కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో సాత్విక్ –చిరాగ్ ద్వయం 21–18, 21–19తో మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రి–మౌలానా బాగస్ (ఇండోనేసియా) జంట పై గెలిచింది.
పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 14–21, 11–21తో ఆండెర్స్ ఆంటోన్సన్ (డెన్మార్క్) చేతిలో... లక్ష్య సేన్ 15–21, 16–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు.
Comments
Please login to add a commentAdd a comment