
కౌలాలంపూర్: వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి అనుకూలమైన ‘డ్రా’ లభించింది. మూడో సీడ్ పొందిన సాత్విక్–చిరాగ్‌లకు గ్రూప్ ‘సి’లో చోటు దక్కింది. ఇదే గ్రూప్‌లో ఫజర్–అర్దియాంతో (ఇండోనేసియా), లమ్స్‌ఫుస్–సీడెల్ (జర్మనీ), కోరీ్వ–లాబర్ (ఫ్రాన్స్) జంట లు ఉన్నాయి.
ఈ మూడు జోడీలు కూడా గతంలో ఒక్కసారి కూడా సాత్విక్–చిరాగ్‌లను ఓడించలేదు. ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రూప్‌ల్లో నాలుగు జంటలు... ‘డి’ గ్రూప్‌లో ఐదు జోడీలున్నాయి. లీగ్ దశ తర్వాత ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జోడీలు క్వార్టర్ ఫైనల్ చేరుకుంటాయి.
నాకౌట్ దశ లో గ్రూప్ ‘టాపర్’గా నిలిచిన జోడీలు మరో గ్రూప్ ‘టాపర్’తో తలపడే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో సాత్విక్–చిరాగ్ ద్వయం గ్రూప్ టాపర్‌గా నిలిస్తే క్వార్టర్ ఫైనల్లోనూ సులువైన ప్రత్యర్థి ఎదురయ్యే చాన్స్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment