స్పాట్ ఫిక్సింగ్ వంటి అనైతిక పనికి పాల్పడాలనే ఉద్దేశంతో తన సహచరులు ఉన్నారనే ఆలోచన తనకెప్పుడూ రాలేదని రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ హర్మీత్ సింగ్ అన్నాడు. శ్రీశాంత్, చవాన్, చండీలా ఫిక్సింగ్ సమాచారం తెలిసి కూడా చెప్పలేదంటూ బీసీసీఐ జారీ చేసిన షోకాజ్ నోటీస్‌కు హర్మీత్ సమాధానమిచ్చాడు.
ముంబై: స్పాట్ ఫిక్సింగ్ వంటి అనైతిక పనికి పాల్పడాలనే ఉద్దేశంతో తన సహచరులు ఉన్నారనే ఆలోచన తనకెప్పుడూ రాలేదని రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ హర్మీత్ సింగ్ అన్నాడు. శ్రీశాంత్, చవాన్, చండీలా ఫిక్సింగ్ సమాచారం తెలిసి కూడా చెప్పలేదంటూ బీసీసీఐ జారీ చేసిన షోకాజ్ నోటీస్‌కు హర్మీత్ సమాధానమిచ్చాడు.
వారి ఉద్దేశాలు ఏమిటో తెలీదు కాబట్టే బోర్డుకు ఆ సమాచారం ఇవ్వలేకపోయానని చెప్పాడు. గత ఏడాది అండర్-19 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన హర్మీత్‌సింగ్‌ను క్రమశిక్షణా కమిటీ విచారణ పూర్తయ్యే వరకు బీసీసీఐ సస్పెండ్ చేసింది.