
ఆ నివేదికపై మాట్లాడేంత తెలివైన వాడిని కాను: సచిన్
న్యూఢిల్లీ: 2013 ఐపీఎల్ టోర్నీలో స్పాట్ ఫిక్సింగ్ , బెట్టింగ్ వ్యవహారాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై వ్యాఖ్యానించడానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విముఖత వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తానేమీ వ్యాఖ్యానించలేనన్నాడు.
' ఆ కేసును సుప్రీంకోర్టు దర్యాప్తు చేస్తోంది. ఆ ఫిక్సింగ్ వ్యవహారంపై మాట్లాడేంత తెలివైన వాడిని కాను'అని మాస్టర్ స్పష్టం చేశాడు. ఆ కేసులో దోషులను కోర్టే శిక్షిస్తోందని సచిన్ తెలిపాడు. ఫిక్సింగ్ వ్యవహారంపై ముద్గల్ కమిటీ సమర్పించిన నివేదికపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరుపనుంది.