
చెన్నై: తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) నూతన అధ్యక్షురాలిగా.... బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూప గురునాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారంతో నామినేషన్ గడువు ముగిసింది. అధ్యక్ష పదవికి రూప ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లుగా ప్రకటించారు. దీంతోపాటు సంఘంలోని ఇతర పదవులు శ్రీనివాసన్ వర్గానికే దక్కాయి. ఉపాధ్యక్షులుగా టీజే శ్రీనివాస్ రాజ్ (సిటీ), డా.పి అశోక్ సిగమణి (జిల్లాలు), సెక్రటరీగా ఆర్‌ఎస్ రామసామి, జాయింట్ సెక్రటరీగా కేఏ శంకర్, సహ కార్యదర్శిగా ఎన్.వెంకట్రామన్, కోశాధికారిగా జె.పార్థసారథిలను ఎన్నుకున్నారు.