Mukul Mudgal
-
ఢిల్లీ టెస్టు మ్యాచ్ పై నివేదిక సిద్ధం!
న్యూఢిల్లీ: గత ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య నగరంలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో అనేక వివాదాల నడుమ జరిగిన టెస్టు మ్యాచ్ కు సంబంధించి నివేదిక సిద్ధమైంది. దీనిపై ఏర్పాటైన రిటైర్డ్ జస్టిస్ ముద్గల్ నేతృత్వంలోని పరిశీలన కమిటీ తన పూర్తి నివేదికను త్వరలో హైకోర్టుకు సమర్పించనుంది. ఢిల్లీ టెస్టు మ్యాచ్ నిర్వహణపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఈనెల 18వ తేదీన కోర్టుకు ఇవ్వనున్నట్లు ముద్గల్ మీడియాకు తెలిపారు. గతంలో ఢిల్లీ టెస్టు మ్యాచ్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి-డీడీసీఏల మధ్య చోటు చేసుకోవడంతో ఆ వ్యవహారం ఢిల్లీ హైకోర్టు చేరిన సంగతి తెలిసిందే. 2008-12 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి డీడీసీఏ వినోదపు పన్ను చెల్లించని కారణంగా దానిపై దర్యాప్తుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. వినోదపు పన్ను రూపంలో ప్రభుత్వానికి రూ.24.45 కోట్లు చెల్లించాలని వివాదానికి తెరలేపారు. ఒకవేళ కానిపక్షంలో ఢిల్లీలో జరగాల్సిన టెస్టు మ్యాచ్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వబోమని హెచ్చరించారు. దీంతో డీడీసీఏ హైకోర్టుకు వెళ్లడంతో మ్యాచ్ నిర్వహణను అడ్డుకోవద్దని ప్రభుత్వానికి సృష్టం చేసింది. అందుకు హామీగా కోటి రూపాయిలను ప్రభుత్వానికి చెల్లించాలిన హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. దీనికి డీడీసీఏ అంగీకారం తెలపడంతో టెస్టు మ్యాచ్ కు క్లియరెన్స్ లభించింది. కాగా ఈ వ్యవహారంపై రిటైర్డ్ జస్జిస్ ముద్గల్ నేతృత్వంలో పరిశీలన కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ వివాదానికి సంబంధించిన నివేదికను తయారు చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. -
ముద్గల్ కమిటీ నివేదికపై నేడు విచారణ
న్యూఢిల్లీ : స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై 13 మంది క్రికెటర్ల పేర్లతో కూడిన ముకుల్ ముద్గల్ నివేదికను.. తదుపరి విచారణ కోసం జస్టిస్ లోధా కమిటీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. బీహార్ క్రికెట్ సంఘం (సీఏబీ) కార్యదర్శి ఆదిత్య వర్మ సోమవారం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ నేటి (శుక్రవారం) మధ్యాహ్నం అత్యవసర విచారణ జరుపుతుంది. గత నవంబర్‌లో ముద్గల్ కమిటీ ఇచ్చిన మూడో నివేదికలో ఉన్న పలువురి క్రికెటర్ల పేర్లు ఇప్పటిదాకా బహిర్గతం కాలేదు. ఈ రిపోర్ట్‌ను లోధా కమిటీకి ఇవ్వలేదని వర్మ తెలిపారు. దీని కారణంగా ముద్గల్ కమిటీ తీసుకున్న సమయం, చేసిన పరిశోధన వృథా అయ్యిందని అన్నారు. ఆటగాళ్ల పేర్లను వెల్లడించకూడదని అప్పట్లో బీసీసీఐ కోర్టును కోరింది. -
విచారణ కమిటీ ఏర్పాటుపై తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో ఆరోపణలను విచారించాల్సిన కమిటీ ఏర్పాటును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఎన్.శ్రీనివాసన్‌తో పాటు మరో 12మందిపై విచారణ జరిపేందుకు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిషన్‌కే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారనే కథనాలు వినిపించాయి. అయితే ఈ కమిటీపై బీసీసీఐ అభ్యంతరం లేవనెత్తింది. ఈ కమిషన్ స్థానంలో తాజాగా మరో కమిటీ ఏర్పాటు చేయాలని కోరింది. దీంతో జస్టిస్ ఏకే పట్నాయక్‌తో కూడిన బెంచ్ తమ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇంతకుముందు ఇదే అంశంపై బోర్డు వర్కింగ్ కమిటీ... త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయగా సుప్రీం కోర్టు తిరస్కరించింది. ముద్గల్ కమిటీయే ఈ విచారణకు ముందుకు వస్తే బాగుంటుందని సూచనప్రాయంగా వెల్లడించింది. దీనికి అటు ముద్గల్ కమిటీ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే ఆ కమిటీపై తమకు నమ్మకం లేదని, వారు ఇప్పటిదాకా అందించిన నివేదిక తప్పుల తడకగా ఉందని బీసీసీఐ ఆరోపించింది. శ్రీనివాసన్, మరో 12 మందిపై ముద్గల్ కమిటీ చేసిన ఆరోపణలపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయానికి రాలే దని, కొత్తగా ఏర్పాటయ్యే కమిటీ ఈ వ్యవహారాన్ని చూస్తుందని కోర్టు తెలిపింది. కమిటీ నివేదికలో ఉన్న విషయాలను రహస్యంగా ఉంచేందుకే ముద్గల్ కమిటీకి విచారణ అధికారం అప్పగించాలని భావించామని, మరో కమిటీ వస్తే ఇందులోని విషయాలు వారికి కూడా తెలిసిపోతాయని కోర్టు అభిప్రాయపడింది. సిద్ధంగా ఉన్న ముద్గల్ కమిటీ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపేందుకు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తమ సంసిద్ధతను తెలిపింది. ఈ విషయంలో తమకు సహాయకంగా ఉండేందుకు సీబీఐ (స్పెషల్ డెరైక్టర్) మాజీ అధికారి ఎంఎల్ శర్మ సేవలను వినియోగించుకుంటామని కోర్టుకు తెలిపింది. శర్మతో పాటు ముంబై, ఢిల్లీ, చెన్నైలకు చెందిన ఒక్కో పోలీస్ అధికారి... ఓ మాజీ క్రికెటర్ ఉంటాడని బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) కార్యదర్శి ఆదిత్య వర్మ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. -
పార్టీలే చెడగొట్టాయి జస్టిస్ ముద్గల్ వ్యాఖ్య
ఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత క్రికెట్‌కు మంచిదే అయినప్పటికీ... కాసుల వర్షం కురవడమే అసలు వివాదాలకు కారణమని జస్టిస్ ముకుల్ ముద్గల్ అన్నారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై ఇటీవలే ఆయన సమర్పించిన నివేదిక భారత క్రికెట్లో సంచలనం రేపింది. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన పార్టీలే మొత్తం వివాదాలకు కేంద్ర బిందువయ్యాయని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో చెప్పారు. తానిచ్చిన నివేదికతో ఇప్పుడు వివాదాలు తగ్గు ముఖం పడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘నిస్సందేహంగా ఈ టోర్నీ యువ ఆటగాళ్లకు మంచి అవకాశాల్ని కల్పించింది. ఐపీఎల్లో ఆటగాళ్లపై కనకవర్షం కురిసింది. వారిని సెలెబ్రిటీలను చేసింది. అనుకోకుండా వచ్చి పడిన డబ్బుల కారణంగా వారిలో అహంకారం పెరిగిపోయింది. అయితే ఆటగాళ్లు డబ్బులు సంపాదించడానికి నేను వ్యతిరేకం కాదు’ అని జస్టిస్ ముద్గల్ అన్నారు. లేట్‌నైట్ పార్టీలు కొందరు యువ ఆటగాళ్లను చెడగొట్టాయని ముద్గల్ విమర్శించారు.