ఇస్లామాబాద్: టెస్టు, టీ20 ఫార్మట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి సర్పరాజ్ అహ్మద్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)తప్పించడంతో అతడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సర్ఫరాజ్ కెరీర్ చరమాంకంలో పడిందని త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను సర్ఫరాజ్ సతీమణి ఖుష్బత్ సర్ఫరాజ్ ఖండించారు. తన భర్త ఇంకా సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడి దేశానికి అనేక విజయాలను అందిస్తాడని ధీమా వ్యక్తం చేస్తోంది.
‘సర్ఫరాజ్ ఎందుకు రిటైర్మెంట్ తీసుకోవాలి? అతడి వయసు ఇప్పుడు 32 ఏళ్లే. ధోని వయసెంతా? అతడు రిటైర్ అయ్యాడా? 38 ఏళ్లైనా ధోని ఇంకా క్రికెట్ ఆడటం లేదా? మా ఆయన కచ్చితంగా తిరిగి జట్టులోకి వస్తాడు. సర్ఫరాజ్ గొప్ప ఫైటర్. ఇక కెప్టెన్సీ నుంచి తప్పించడం పట్ల ఏ మాత్రం నిరాశ చెందటం లేదు. పీసీబీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాం. కెప్టెన్సీ నుంచి తప్పించడంతో సర్ఫరాజ్ క్రికెట్ ప్రయాణం ముగిసిపోలేదు. కెప్టెన్సీ నుంచి తప్పించడంతో సర్ఫరాజ్ ఇంకా స్వేఛ్చగా ఆడతాడు’అంటూ ఖుష్బత్ పేర్కొంది.
ఇక సర్ఫరాజ్ అహ్మద్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇది శుభపరిణామం అని అతి కొద్ది మంది పేర్కొనగా.. చాలా మంది తప్పుబట్టారు. టీ20లో పాక్‌ను నంబర్ వన్ జట్టుగా తీర్చిదిద్దిన సర్ఫరాజ్‌పై వేటువేయడంపై మండిపడుతున్నారు. బాబర్ అజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే అతడి ఆటను దెబ్బతింటుందని జావెద్ మియాందాద్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment