న్యూఢిల్లీ : స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై 13 మంది క్రికెటర్ల పేర్లతో కూడిన ముకుల్ ముద్గల్ నివేదికను.. తదుపరి విచారణ కోసం జస్టిస్ లోధా కమిటీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. బీహార్ క్రికెట్ సంఘం (సీఏబీ) కార్యదర్శి ఆదిత్య వర్మ సోమవారం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ నేటి (శుక్రవారం) మధ్యాహ్నం అత్యవసర విచారణ జరుపుతుంది.
గత నవంబర్‌లో ముద్గల్ కమిటీ ఇచ్చిన మూడో నివేదికలో ఉన్న పలువురి క్రికెటర్ల పేర్లు ఇప్పటిదాకా బహిర్గతం కాలేదు. ఈ రిపోర్ట్‌ను లోధా కమిటీకి ఇవ్వలేదని వర్మ తెలిపారు. దీని కారణంగా ముద్గల్ కమిటీ తీసుకున్న సమయం, చేసిన పరిశోధన వృథా అయ్యిందని అన్నారు. ఆటగాళ్ల పేర్లను వెల్లడించకూడదని అప్పట్లో బీసీసీఐ కోర్టును కోరింది.
ముద్గల్ కమిటీ నివేదికపై నేడు విచారణ
Published Fri, Aug 7 2015 12:49 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement