
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ విజేతగా భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన చెన్ బో యాంగ్, లియు యిపై 21-15 21-15 తేడాతో విజయం సాధించిన ఈ భారత ద్వయం.. తొమ్మిదవ వరల్డ్ టూర్ టైటిల్ తమ ఖాతాలో వేసుకున్నారు.
వరుస గేమ్‌లలో ప్రత్యర్ధి జోడీని ప్రపంచ నం.3 సాత్విక్ ద్వయం చిత్తు చేసింది. ఏ దశలోనూ ప్రత్యర్ధికి కోలుకునే అవకాశం సాత్విక్, చిరాగ్ జంట ఇవ్వలేదు. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు టైటిల్‌ను సొంతం చేసుకోవడం ఈ జోడికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.
ఇక ప్రస్తుత బీడబ్ల్యూఎఫ్ సీజన్‌లో ఈ జోడికి ఇది రెండువ టైటిల్ కావడం విశేషం. అంతకుముందు మార్చిలో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ టైటిల్‌ను ఈ జోడీ సొంతం చేసుకుంది. అదేవిధంగా మలేషియా సూపర్ 1000,ఇండియా సూపర్ 750 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment