కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించడాన్ని మాజీ కెప్టెన్, మాచీ చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ తీవ్రంగా తప్పుబట్టాడు. పాకిస్తాన్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన సర్ఫరాజ్‌ను మరి కొంతకాలం కెప్టెన్‌గా కొనసాగిస్తే బాగుండేదన్నాడు. సరైన టైమ్‌లో సర్ఫరాజ్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించడం నిజంగా దురదృష్టకరమన్నాడు. ఒక కెప్టెన్‌గా ఎంతో అనుభవం సాధించి తప్పుల్ని సరిదిద్దుకుంటున్న క్రమంలో సర్ఫరాజ్‌కు ఉద్వాసన చెప్పడం సరైన నిర్ణయం కాదన్నాడు. ‘ పాక్ క్రికెట్‌కు చాలా గొప్ప విజయాలను సర్ఫరాజ్ అందించాడు. ఎన్నో గుర్తిండిపోయే విజయాలు సర్ఫరాజ్ కెప్టెన్సీలో చూశాం. కానీ అతను అనుభవం గడించి తప్పుల్ని సరి చేసుకుంటున్న సమయంలో కెప్టెన్‌గా తప్పించడం బాధాకరం. సర్ఫరాజ్ కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు చాంపియన్స్ ట్రోఫీని గెలవడంతో పాటు టీ20ల్లో నంబర్ స్థానానికి చేరింది. (బయో సెక్యూర్ క్రికెట్ సాధ్యమేనా?)
దాంతో పాటు మంచి విజయాలను కూడా జట్టుకు అందించాడు. కెప్టెన్‌గా మరికొంత కాలం ఉండటానికి సర్ఫరాజ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. అతనిపై నమ్మకం లేకనే పాక్ క్రికెట్ బోర్డు సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా తీసేసింది. ఇక్కడ ఇంకా ఓపిక పడితే బాగుండేది’ అని ఇంజీ తెలిపాడు. 2016 నుంచి 2019 వరల్డ్‌కప్ వరకూ పాక్ క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా సేవలందించిన ఇంజమామ్.. గత వరల్డ్‌కప్‌లో పాక్ క్రికెటర్లు అభద్రతా భావానికి లోను కావడంతోనే నాకౌట్‌కు చేరకుండా నిష్క్రమించాల్సి వచ్చిందన్నాడు. ఇక్కడ కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను నిందించాల్సిన అవసరం లేదన్నాడు. విపరీతమైన ఒత్తిడి కారణంగా సరిగా ఆడలేమని మనసులో పెట్టుకుని అందుకు మూల్యం చెల్లించుకున్నారన్నాడు. గతంలో మూడు ఫార్మాట్లకు సర్పరాజ్ కెప్టెన్‌గా ఉండగా, వరల్డ్‌కప్ తర్వాత అతన్ని సారథ్య బాధ్యతలు తొలగించారు. తొలుత వన్డే, టీ20 ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను తీసేసిన తర్వాత టెస్టు ఫార్మాట్ నుంచి కూడా సారథిగా తీసేశారు. బాబర్ అజామ్‌కు వన్డే, టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించగా, అజహర్ అలీకి టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన జట్టులో సర్ఫరాజ్‌కు పీసీబీ అవకాశం కల్పించడం అతనికి ఊరటనిచ్చే అంశం.(‘ఎంతో మెరుగయ్యా.. కానీ నా వైపు చూడలేదు’)
Comments
Please login to add a commentAdd a comment