్‌లు గెలిచి 11 పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్‌రేట్ లేని కారణంగా ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకోగా.. 11 పాయింట్లే ఉన్న న్యూజిలాండ్ సెమీస్‌కు చేరింది. అయితే విండీస్‌తో ఘోర ఓటమే పాక్‌కు రన్‌రేట్ లేకుండా చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్ 105 పరుగులకే కుప్పకూలగా.. విండీస్ 13.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఇదే పాక్ జట్టుపై తీవ్రప్రభావం చూపింది. (చదవండి: విండీస్ వలలో పాక్ గిలగిల) శుక్రవారం బంగ్లాదేశ్‌తో విజయానంతరం సర్ఫరాజ్ మాట్లాడుతూ.. ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. ‘గత నాలుగు మ్యాచ్‌ల్లో మేం అద్భుతంగా ఆడాం. కానీ దురదృష్టవశాత్తు మేం సెమీస్ బెర్త్ అందుకోలేకపోయాం. వెస్టీండీస్తో జరిగిన మ్యాచే మాకు నష్టం కలిగించింది. భారత్‌తో ఓటమి ఆనంతరం ఆటగాళ్ల పోరాటం అద్భుతం. ఆరంభంలో మాజట్టు కూర్పు కూడా బాగాలేదు. షాహిన్ షా, హారీస్ సోహైల్ వచ్చిన తర్వాతా జట్టు బలపడింది. మా బ్యాట్స్‌మెన్ ఇమామ్,బాబర్, హ్యారిస్.. అదే విధంగా బౌలర్ల ప్రదర్శన చాలా బాగుంది. ముఖ్యంగా గత నాలుగు మ్యాచ్‌ల్లో షాహిన్ బౌలింగ్ మాకు మరింత ప్రోత్సాహంగా నిలిచింది. ఈ రోజైతే మరి ముఖ్యం. ఆరు వికెట్లు పడగొట్టాడనుకుంటా. ఇక మా ఆటపై కూర్చుని ఆత్మపరిశీలన చేసుకుంటాం. మా తప్పులను గుర్తించి దానికనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. మాకు సుమారు రెండు నెలల సమయం దొరికింది. ఇక టోర్నీ ఆసాంతం మద్దతు పలికిన అభిమానులకు ధన్యవాదాలు’ అని సర్ఫరాజ్ తెలిపాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 94 పరుగులతో పాక్ విజయం సాధించింది. (చదవండి: పాక్‌కు ఊరట గెలుపు) -
500 చేస్తాం.. పాక్ కెప్టెన్ హాస్యం
లండన్ : వన్డే చరిత్రలోనే ఏ జట్టూ సాధించలేని విధంగా 316 పరుగుల తేడాతో గెలిస్తే కానీ ప్రపంచ కప్ సెమీఫైనల్ చేరని పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ శుక్రవారం చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో బంగ్లాదేశ్‌ను ఎదుర్కోనుంది. ఇలాంటి నేపథ్యంలోనూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము 500 పరుగులు చేస్తామని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ జోక్ చేశాడు. అంతలోనే వెనక్కు తగ్గి తాము అంత భారీ స్కోరు చేసిన చోట ప్రత్యర్థిని అత్యల్ప స్కోరుకు ఎలా పరిమితం చేయగలమంటూ ప్రశ్నించాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా మొదట బ్యాటింగ్ ఎంచుకుంటే టాస్‌తోనే పాక్ ఆట ముగుస్తుంది. వరుస విజయాలతో 1992 ప్రపంచకప్ పరిస్థితులను పునరావృతం చేసిన పాక్.. ప్రపంచకప్ సొంతం చేసుకుంటామని భావించింది. కానీ పాక్ ఆశలపై భారత్, న్యూజిలాండ్‌లు నీళ్లు చల్లడంతో నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించే దశకు చేరుకుంది. ఇంగ్లండ్‌పై ఈ ఇరు జట్లు ఓటమి పాలవ్వడంతో పాక్ సెమీస్ ఆశలు గల్లంతైన విషయం తెలిసిందే. -
ఆ వీడియో చూసి నా భార్య విలపించింది: సర్ఫరాజ్
బర్మింగ్‌హామ్ : భారత్ చేతిలో ఓటమి ఎదురయ్యాక తమ దేశ అభిమాని తనను తీవ్ర పదజాలంతో దూషించడాన్ని తట్టుకోలేక తన భార్య కన్నీరుమున్నీరైందని పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. ఓ మాల్లో పాక్ కెప్టెన్ తన కుమారుడితో వెళ్తుంటే ఓ అభిమాని సర్ఫరాజ్‌ను ఉద్దేశిస్తూ ‘పందిలా బలుస్తున్నావ్ ఏంటి సంగతి’ అని వాగాడు. దీన్నేమీ పట్టించుకోని సర్ఫరాజ్ తన దారి చూసుకున్నాడు. ఈ వీడియో సామాజిక సైట్లో చూసిన అతని భార్య ఖుష్‌భక్త్ విలపిస్తుంటే ఆమెను వారించానని చెప్పాడు. మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ తనకు అలాంటి పరిస్థితి ఎదురైతే తప్పకుండా ఆ అభిమాని చెంపచెళ్లుమనేదని అన్నాడు. అలాంటి పదజాలం వాడటాన్ని అక్రమ్ తీవ్రంగా ఆక్షేపించాడు. మరోవైపు ప్రపంచకప్‌లో పుంజుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. భారత్ చేతిలో ఓడటంతో సర్వత్రా విమర్శలెదుర్కొన్న పాక్ వరుస మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌పై జయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ట్విట్టర్లో ‘జట్టుకు అభినందనలు. టోర్నీలో పుంజుకున్న తీరు అద్భుతం. ముఖ్యంగా బాబర్ ఆజమ్, హారిస్ సొహైల్, షాహిన్ చక్కగా రాణించారు’ అని ట్వీట్ చేశారు. చదవండి: పాక్ విజయం: స్టెప్పులేసిన భారత ఫ్యాన్స్ అలాగే జరగాలని ఏమీ లేదు: పాక్ కెప్టెన్ క్రికెట్ చరిత్రలోనే అదో అద్భుతం! -
సర్ఫరాజ్‌ను సెల్ఫీ అడిగి మరి తిట్టాడు!
లండన్ : పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మరోసారి ఘోర అవమానానికి గురయ్యాడు. ప్రపంచకప్‌లో భారత్‌తో ఓటమిని పాక్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌కు వెళ్లిన సర్ఫరాజ్‌ను ఓ అభిమాని సెల్ఫీ అడిగాడు. దీనికి సర్ఫరాజ్ సైతం అంగీకరించాడు. కానీ అతని కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు. దీంతో ఆ అభిమాని పాక్ కెప్టెన్ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు. ‘సర్ఫరాజ్ బాయ్.. ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్ చేయవచ్చు కదా’ అంటూ అభ్యంతరకర పదజాలం వాడాడు. అయినా సర్ఫరాజ్ ఏ మాత్రం ఆగ్రహానికి గురవ్వకుండా ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుండగా.. నెటిజన్లు ఆ అభిమాని చర్యను తప్పుబడుతూ దుమ్మెత్తిపోస్తున్నారు. ‘నీలాంటి వెదవల జోలికి పోవడం కన్నా ప్రశాంతంగా ఉండటమే మంచిదని వాళ్లమ్మ సర్ఫరాజ్‌కు నేర్పించింది’ అంటూ మండిపడుతున్నారు. ఒక ఫ్రొఫెషనల్ ఆటగాడి పట్ల అలా ప్రవర్తించడం సిగ్గుమాలిన చర్యని ఒకరు.. ‘నీవు చేసే 9-5 ఉద్యోగంలో ఏదో తప్పిదం చేస్తే.. అప్పుడు జనాలంతా రోడ్లపై నిన్ను ఇలానే అవమానపరిస్తే తట్టుకుంటావా? అని మరొకరు ప్రశ్నించారు. తప్పులు సహజమని, ఓ ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించడం ఆహ్వానించదగిన విషయం కాదని అభిప్రాయపడుతున్నారు. ఇక భారత్‌తో మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఆవలింతలు తీయడం కూడా అతని ఫిట్‌నెస్‌పై విమర్శలకు కారణమైంది. పిజ్జాలు, బర్గర్లు తినడమే కానీ ఫిట్‌నెస్‌పై ఏమాత్రం సోయిలేదని, ఓటమికి పూర్తి బాధ్యత సర్ఫరాజ్దేనని ఆ దేశ అభిమానులు మండిపడ్డారు. ఇక మ్యాచ్ అనంతరమే స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమాని సర్ఫరాజ్ శరీరాకృతిపై కామెంట్ చేశాడు. ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అయితే ఏకంగా సర్ఫరాజ్‌కు బుద్ధిలేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు. చదవండి: మా కెప్టెన్‌కు బుద్ధి లేదు : అక్తర్ ఫైర్ మైదానంలోనే పాక్ కెప్టెన్‌కు అవమానం! -
‘గెలుపైనా, ఓటమైనా అందరిదీ’
లండన్: ప్రపంచకప్‌లో వరుస ఓటములతో పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే అనధికారికంగా సెమీస్ పోరు నుంచి తప్పుకున్న పాక్ కనీసం గౌరవం కాపాడుకోవాలని భావిస్తోంది. అయితే ముఖ్యంగా టీమిండియా చేతిలో ఘోర పరాజయం తర్వాత పాక్ ఆటగాళ్లపై ఆ జట్టు అభిమానులు, మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. భారత్‌పై ఓటమికి సారథి సర్ఫరాజ్ అహ్మదే కారణమంటూ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే పాక్ సీనియర్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ మాత్రం సర్ఫరాజ్‌కు మద్దతుగా నిలిచాడు. ‘ఆటలో గెలుపోటములు సహజం. ఎవరూ కావాలని ఓడిపోరు. ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ వ్యూహంలో భాగంగానే సర్ఫరాజ్ టాస్ గెలిచాక తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ మేము బౌలింగ్ అనుకున్న విధంగా చేయలేదు. కొన్ని సార్లు మేము అనుకున్న వ్యూహాలు విఫలమవుతాయి. అంతమాత్రాన ఎవరినీ నింధించాల్సిన అవసరం లేదు. గెలుపైనా, ఓటమైనా జట్టు సభ్యులందరదీ. కేవలం ఒక్కరిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం సరికాదు. ఇప్పటికీ పాక్‌కు సెమీస్ అవకాశాలు ఉన్నాయి. మిగతా మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నాం’అంటూ హఫీజ్ పేర్కొన్నాడు. చదవండి: నీకో దండం..నువ్వు కొట్టకురా నాయనా! పాక్ జట్టును రద్దు చేయాలంటూ పిటిషన్! -
సర్ఫరాజ్ సీటుకు ఎసరు.. ఆడియో క్లిప్ సంచలనం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ జట్టులో గ్రూప్ రాజకీయాలు చోటుచేసుకున్నాయా? ఆటగాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయారా? కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాటను ఆటగాళ్లెవరు ఖాతరు చేయడం లేదా? అంటే అవుననే అంటున్నాయి.. పాక్ మీడియా వర్గాలు. పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్, ఆల్‌రౌండర్ ఇమాద్ వసీంల నేతృత్వంలో ఆటగాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయారని, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాటలను ఖాతరు చేయడం లేదని ఆ దేశ మీడియా కథనాలు వడ్డిస్తోంది. ఈ గ్రూప్ రాజకీయాల వ్యవహారంలో పాక్ చీఫ్ సెలక్టర్ ఇంజుమామ్ ఉల్ హక్ హస్తం కూడా ఉందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సర్ఫరాజ్ మైదానంలో వ్యూహాలు రచించలేకపోయాడని, ఆటగాళ్ల వర్గపోరుతో అతను ప్రశాంతత కోల్పోయాడని తెలుపుతున్నాయి. ముఖ్యంగా ఇమామ్ ఉల్ హక్, ఇమాద్ వసీం, షోయబ్ మాలిక్‌లు సర్ఫరాజ్‌ను ఏమాత్రం లెక్కచేయడం లేదంటున్నాయి. ఇక భారత్‌తో ఘోర ఓటమి అనంతరం సర్ఫరాజ్ జట్టు ఆటగాళ్లను మందలించాడని, గ్రూప్ రాజకీయాలు విడిచిపెట్టి కనీసం టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా బాగా ఆడాలని సూచించినట్లు పేర్కొంటున్నాయి.. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే..? తనతో పాటు స్వదేశంలో ఒంటరిగా ఎవరూ అడుగు పెట్టలేరని సర్ఫరాజ్ హెచ్చరించినట్లు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆడియోక్లిప్ ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ అధికారి, నటుడు రాజు జమిలి మాట్లాడినట్లుగా ఉన్న ఆ ఆడియోక్లిప్.. ప్రస్తుతం ఆ దేశ క్రికెట్ వర్గాల్లో దుమరాన్ని రేపుతోంది. ఆ ఆడియోలో పాక్ జట్టులో ఇమామ్ , ఇమాద్, షోయబ్ మాలిక్‌లు సర్ఫరాజ్‌ను ఖాతరు చేయడం లేదని, ఆటగాళ్లు మహ్మద్ ఆమిర్, ఇమాద్ గ్రూప్‌లుగా విడిపోయారన్న రాజు జమిలి.. ఈ గ్రూప్ రాజకీయాల్లో చీఫ్ సెలక్టర్ ఇంజుమామ్ ఉల్ హక్ పాత్ర కూడా ఉందన్నారు. సర్ఫరాజ్‌ను జట్టు నుంచి దూరం చేయడానికి కొంత మంది ఆటగాళ్లు కుట్రపన్నుతున్నారని తెలిపారు. ఓ యాడ్ షూటింగ్లో భాగంగా తనకు షోయబ్ మాలిక్ తారాసపడ్డాడని, సర్ఫరాజ్ అహ్మద్ ఆధిపత్యాన్ని అణగదొక్కడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడని రాజు జమిలి అన్నట్లు ఆ ఆడియోక్లిప్‌లో ఉంది. రాజు జమిలి ఆరోపణలపై స్పందించిన పీసీబీ.. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. అతనిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొంది. Raju Jamil claimed that there is an on-going rift between Sarfaraz Ahmed and Shoaib Malik. The astonishing claims made by Raju Jamil indicated that chief selector Inzamam-ul-Haq is also involved in the matter. pic.twitter.com/wDF0zl70fl — ĪbráhīmOvíç (@connectwithibbi) June 15, 2019 -
మైదానంలోనే పాక్ కెప్టెన్‌కు అవమానం!
మాంచెస్టర్ : పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మైదానంలోనే తీవ్ర అవమానానికి గురయ్యాడు. ఆదివారం భారత్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 89 పరుగుల (డక్‌వర్త్–లూయిస్ ప్రకారం) తేడాతో ఘోర పరజాయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మైదానంలో కోచ్ మిక్కి ఆర్థర్‌తో సర్ఫరాజ్ నిలబడగా.. అతన్ని ఉద్దేశించి గ్యాలరీలో ఉన్న అభిమానులు చాలా జుగుప్సాకరంగా వ్యాఖ్యానించారు. ‘ సర్ఫరాజ్ నీకు చాలా కొవ్వెక్కింది. బ్యాటింగ్ పిచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటావా? మన దేశ ప్రధాని మాట వినవా? అంటూ అరవసాగారు. ఈ మాటలు విని వారివైపు చూసిన సర్ఫరాజ్.. స్వయంకృత అపరాధంగా భావించి నిశ్శబ్ధంగా ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక ఏ మాత్రం అంచనాలు లేని పాక్ జట్టు గతేడాది సంచలన విజయాలు నమోదు చేసి చాంపియన్స్ ట్రోఫి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండేళ్లనంతరం జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీలో ఆ జట్టు హాట్‌ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. ఆ దేశ అభిమానులు కూడా తమ జట్టు కప్ గెలుస్తుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఘోర పరాజయంతో మొదలు పెట్టిన పాక్.. మరుసటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించంది. దీంతో గాడిలో పడినట్లు కనిపించిన పాక్ అనంతరం ఆస్ట్రేలియాతో ఓడింది. తర్వాత ప్రతిష్టాత్మకంగా భావించిన భారత్‌తో జరిగన మ్యాచ్‌లో ఏ మాత్రం పోరాట పటిమ కనబర్చకుండా చేతులెత్తేసింది. ఈ ఓటమిని పాక్ అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా స్వయంకృ అపరాధంగానే ఈ మ్యాచ్ ఓడిపోయామని, టాస్ గెలిచిన సర్ఫరాజ్ బ్యాటింగ్ తీసుకోకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడని, దీంతో తమ జట్టు ఓడిపోయిందనే భావనలో ఉన్నారు. దీంతో అతనిపై వ్యక్తిగతంగా మాటల దాడికి దిగారు. అభిమానులేకాక పాక్ మాజీ క్రికెటర్లు సైతం సర్ఫరాజ్‌ను ఘాటుగా మందలిస్తున్నారు. షోయబ్ అక్తర్ అయితే సర్ఫరాజ్‌కు ఏమాత్రం బుద్దిలేదన్నాడు. ఏది ఏమైనప్పటికి ఒక ఆటగాడిపై వ్యక్తిగతంగా మాటలదాడి చేయడం, అతని శరీర ఆకృతిని ప్రస్తావిస్తూ తిట్టడం సరైంది కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: కోహ్లినిస్తే.. కశ్మీర్ అడగం : పాక్ అభిమానులు మా కెప్టెన్‌కు బుద్ధి లేదు : అక్తర్ ఫైర్ ‘సర్ఫరాజ్ స్లీప్ ఫీల్డర్’ -
‘సర్ఫరాజ్ స్లీప్ ఫీల్డర్’
మాంచెస్టర్: పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆవలింతలపై మీమ్‌లు... అతని శరీరంపై జోకులు... సర్ఫరాజ్ కీపర్ మాత్రమే కాదు, ‘స్లీప్’ ఫీల్డర్ అంటూ అతని ఆవలింతలపై వ్యంగ్యాస్త్రాలు... జట్టు సభ్యుల ఫిట్‌నెస్‌పై పరిహాసాలు... దేశ ప్రధాని మాటనూ పట్టించుకోలేదని విసుర్లు, మ్యాచ్‌కు ముందు రోజు బయటకు షికార్లు చేయడంపై ఆగ్రహావేశాలు... ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత పాకిస్తాన్‌పై విమర్శలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. చిరకాల ప్రత్యర్థి చేతిలో మళ్లీ ఓడటంతో ఆ దేశ అభిమానులు తమ కోపాన్ని ఆపుకోలేకపోయారు. సహజంగానే తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మైదానంలో మ్యాచ్ చూసిన అనంతరం ఒక వీరాభిమాని తన ఆవేదనను ప్రదర్శిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ‘ఎన్నో సమస్యలు ఉన్న పాకిస్తాన్లో మాకు క్రికెట్ కొంత సాంత్వననిస్తుంది. ఎంతో డబ్బు పెట్టి, ఇబ్బందులు పడి ఎన్నో ఆశలతో ఇక్కడికొస్తే ఇలాంటి ఆట ఆడతారా? ఆటగాళ్లకు కనీస ఫిట్నెస్ కూడా లేదు. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి వారు పిజ్జాలు, బర్గర్లు, ఐస్‌క్రీమ్‌లు తిన్నారని విన్నాను. ఎవరైనా ఆటగాళ్లు ఇలాంటి తిండి తింటారా? వీరు క్రికెట్లో కాదు కుస్తీలో పోటీ పడాల్సింది. సర్ఫరాజ్ అయితే నిద్ర మాత్రలు వేసుకున్నట్లు కనిపించాడు.అతను మమ్మల్ని మోసం చేశాడు’ అని సదరు అభిమాని ఏడ్చేశాడు. పాక్ క్రికెటర్లు బేకరీ, ఐస్‌క్రీమ్ షాప్‌కు వెళ్లిన ఫోటోలు, షోయబ్ మాలిక్ తన భార్య సానియా మీర్జా, ఇద్దరు సహచరులతో కలిసి ‘హుక్కా కేఫ్’లో ఉన్న ఫోటోలు కూడా బయటకు రావడంతో అభిమానుల ఆగ్రహం మరింత పెరిగింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దీనిని ఖండించింది. ప్రచారంలో ఉన్న వీడియోలు, ఫోటోలు మ్యాచ్‌కు రెండు రోజుల ముందు (శుక్రవారం) నాటివని... మ్యాచ్‌కు ముందు రాత్రి జట్టు సభ్యులంతా నిర్ణీత సమయానికి గదుల్లో ఉన్నారని, నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. ఇమ్రాన్ సూచనను పట్టించుకోలేదని... పాకిస్తాన్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని దేశానికి ప్రపంచ కప్ అందించిన దిగ్గజం, ప్రస్తుతం ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ మ్యాచ్‌కు ముందు సూచించాడు. ఛేదనలో పాక్ బలహీనం కాబట్టి మాజీలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే సర్ఫరాజ్ మాత్రం ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు. దీనిపై విమర్శలకు తోడు ‘ఇమ్రాన్ ఇంగ్లీష్‌లో రాశాడు కాబట్టి సర్ఫరాజ్‌కు అర్థం కాలేదు’ అంటూ అభిమానులు దెప్పిపొడిచారు. మరోవైపు జట్టులో ఆటగాళ్ల మధ్య విభేదాలే ఓటమికి కారణమయ్యాయని కూడా పాక్ మీడియా కథనాలు ప్రచురించింది. 90ల్లో పాకిస్తాన్ జట్టు చాలా బలంగా ఉండి భారత్‌పై ఆధిపత్యం ప్రదర్శించేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయి భారత్ మెరుగ్గా తయారైంది. ఇలాంటి మ్యాచ్‌లలో మేం ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాం. మా జట్టు అన్ని రంగాల్లో విఫలమైంది. రెండు రోజులుగా పిచ్ కప్పి ఉంచారు. తేమ ఉండటంతో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నా. అయితే మా ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేయడంలో విఫలమయ్యాం. మా శారీరక భాష బాగా లేదంటే ఒప్పుకోను. ఆటగాళ్లంతా బాగానే ప్రయత్నించారు. మా ఫీల్డింగ్ బాగా లేక రోహిత్ రెండు సార్లు రనౌట్ కాకుండా తప్పించుకున్నాడు. అతను ఔటైతే పరిస్థితి భిన్నంగా ఉండేది. మా ఆటగాళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. డ్రెస్సింగ్ రూమ్‌లో అంతా బాగుంది. –సర్ఫరాజ్ అహ్మద్, పాక్ కెప్టెన్ రెస్టారెంట్లో షోయబ్ మాలిక్, సానియా, వహాబ్ రియాజ్ తదితరులు -
ఏయ్ సర్ఫరాజ్.. ప్రధాని మాట వినవా?
ఇస్లామాబాద్ : ‘ఏయ్ సర్ఫరాజ్.. మన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట ఖాతరు చేయవా? ఎంత పొగరు.. ఎంత కుసంస్కారం.’ అంటూ పాకిస్తాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పాక్ సారథిపై మండిపడుతున్నారు. ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన దాయాదుల పోరులో భారత్ 89 పరుగుల (డక్‌వర్త్–లూయిస్ ప్రకారం) తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఘోరపరాజయానికి పాక్ కెప్టెన్ సర్ఫరాజే కారణమని ఆ దేశ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌కు ముందు పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్, ప్రపంచకప్ విజేత ఇమ్రాన్ ఖాన్ సూచనలను సర్ఫరాజ్ ఖాతరు చేయకపోవడమే వారి ఆగ్రహానికి కారణం. (చదవండి : పాక్ క్రికెటర్లకు ఇమ్రాన్‌ఖాన్ అడ్వైజ్ ఇదే!) మ్యాచ్‌కు ముందు ఇమ్రాన్ ఖాన్.. పిచ్ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలని సూచించాడు. అలాగే స్పెషలిస్టు బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగాలని సలహా ఇచ్చాడు. దాయాదుల పోరు సందర్భంగా ఇరుజట్లు తీవ్ర మానసిక ఒత్తిడిలో మ్యాచ్ ఆడుతాయని, ఒత్తిడిని తట్టుకున్న వారే విజేతలుగా నిలుస్తారని, అదృష్టవశాత్తు సర్ఫరాజ్ లాంటి సాహసోపేత నాయకుడి ఆధ్వర్యంలో కచ్చితంగా తమ జట్టు విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. కానీ టాస్ గెలిచిన సర్ఫరాజ్.. ఇమ్రాన్ ఖాన్ సూచనకు భిన్నంగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అభేద్యమైన భారత బ్యాటింగ్ లైనప్ ముందు పాక్ బౌలర్లు చేతులెత్తాశారు. ఒక్క మహ్మద్ ఆమిర్ మినహా మిగతా బౌలర్లంతా పోటీపడి పరుగులు సమర్పించుకున్నారు. (చదవండి: భారత్ పరాక్రమం.. పాక్ పాదాక్రాంతం) భారత హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ బ్యాట్‌కు బలయ్యారు. దీంతో భారత్ ఘనవిజయం లాంఛనమైంది. అయితే ఇమ్రాన్‌ఖాన్ చెప్పినట్లు చేసి ఉంటే పాక్ మ్యాచ్ గెలిచేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఓటమికి సర్ఫరాజే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జోకులు.. ఫన్నీమీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవాలని కోహ్లి-ధోని మాట్లాడుతుండగా సర్ఫరాజ్ రహస్యంగా విని ఈ నిర్ణయం తీసుకున్నాడని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. క్రికెట్ దిగ్గజాలు.. సచిన్, ఇమ్రాన్, వసీంలు బ్యాటింగే ఎంచుకోమని చెప్పాయని, కానీ సర్ఫరాజ్ వినలేదని కామెంట్ చేస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఇలానే వినకుండా ఫీల్డింగ్ తీసుకుని మూల్యం చెల్లించుకున్నాడని, ఇప్పుడు సర్ఫరాజ్ అదే పనిచేశాడంటున్నారు. ఇక విరాట్ కోహ్లి సైతం టాస్ గెలిస్తే ఫీల్డింగే ఎంచుకునేవాళ్లమని మ్యాచ్ అనంతరం తెలిపిన విషయం తెలిసిందే.(చదవండి : ఆ బంతి అత్యద్భుతం : కోహ్లి) #IndiaVsPakistan #INDvPAK Now I know why sarfaraz choose to bat pic.twitter.com/iHSSJNl9aK — Don Pablo (@pagalchoro) June 16, 2019 -
ఆ బంతి అత్యద్భుతం : కోహ్లి
మాంచెస్టర్ : పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజంను కుల్దీప్యాదవ్ ఔట్ చేసిన బంతి అత్యుద్భుతమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. బాబర్, ఫకార్ మ్యాచ్ తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారని, కానీ కుల్దీప్ ఈ జోడిని అద్భుతంగా విడగొట్టాడని కితాబిచ్చాడు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ కూడా అత్యద్భుతమని కొనియాడాడు. ఆదివారం పాక్‌తో జరిగిన పోరులో భారత్ 89 పరుగుల (డక్‌వర్త్–లూయిస్ ప్రకారం) తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘మా ఇన్నింగ్స్ సగం పూర్తయ్యాక బంతి స్పిన్ తిరగడం మొదలైంది. టాస్ గెలిస్తే బౌలింగే తీసుకునేవాళ్లం. రోహిత్ మరోసారి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ ఉత్తమ వన్డే ఆటగాడినని చాటాడు. బాబర్ ఆజమ్‌ను ఔట్ చేసిన కుల్దీప్ బంతి అద్భుతం. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మనల్ని ఓడించారని... ఈ మ్యాచ్‌ను అతి భావోద్వేగంతో తీసుకుంటే చేదు ఫలితం రావొచ్చు. అందుకని ఆ ఓటమి గురించి ఆలోచించలేదు. ఆటలో ఇలాంటివి భాగమని భావించి ముందుకెళ్లాం. దానికి తగ్గ ఫలితమే ఇది. తొడకండరాలు పట్టేయడంతో భువనేశ్వర్ రెండు, లేదా మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. కానీ కీలక సమయంలో అందుబాటులోకి వస్తాడు’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. క్రెడిట్ భారత బ్యాట్స్‌మెన్‌దే.. టాస్ గెలిచి కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ క్రెడిట్ అంతా భారత బ్యాట్స్‌మెన్‌దేనని చెప్పుకొచ్చాడు. ‘ టాస్ గెలిచాం. కానీ సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాం. రోహిత్ అద్భుతంగా ఆడాడు. రోహిత్‌కు బాల్ అప్ ప్రణాళిక రచించామని కానీ అది అంతగా పనిచేయలేదు. టాస్ గెలిచిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. భారత్ బ్యాటింగ్, బౌలింగ్‌తో సమిష్టిగా రాణించింది. మూడు ఓవర్ల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయాం. ఇదే మా కొంప ముంచింది. ఫకార్, ఇమామ్ అద్భుతంగా ఆడారు. కానీ దాన్ని అందుపుచ్చుకోలేకపోయాం. ప్రస్తుత పరిస్థితులు మాకు కఠినమే. మేం మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలవాలి’ అని తెలిపాడు. -
నన్ను మాత్రం నమ్ముకోవద్దు: కోహ్లి
మాంచెస్టర్: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం టికెట్లు అడుగుతున్న స్నేహితులు,బంధువులు తనని నమ్ముకోవద్దని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సూచించాడు. అవకాశం ఉంటే ఇంగ్లండ్ వచ్చి మ్యాచ్ చూడాలని, లేదంటే ఇంట్లో కూర్చొని టీవీలో ఆస్వాదించాలని సలహా ఇచ్చాడు. పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో కోహ్లి శనివారం మీడియాతో మాట్లాడాడు. ‘అన్ని మ్యాచ్‌లలాగే ఇది కూడా నిర్ణీత సమయానికి మొదలై నిర్ణీత సమయానికి ముగుస్తుంది. బాగా ఆడినా, ఆడకపోయినా ఇదేమీ జీవితకాలం సాగదు. ఈ మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నా అదే ముగింపు కాదు. టోర్నమెంట్ ఇంకా మిగిలే ఉంది. ఏ ఒక్కరి మీదో ఒత్తిడి ఉండదు. పదకొండు మందీ బాధ్యత పంచుకుంటారు. వాతావరణం మన చేతుల్లో లేదు కాబట్టి అన్నింటికి సిద్ధంగా ఉండాలి. టీవీ రేటింగ్స్‌కు పనికొచ్చే ఆసక్తికర వ్యాఖ్యలు నేనేమీ చేయను. నాకు ఏ బౌలరైనా ఒకరే. ఆడేటప్పుడు నేను బంతిని మాత్రమే చూస్తాను. అయితే నేను ప్రతీ బౌలర్ ప్రతిభను గౌరవిస్తాను. దానిని గుర్తించి ఆడతాను. అభిమానులూ... మ్యాచ్‌ను చూడండి, చూసి ఆనందించండి. ఇది కేవలం క్రికెట్ మాత్రమే. ఈ మ్యాచ్ కోసం నన్ను టికెట్లు అడుగుతున్న స్నేహితులు, బంధువులకు ఒకటే మాట చెబుతున్నా. టికెట్ల కోసం నన్ను మాత్రం నమ్ముకోవద్దు. మీకు అవకాశం ఉంటే వచ్చి మ్యాచ్ చూడండి. లేదంటే ఇంట్లో కూర్చొని టీవీలో చూడండి. మీ అందరి ఇళ్లలో చాలా మంచి టీవీలు ఉండే ఉంటాయి. నేను ఒకసారి టికెట్లు ఇవ్వడం మొదలు పెడితే దానికి అంతు ఉండదు. అందుకే అలా మొదలు పెట్టదల్చుకోలేదు.’ కోహ్లి చెప్పుకొచ్చాడు. యావత్ క్రికెట్ ప్రపంచంలో భారత్-పాక్ మ్యాచ్ ప్రత్యేకం. రెండు దాయదీ దేశాలు ఈ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాయి. కానీ వరుణుడు కరుణిస్తేనే మరి కొద్ది గంటల్లో మ్యాచ్ ఆరంభమవుతోంది. అభిమానులకు కావాల్సిన మజా లభిస్తోంది. ఇక విశ్వవేదికపై ఇప్పటి వరకు జరిగిన దాయాదీ పోరులో భారతే పైచేయిసాధించింది. Looking for passes for the Ind-Pak clash? @imVkohli has a special message for you guys 😁😁👌👌 #TeamIndia #CWC19 #INDvPAK pic.twitter.com/Ffahfp90Wz — BCCI (@BCCI) June 15, 2019 -
ప్రపంచకప్: పాక్ చేజేతులా..
టాంటన్ : టీమిండియా చేతిలో దారుణంగా ఓడిపోయిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో పుంజుకుంది. ప్రపంచకప్‌లో భాగంగా నేడు స్థానిక మైదానంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో ఆసీస్ విజయ ఢంకా మోగించింది. ఆసీస్ నిర్దేశించిన 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటై ఓటమి చచిచూసింది. పాక్ ఆటగాళ్లలో ఇమాముల్ హక్(53) అర్దసెంచరీతో రాణించగా.. హఫీజ్(46), సారథి సర్ఫరాజ్(40)లు ఫర్వాలేదనిపించారు. అయితే కీలక సమయాలలో వికెట్లు కోల్పోవడం పాక్ కొంప ముంచింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లతో చెలరేగగా.. స్టార్క్, రిచర్డ్సన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. శతకంతో రాణించిన డేవిడ్ వార్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆసీస్ నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఫఖర్ జామన్ పరుగులేమి చేయకుండానే కమిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బాబర్ మరో ఓపెనర్ ఇమాముల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మంచి ఊపు మీదున్న బాబర్(30)ను కౌల్టర్ నైల్ ఔట్ చేస్తాడు. ఈ సమయంలో హఫీజ్‌తో కలిసి ఇమాముల్ ఇన్నింగ్స్‌ను నడిపిస్తాడు. దీంతో రెండు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసి పట్టిష్ట స్థితిలో ఉంది. ఈ తరుణంలో విజయం పాక్ వైపే ఉంది. అయితే ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో ఇమాముల్(53), హఫీజ్(46), మాలిక్(0), అసిఫ్ అలీ(5)లు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో పాక్ పీకల్లోతూ కష్టాల్లో పడింది. వరెవ్వా వాహబ్.. ఇక ఓటమి ఖాయం అనుకున్న తరుణంలో సర్ఫరాజ్‌తో కలిసి బౌలర్ వాహబ్ రియాజ్ విజయం కోసం పోరాడాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు పెంచే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 64 పరుగులు జోడించిన అనంతరం వాహబ్(45)ను స్టార్క్ అవుట్ చేయడంతో పాక్ ఓటమి ఖరారైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన అమిర్(0)ను స్టార్క్ బోల్తా కొట్టించాడు. ఇక మ్యాక్స్‌వెల్ సూపర్ త్రోతో సర్పరాజ్‌ను రనౌట్ చేయడంతో ఆసీస్ విజయం సంపూర్ణమైంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఆటగాళ్లలో వార్నర్(107; 111 బంతుల్లో 11ఫోర్లు, 1 సిక్సర్) శతకం సాధించగా.. ఫించ్(82; 84 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు రాణించడంతో ఓ దశలో ఆసీస్ 350కి పైగా పరుగులు సాధింస్తందునుకున్నారు. అయితే పాక్ స్టార్ బౌలర్ మహ్మద్ అమిర్ చెలరేగడంతో ఆసీస్ మిడిలార్డర్ కకలావికలం అయింది. దీంతో 307 పరుగులకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో అమిర్(5/30), షాహిన్ ఆఫ్రిది(2/70)లు రాణించారు. చదవండి: ఆ ప్రకటనలపై సానియా ఫైర్ ఇంగ్లండ్‌కు పయనమైన పంత్ పాక్‌తో మ్యాచ్: ఆసీస్ ఓపెనర్ల అరుదైన ఘనత -
ఈ లెక్కన ప్రపంచకప్ మాదే : పాక్ ఫ్యాన్స్
లండన్ : యాదృశ్చికమో.. కాకతాళీయమో కానీ పాకిస్తాన్ జట్టుకు 1992 ప్రపంచకప్ టోర్నీ నాటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. అప్పుడు ఈ మెగాటోర్నీ రౌండ్రాబిన్తో పద్దతిలోనే జరగ్గా.. తాజా ప్రపంచకప్ అదే పద్దతిలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పాక్ జట్టు వెస్టిండీస్‌పై ఘోరపరాజయంతో ప్రారంభించగా.. అప్పుడు కూడా ఇదే వెస్టిండీస్‌పై ఘోర ఓటమిని మూటగట్టుకొని టోర్నీని ఆరంభించింది. రెండో మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్, ఆతిథ్య ఇంగ్లండ్‌ను మట్టికరిపించగా.. 1992లో జింబాంబ్వేపై విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్ శ్రీలంకతో శుక్రవారం జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దవ్వగా.. నాడు ఇంగ్లండ్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తవిస్తూ పాక్ అభిమానులు సర్ఫరాజ్ అహ్మద్ సేన 1992 ప్రపంచకప్ చరిత్రను రిపీట్ చేస్తోందని ఆశల పల్లకిలో ఊగుతున్నారు. ఇక 1992 ప్రపంచకప్ టైటిల్‌ను ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాక్ సొంతచేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 1992 నాటి పాక్ గెలుపు, ఓటములను ప్రస్తావిస్తూ గణంకాలను షేర్ చేస్తున్నారు. శ్రీలంకతో మ్యాచ్ రద్దవ్వడంతో తెగ ఆనందపడిపోతున్నారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన నాటి టోర్నీలో పాక్ ఓటమితోనే ప్రారంభించి.. వరుస విజయాలతో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ టోర్నీలో భారత్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఇమ్రాన్ ఖాన్ సేన 43 పరుగులతో ఓడింది. కానీ ప్రస్తుతం తమ తదుపరి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈమ్యాచ్‌ను ఎలాగైనా గెలుస్తామని సర్ఫరాజ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘మాకు మ్యాచ్ ఆడాలని చాలా ఉండే. కానీ దురదృష్టవశాత్తు మ్యాచ్ రద్దవ్వడంతో ఏమి చేయలేకపోయాం. ఇంగ్లండ్‌పై విజయానంతరం మంచి ఉత్సాహంతో ఉన్నాం కానీ మ్యాచ్ ఆడలేకపోయాం. ఆస్ట్రేలియాతో జరిగే తదుపరిలో మ్యాచ్‌లో విజయం సాధిస్తాం.’ అని శ్రీలంకతో మ్యాచ్ రద్దు అనంతరం సర్ఫరాజ్ పేర్కొన్నాడు. ఇక అభిమానులు మాత్రం ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో మ్యాచ్, భారత్‌తో జరిగే ఐదో మ్యాచ్ పాక్ ఓడాలని కోరుకుంటున్నారు. ఆ రెండు కూడా ఓడితే 1992 ప్రపంచకప్ పరిస్థితులు పునరావృతం అవుతాయిని, తదుపరి మ్యాచ్‌లు వరుసగా గెలిచి ప్రపంచకప్ సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Pakistan's Journey in 1992 World Cup. pic.twitter.com/BdkJa0WvYy — Muhammad Irfan (@Muhamma39977594) June 7, 2019 Coincidentally,Pakistan's third game 1992 was Also a wash out,Against England when Pakistan was bowled out for 74 SO bristol Pakistan world cup game Against sirlanka Also being washed out today so I'm seeing the same scenario as repeat of 1992 world cup pic.twitter.com/wAA3oZ2sYi — Uzairkhan (@Uzairhasnaat) June 7, 2019 -
ఇంగ్లండ్ క్రికెటర్లకు జరిమానా.. పాక్‌కు కూడా
నాటింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దురుసుగా ప్రవర్తించిన ఇంగ్లండ్ క్రికెటర్లు జేసన్ రాయ్, జోఫ్రా ఆర్చర్లకు ఐసీసీ జరిమానా విధించింది. అంతేకాకుండా స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆతిథ్య ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ సారథి సర్ఫరాజ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు, జట్టులోని మిగతా సభ్యుల ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సందర్భంగా 14వ ఓవర్లో జేసన్ రాయ్ మిస్ ఫీల్డింగ్ అనంతరం అంపైర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో రాయ్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. ఇదే మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు 15 శాతం కోత విధించారు. అంతేకాకుండా వీరిద్దరికీ జరిమానాతో పాటు చెరో డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ జత చేసింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. -
మా కెప్టెన్‌కు బాగా కొవ్వెక్కింది : అక్తర్
ఇస్లామాబాద్ : ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ చిత్తుగా ఓడటాన్ని ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. విండీస్ బౌలర్లు వరుసగా షార్ట్‌పిచ్ బంతులతో చెలరేగడంతో బెంబేలెత్తిపోయిన పాక్ 105 పరుగులకే చేతులెత్తేసి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో ఇప్పటికే ఆదేశ అభిమానులు పాక్ జట్టుపై ట్రోలింగ్‌కు మొదలుపెట్టారు. తాజాగా ఆ జట్టు మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘మా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ టాస్‌కి వస్తున్న సమయంలో.. కొవ్వు పేరుకుపోయిన అతని పొట్ట వెలుపలికి వచ్చి అసహ్యంగా కనిపించింది. నేను చూసిన మొదటి అన్‌ఫిట్ కెప్టెన్ అతనే. అతను తనకున్న కొవ్వుతో కనీసం కదల్లేకపోతున్నాడు. వికెట్ కీపింగ్ సమయంలోనూ ఇబ్బంది పడటం కనిపించింది’ అని అక్తర్ మండిపడ్డాడని పాక్ జర్నలిస్ట్ సాజ్ సాదిక్ పేర్కొన్నారు. ఇక అక్తర్ మాత్రం పాక్ ఆటతీరుపై మాటల్లేవ్ అంటూ కామెంట్ చేశాడు. మ్యాచ్ అనంతరం ‘అయ్యిందేదో అయిపోయింది.. నా ఆలోచనలు భావోద్వేగాలను మరోసారి నెమరువేసుకుంటున్నాను. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లకు మనమంతా అండగా నిలవాలి. టోర్నీ ఆసాంతం మన మద్దతు వారికి అవసరం. మ్యాచ్ ఓడటం మనందరిని నిరాశకు గురిచేసింది. ఇక వారిని మరింత బాధపెట్టకుండా మద్దుతుగా నిలుద్దాం’ అని ట్వీటర్ వేదికగా పిలుపునిచ్చాడు. ఇక ఈ ఓటమిపై పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందిస్తూ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో కూడా భారత్ చేతిలో తొలుత ఓడామని కానీ ఫైనల్లో గెలిచి టైటిల్ సాధించామని గుర్తు చేశాడు. ఈ దారుణ ఓటమి నుంచి తమ ఆటగాళ్లు కోలుకుంటారని, టైటిల్ పోరులో నిలుస్తారనే నమ్మకం తనకు ఉందన్నాడు. ఇంకా 8 మ్యాచ్‌లున్నాయని, రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. Harsh - Shoaib Akhtar "When Sarfaraz Ahmed came for the toss, his stomach was sticking out and his face was so fat. He's the first captain I've seen who is so unfit. He's not able to move across and he's struggling with wicket-keeping" #CWC19 #PAKvWI — Saj Sadiq (@Saj_PakPassion) May 31, 2019 Ok the match is over. Recollecting my thoughts and emotions. We have to back these boys, they are representing our nation. They need our support throughout the World Cup. #PAKvWI #CWC19 — Shoaib Akhtar (@shoaib100mph) May 31, 2019 -
సర్ఫరాజ్ ధోనిని కాపీ కొట్టావా..?
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనిని కాపీ కొట్టావా అంటూ పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం పాక్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఇప్పటికే ఆతిథ్య జట్టు పాక్‌ను వన్డే సిరీస్‌లో 5-0తో వైట్ వాష్ చేయగా మూడు ట్వంటీ 20ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌ను సైతం కివీసే గెలుపొందింది. పాకిస్తాన్ విసిరిన 106 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఇంకా 25 బంతులుండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సర్ఫారాజ్ అవుటైన విధానంపై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. గతేడాది భారత్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన టెక్నిక్‌తో స్టంప్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. అప్పట్లో ధోనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిసింది. అదే టెక్నిక్‌ను సర్ఫరాజ్ తొలి టీ20లో ఉపయోగించాడు. కానీ ఇక్కడ సర్ఫరాజ్ అవుటయ్యాడు. ఇంకేముంది ఈ ఫోటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో సర్ఫరాజ్ నేర్చుకున్న టెక్నిక్ ఇదే అని ఒకరంటే.. లెజెండ్స్‌ను ఎప్పుడు ఫాలో కావాలని ఇంకోకరు.. ఇతరుల టెక్నిక్ కాపీ చేస్తే ఇలానే అవుతుందని మరోకరు కామెంట్ చేస్తున్నారు. When Sarfaraz tried a #Dhoni @msdhoni #NZvPAK 😂😂😂 pic.twitter.com/6aqRswIPOO — Ravi Kalle (@rt_Kalle) 22 January 2018 What a split, Sarfaraz learning ballet these days 😮 — Sawera Pasha (@sawerapasha) 22 January 2018 -
సిరీస్ గెలిచాం..అది చాలు!
కరాచీ: శ్రీలంకతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ లో పాకిస్థాన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ ను ఆడించకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీనిపై చీఫ్ సెలెక్టర్ తో సహా క్రికెట్ బోర్డు చైర్మన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అటు ఇంటా బయటా కూడా సర్ఫరాజ్ ను ఎందుకు ఆడించాలేదంటూ పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు నిలదీశారు. పాకిస్థాన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నజీమ్ సెథీ ఒక టీవీషోకు వెళ్లినప్పుడూ కూడా అభిమానుల ఘాటుగా స్పందించారు. సర్ఫరాజ్ ను పక్కకు పెట్టడానికి గల కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో కంగుతిన్న పాక్ క్రికెట్ పెద్దలు దీనిపై వివరణ ఇచ్చేందుకు సన్నద్ధమైయ్యారు. అయితే దీనిపై సర్ఫరాజ్ వివరణ ఇస్తూ.. ట్వంటీ 20 ల్లో ఆడకపోవడానికి కారణాలు ఏమీ లేవని.. టీమ్ నిబంధనల ప్రకారమే తాను ఆడలేదని స్పష్టం చేశాడు. అసలు ట్వంటీ 20 సిరీస్ లో తాను భాగస్వామిని కాదన్నాడు. తాను వన్డే సిరీస్- టెస్టు సిరీస్ కు మాత్రమే ఎంపికయ్యానన్నాడు. దీనికి వెనుక ఎటువంటి రాజకీయ వివాదాలు లేవన్నాడు. కాగా, తనకు ఎప్పుడూ జట్టులో అవకాశం ఇచ్చినా.. తాను పూర్తిస్థాయిలో ఆడటానికి ప్రయత్నిస్తానన్నాడు. 'దీనిపై రాద్దాంతం అనవసరం. ట్వంటీ 20 సిరీస్ గెలిచాం. అది చాలు. అంతర్జాతీయంగా పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ర్యాంకింగ్ కూడా పెరిగింది. నేను సంతోషంగా ఉన్నా'సర్ఫరాజ్ తెలిపాడు. శ్రీలంకతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ ను పాకిస్థాన్ 2-0 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.