పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. టోర్నీ రెండో సీడ్‌ను కంగుతినిపించి క్వార్టర్స్‌లో ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జంట 21–18, 18–21, 21–13తో మొహమ్మద్ హసన్– హెండ్రా సెతియావాన్ (సింగపూర్) ద్వయంపై చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. తొలి గేమ్‌ను గెల్చుకున్న సాయిరాజ్ జంట రెండో గేమ్‌ను కోల్పోయినా... మూడో గేమ్‌లో పుంజుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది.
మరోవైపు భారత టాప్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహా్వల్ నిలకడగా ఆడుతున్నారు. ప్రిక్వార్టర్స్ మ్యాచుల్లో తమ ప్రత్యర్థులపై అలవోక విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించారు. టోర్నీ ఐదో సీడ్ సింధు 21–10, 21–13తో యో జియా మిన్ (సింగపూర్)పై సునాయాస విజయం సాధించిం ది. మరో ప్రిక్వార్టర్ పోరులో సెనా నెహ్వాల్ 21–10, 21–11తో లినె హోజ్మార్క్ జెర్స్‌ఫెట్ (డెన్మార్క్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శుభాంకర్ డే (భారత్) 6–21, 13–21తో శెసర్ హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా) చేతిలో ఓడాడు.
Comments
Please login to add a commentAdd a comment