ఆ వీడియో చూసి నా భార్య విలపించింది: సర్ఫరాజ్‌ | Sarfaraz Says My Wife Cried When I Was Called Fat Pig | Sakshi
Sakshi News home page

ఆ వీడియో చూసి నా భార్య విలపించింది: సర్ఫరాజ్‌

Published Fri, Jun 28 2019 8:15 AM | Last Updated on Fri, Jun 28 2019 8:15 AM

Sarfaraz Says My Wife Cried When I Was Called Fat Pig - Sakshi

బర్మింగ్‌హామ్ ‌: భారత్‌ చేతిలో ఓటమి ఎదురయ్యాక తమ దేశ  అభిమాని తనను తీవ్ర పదజాలంతో దూషించడాన్ని తట్టుకోలేక తన భార్య కన్నీరుమున్నీరైందని పాకిస్తాన్‌ జట్టు కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్నాడు. ఓ మాల్‌లో పాక్‌ కెప్టెన్‌ తన కుమారుడితో వెళ్తుంటే ఓ అభిమాని సర్ఫరాజ్‌ను ఉద్దేశిస్తూ ‘పందిలా బలుస్తున్నావ్‌ ఏంటి సంగతి’ అని వాగాడు. దీన్నేమీ పట్టించుకోని సర్ఫరాజ్‌ తన దారి చూసుకున్నాడు. ఈ వీడియో సామాజిక సైట్‌లో చూసిన అతని భార్య ఖుష్‌భక్త్‌ విలపిస్తుంటే ఆమెను వారించానని చెప్పాడు. మాజీ కెప్టెన్‌ వసీమ్‌ అక్రమ్‌ తనకు అలాంటి పరిస్థితి ఎదురైతే తప్పకుండా ఆ అభిమాని చెంపచెళ్లుమనేదని అన్నాడు. అలాంటి పదజాలం వాడటాన్ని అక్రమ్‌ తీవ్రంగా ఆక్షేపించాడు. 

మరోవైపు ప్రపంచకప్‌లో పుంజుకున్న పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. భారత్‌ చేతిలో ఓడటంతో సర్వత్రా విమర్శలెదుర్కొన్న పాక్‌ వరుస మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌పై జయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ట్విట్టర్‌లో ‘జట్టుకు అభినందనలు. టోర్నీలో పుంజుకున్న తీరు అద్భుతం. ముఖ్యంగా బాబర్‌ ఆజమ్, హారిస్‌ సొహైల్, షాహిన్‌ చక్కగా రాణించారు’ అని ట్వీట్‌ చేశారు.
చదవండి: పాక్‌ విజయం: స్టెప్పులేసిన భారత ఫ్యాన్స్‌
అలాగే జరగాలని ఏమీ లేదు: పాక్‌ కెప్టెన్‌
క్రికెట్‌ చరిత్రలోనే అదో అద్భుతం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement