‘ఫిక్సర్‌’ సోట్సోబ్‌పై ఎనిమిదేళ్ల నిషేధం | Tsotsobe handed eight-year ban | Sakshi
Sakshi News home page

‘ఫిక్సర్‌’ సోట్సోబ్‌పై ఎనిమిదేళ్ల నిషేధం

Published Wed, Jul 12 2017 12:52 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

‘ఫిక్సర్‌’ సోట్సోబ్‌పై ఎనిమిదేళ్ల నిషేధం

‘ఫిక్సర్‌’ సోట్సోబ్‌పై ఎనిమిదేళ్ల నిషేధం

కేప్‌టౌన్‌: స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ లోన్‌వాబో సోట్సోబ్‌పై ఆ దేశ బోర్డు ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. 2015లో దక్షిణాఫ్రికా దేశవాళీ టి20 టోర్నీ రామ్‌స్లామ్‌లో అతను ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. ఈ వివాదంలో నిషేధం ఎదుర్కొంటున్న ఏడో ఆటగాడు సోట్సోబ్‌.

దక్షిణాఫ్రికా తరఫున అతను 5 టెస్టులు, 61 వన్డేలు, 23 టి20లు ఆడాడు. రెండేళ్ల క్రితం ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సమయంలో ఫిక్సింగ్‌ వైపు మొగ్గు చూపినట్లు అంగీకరించిన సోట్సోబ్, అభిమానులను క్షమించమని కోరాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement