డెన్మార్క్ ఓపెన్‌లో ముగిసిన భారత పోరాటం | Denmark Open 2022: Lakshya Sen, Chirag, Rankireddy Exit To End India Campaign | Sakshi

Denmark Open 2022: డెన్మార్క్ ఓపెన్‌లో ముగిసిన భారత పోరాటం

Oct 22 2022 8:17 PM | Updated on Oct 22 2022 8:18 PM

Denmark Open 2022: Lakshya Sen, Chirag, Rankireddy Exit To End India Campaign - Sakshi

ఓడెన్స్‌ (డెన్మార్క్): డెన్మార్క్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. శుక్రవారం​ జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్ ఫైనల్‌లో కామన్‌వెల్త్ గేమ్స్‌ స్వర్ణ పతక విజేత లక్ష్య సేన్.. జపాన్‌కు చెందిన కొడాయ్ నరవోకా చేతిలో 17-21, 12-21 తేడాతో వరుస సెట్లలో ఓటమి పాలవ్వగా, ఇవాళ (అక్టోబర్‌ 22) జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో చిరాగ్‌ శెట్టి-సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకీరెడ్డి జోడీ.. డిఫెండింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్స్‌, మలేషియాకు చెందిన ఆరోన్‌ చియా-సో వేయ్‌ ఇక్‌ జోడీ చేతిలో 16-21, 19-21 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

వీరి ఓటమితో ఈ టోర్నీలో భారత పోరాటం సమాప్తమైంది. ఈ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, కిదాంబి శ్రీకాంత్‌, సైనా నెహ్వాల్‌ ప్రిలిమినరీ దశలో ఓటమిపాలయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement