తొలి రౌండ్లోనే ఓడిన ప్రపంచ నంబర్‌వన్ జోడీ
సింగపూర్ ఓపెన్ టోర్నీ
సింగపూర్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి అనూహ్య పరాజయం ఎదురైంది. సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సాత్విక్– చిరాగ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 34వ స్థానంలో ఉన్న డానియల్ లుండ్‌గార్డ్– మాడ్స్ వెస్టెర్గార్డ్ (డెన్మార్క్) ద్వయం 22–20, 21–18తో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీని బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ పలు దశల్లో సాత్విక్–చిరాగ్ ఆధిక్యంలో ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు.
ఈ టోర్నీకి ముందు సాత్విక్–చిరాగ్ సీజన్లో ఆరు టోర్నీలు ఆడి ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో, థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో టైటిల్స్ నెగ్గారు. మలేసియా సూపర్–1000, ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచి, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment