శ్రీనివాసన్.. ఇక తప్పుకో చాలు: సుప్రీం | N Srinivasan must step down for free and fair probe in IPL spot fixing scandal: supreme court | Sakshi
Sakshi News home page

శ్రీనివాసన్.. ఇక తప్పుకో చాలు: సుప్రీం

Published Tue, Mar 25 2014 11:35 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

శ్రీనివాసన్.. ఇక తప్పుకో చాలు: సుప్రీం - Sakshi

శ్రీనివాసన్.. ఇక తప్పుకో చాలు: సుప్రీం

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ మెడకు చుట్టుకుంది. స్పాట్ ఫిక్సింగ్ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే శ్రీనివాసన్ స్వయంగా ఆ పదవి నుంచి తప్పుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయ పడింది. ఆయన తనంతట తాను ఆ పదవి నుంచి వైదొలుగుతారా లేక తాము జోక్యం చేసుకోవాలా అంటూ శ్రీనివాసన్ తరపు న్యాయవాదులను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

లేకుంటే బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సి వస్తుందని హెచ్చరించింది. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయకుండా ఆ కుర్చీని అంటిపెట్టుకుని ఉండటంలో అంతర్యమేమిటని సుప్రీం ప్రశ్నించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు దర్యాప్తు చూస్తుంటే వాంతు వచ్చేలా ఉందని సుప్రీం వ్యాఖ్యానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement