ఫైనల్లో సాత్విక్‌ జోడి | Satwiksairaj And Chirag Enter Mens Doubles Final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సాత్విక్‌ జోడి

Published Sat, Aug 3 2019 4:32 PM | Last Updated on Sat, Aug 3 2019 4:44 PM

Satwiksairaj And Chirag Enter Mens Doubles Final - Sakshi

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ – 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత జోడి సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడి ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగన పురుషుల డబుల్స్‌ సెమీ ఫైనల్లో సాత్విక్‌ ద్వయం 22-20, 22-24, 21-9 తేడాతో  కొ సంగ్‌ హ్యూన్‌ – షిన్‌ బేక్‌ చియోల్‌ (కొరియా) జోడిపై గెలిచి ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంది. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ల జోడి.. రెండో గేమ్‌లో ఓటమి పాలైంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్‌-చిరాట్‌ల ద్వయం రెచ్చిపోయి ఆడింది. ఏ దశలోనూ  కొ సంగ్‌ హ్యూన్‌ – షిన్‌ బేక్‌ చియోల్‌లకు అవకాశం ఇవ్వకుండా భారీ తేడాతో గేమ్‌ను గెలుచుకోవడంతో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. ఆదివారం జరుగనున్న ఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ల జోడి లి జున్‌ హు- యు చెన్‌(చైనా)తో తలపడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement