సాక్షి, గుంటూరు: ఇండోనేసియా ఓపెన్ టైటిల్ గెలిచిన సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీని సీఎం జగన్ ట్విటర్ వేదికగా మరోసారి అభినందించారు. మన తెలుగు కుర్రాడు సాత్విక్‌సాయిరాజ్‌తో పాటు అతనికి జోడీగా టైటిల్ నెగ్గిన శెట్టి చిరాగ్‌కు సైతం సీఎం జగన్ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు తేజం సాత్విక్‌సాయిరాజ్‌కి, అలాగే చిరాగ్ శెట్టిలకు శుభాకాంక్షలు. అందరూ గర్వపడేలా గెలుపొందారంటూ ట్వీట్ చేశారాయన. అంతకు ముందు ఒక ప్రకటన ద్వారా.. భవిష్యత్తులో ఈ జోడీ మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించిన సంగతి తెలిసిందే.
ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టైటిల్‌ను భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఈ భారత ద్వయం.. వరల్డ్ ఛాంపియన్స్ ఆరోన్ చియా-వూయ్ ఇక్ సోహ్ (మలేసియా) జోడీపై వరుస సెట్లలో (21-17, 21-18) విజయం సాధించి, స్వర్ణ పతకం చేజిక్కించుకున్నారు.
My congratulations and best wishes to our very own Telugu boy @satwiksairaj and @Shettychirag04!
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 19, 2023
You’ve made us all very proud. pic.twitter.com/VLJxScA29n
ఇదీ చదవండి: ఏపీకి నాలుగు జాతీయ జల అవార్డులు
Comments
Please login to add a commentAdd a comment