ఢిల్లీ టెస్టు మ్యాచ్ పై నివేదిక సిద్ధం!
న్యూఢిల్లీ: గత ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య నగరంలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో అనేక వివాదాల నడుమ జరిగిన టెస్టు మ్యాచ్ కు సంబంధించి నివేదిక సిద్ధమైంది. దీనిపై ఏర్పాటైన రిటైర్డ్ జస్టిస్ ముద్గల్ నేతృత్వంలోని పరిశీలన కమిటీ తన పూర్తి నివేదికను త్వరలో హైకోర్టుకు సమర్పించనుంది. ఢిల్లీ టెస్టు మ్యాచ్ నిర్వహణపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఈనెల 18వ తేదీన కోర్టుకు ఇవ్వనున్నట్లు ముద్గల్ మీడియాకు తెలిపారు.
గతంలో ఢిల్లీ టెస్టు మ్యాచ్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి-డీడీసీఏల మధ్య చోటు చేసుకోవడంతో ఆ వ్యవహారం ఢిల్లీ హైకోర్టు చేరిన సంగతి తెలిసిందే. 2008-12 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి డీడీసీఏ వినోదపు పన్ను చెల్లించని కారణంగా దానిపై దర్యాప్తుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. వినోదపు పన్ను రూపంలో ప్రభుత్వానికి రూ.24.45 కోట్లు చెల్లించాలని వివాదానికి తెరలేపారు. ఒకవేళ కానిపక్షంలో ఢిల్లీలో జరగాల్సిన టెస్టు మ్యాచ్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వబోమని హెచ్చరించారు. దీంతో డీడీసీఏ హైకోర్టుకు వెళ్లడంతో మ్యాచ్ నిర్వహణను అడ్డుకోవద్దని ప్రభుత్వానికి సృష్టం చేసింది. అందుకు హామీగా కోటి రూపాయిలను ప్రభుత్వానికి చెల్లించాలిన హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. దీనికి డీడీసీఏ అంగీకారం తెలపడంతో టెస్టు మ్యాచ్ కు క్లియరెన్స్ లభించింది. కాగా ఈ వ్యవహారంపై రిటైర్డ్ జస్జిస్ ముద్గల్ నేతృత్వంలో పరిశీలన కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ వివాదానికి సంబంధించిన నివేదికను తయారు చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.