సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనిని కాపీ కొట్టావా అంటూ పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం పాక్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఇప్పటికే ఆతిథ్య జట్టు పాక్‌ను వన్డే సిరీస్‌లో 5-0తో వైట్ వాష్ చేయగా మూడు ట్వంటీ 20ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌ను సైతం కివీసే గెలుపొందింది. పాకిస్తాన్ విసిరిన 106 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఇంకా 25 బంతులుండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సర్ఫారాజ్ అవుటైన విధానంపై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి.
గతేడాది భారత్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన టెక్నిక్‌తో స్టంప్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. అప్పట్లో ధోనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిసింది. అదే టెక్నిక్‌ను సర్ఫరాజ్ తొలి టీ20లో ఉపయోగించాడు. కానీ ఇక్కడ సర్ఫరాజ్ అవుటయ్యాడు. ఇంకేముంది ఈ ఫోటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో సర్ఫరాజ్ నేర్చుకున్న టెక్నిక్ ఇదే అని ఒకరంటే.. లెజెండ్స్‌ను ఎప్పుడు ఫాలో కావాలని ఇంకోకరు.. ఇతరుల టెక్నిక్ కాపీ చేస్తే ఇలానే అవుతుందని మరోకరు కామెంట్ చేస్తున్నారు.
When Sarfaraz tried a #Dhoni @msdhoni #NZvPAK 😂😂😂 pic.twitter.com/6aqRswIPOO
— Ravi Kalle (@rt_Kalle) 22 January 2018
What a split, Sarfaraz learning ballet these days 😮
— Sawera Pasha (@sawerapasha) 22 January 2018
Comments
Please login to add a commentAdd a comment