Malaysia Open
-
Malaysia Open 2024: రన్నరప్ సాత్విక్–చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాలని ఆశించిన భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్–చిరాగ్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జంటతో ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–9, 18–21, 17–21తో ఓడిపోయింది. 58 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్–చిరాగ్ 10–3తో ఏకంగా 7 పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. కానీ ఒత్తిడికిలోనై, అనవసర తప్పిదాలు చేసి భారత జంట చైనా జోడీకి పుంజుకునే అవకాశం ఇచి్చంది. రన్నరప్‌గా నిలిచిన సాత్విక్–చిరాగ్‌లకు 45,500 డాలర్ల (రూ. 37 లక్షల 71 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
అశ్విని–తనీషా సంచలనం
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 24వ ర్యాంక్ ద్వయం అశ్విని–తనీషా 21–19, 13–21, 21–15తో ప్రపంచ 9వ ర్యాంక్ జంట వకాన నాగహార–మాయు మత్సుమోటో (జపాన్)ను బోల్తా కొట్టించింది. ఈ గెలుపుతో సూపర్–1000 స్థాయి టోర్నీలో అశ్విని–తనీషా ద్వయం తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ 21–11, 21–18తో లుకాస్ కోర్వి–రొనన్ లాబర్ (ఫ్రాన్స్)లపై గెలిచారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్ కథ ముగిసింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 13–21, 17–21తో ఓడిపోయాడు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో సాత్విక్ –చిరాగ్ ద్వయం 21–18, 21–19తో మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రి–మౌలానా బాగస్ (ఇండోనేసియా) జంట పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 14–21, 11–21తో ఆండెర్స్ ఆంటోన్సన్ (డెన్మార్క్) చేతిలో... లక్ష్య సేన్ 15–21, 16–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. -
Malaysia Open 2024: కిడాంబి శ్రీకాంత్ సంచలనం
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ సంచలన విజయంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 12–21, 21–18, 21–16తో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తదుపరి రౌండ్లో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో శ్రీకాంత్ తలపడతాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప–తనీషా (భారత్) జోడీ 21–13, 21–16తో ఫ్రాన్సెస్కా కోర్బి–అలీసన్ లీ (అమెరికా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
శ్రీకాంత్‌కు సవాల్.. నేటి నుంచి మలేసియా ఓపెన్
కౌలాలంపూర్: గత సీజన్ భారత స్టార్ షట్లర్లకు మిశ్రమ ఫలితాలిచి్చంది. కానీ ఇప్పుడు ఒలింపిక్ నామ సంవత్సరం కావడంతో మన బ్యాడ్మింటన్ ఆటగాళ్లంతా నూతనోత్సాహంతో కొత్త సీజన్‌కు శ్రీకారం చుట్టేపనిలో ఉన్నారు. నేటి నుంచి జరిగే మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో శుభారంభమే లక్ష్యంగా మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, ప్రపంచ 8వ ర్యాంకర్ ప్రణయ్, డబుల్స్‌లో అగ్రశ్రేణి జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కోటి ఆశలతో కొత్త ఏడాదిని విజయవంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు. నేడు జరిగే తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో శ్రీకాంత్, వెంగ్ హాంగ్ యంగ్ (చైనా)తో లక్ష్య సేన్ తలపడతారు. -
సింధు ముందుకు.. సైనా ఇంటికి
మలేషియా ఓపెన్ 2022లో భారత్‌కు ఇవాళ (జూన్ 29) మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్, ప్రపంచ 7వ ర్యాంకర్ పీవీ సింధు రెండో రౌండ్లోకి ప్రవేశించగా.. 2012 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. వరల్డ్ నంబర్ 10 ప్లేయర్ పోన్‌పావీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)పై సింధు 21-13, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించగా.. అమెరికాకు చెందిన ఐరిస్ వాంగ్ చేతిలో 11-21, 17-21 తేడాతో సైనా ఓటమిపాలైంది. మరోవైపు డబుల్స్ పెయిర్ బి సుమీత్ రెడ్డి- అశ్విని పొన్నప్ప.. నెదర్లాండ్స్ జోడీ రాబిన్ టాబెలింగ్-సెలెనా పీక్ చేతిలో 15-21, 21-19 17-21 తేడాతో ఓటమిపాలవగా, పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లో విజయం సాధించాడు. ప్రణయ్.. స్థానిక ఆటగాడు ల్యూ డారెన్‌పై 21-14, 17-21, 21-18తేడాతో గెలుపొందాడు. చదవండి: 23 గ్రాండ్‌స్లామ్‌ల విజేతకు షాక్.. తొలి రౌండ్లోనే నిష్క్రమణ -
Malaysia Open: తొలి రౌండ్లోనే అవుట్.. పోరాడి ఓడిన సాయి ప్రణీత్
కౌలాలంపూర్: భారత అగ్రశ్రేణి షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ మలేసియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 19వ ర్యాంకర్ సాయిప్రణీత్ 15–21, 21–19, 9–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ సీజన్లో సాయిప్రణీత్ ఏడు టోర్నీలలో పాల్గొనగా, ఆరింటిలో తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. మరోవైపు సమీర్ వర్మ కూడా తొలి రౌండ్లోనే ఓడిపోగా, ప్రణయ్ శుభారంభం చేశాడు. 2018 ఆసియా క్రీడల చాంపియన్ క్రిస్టీ (ఇండోనేసియా) 21–14, 13–21, 21–7తో సమీర్ వర్మను ఓడించగా... ప్రణయ్ 21–14, 17–21, 21–18తో డారెన్ లూ (మలేసియా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–18, 21–11 తో మాన్ వె చోంగ్–కయ్ వున్ టీ (మలేసియా) జోడీపై గెలి చింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని (భారత్) జంట 15– 21, 11–21తో మత్సుయామ–చిహారు (జపాన్) జోడీ చేతిలో ఓడింది. చదవండి: Wimbledon 2022: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఆ ఘనత సాధించిన ఏకైక మొనగాడిగా రికార్డు -
క్వార్టర్స్ అడ్డంకిని దాటలేకపోయారు..
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నమెంట్లో భారత్ కథ ముగిసింది. ఈరోజు(శుక్రవారం) జరిగిన మహిళల సింగిల్స్ పోరులో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులు ఓటమి పాలయ్యారు. వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి దారి పట్టడంతో భారత్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 16-21, 17-21 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చెందగా, సైనా నెహ్వాల్ 8-21, 7-21 తేడాతో మాజీ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓటమి చెందారు. ఈ సీజన్ ఆరంభపు టోర్నీని ఘనంగా ఆరంభించాలని చూసిన సైనా నెహ్వాల్, పీవీ సింధులు క్వార్టర్స్ అడ్డంకిని దాటలేకపోయారు. ఇది తై జు యింగ్ చేతిలో సింధుకు వరుసగా రెండో పరాజయం. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సింధును తై జు యింగ్ ఓడించారు. తై జు యింగ్ తాజా విజయంతో ముఖాముఖి రికార్డును 12-5 తేడాతో మరింత పెంచుకుంది. ఇక సైనా నెహ్వాల్ అరగంటలోనే చేతులెత్తేశారు. -
సైనా నెహ్వాల్ ప్రతీకార విజయం
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నమెంట్లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. ఈ రోజు జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రి క్వార్టర్స్‌లో సైనా 25-23, 21-12 తేడాతో వరల్డ్ తొమ్మిదో ర్యాంకర్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరారు. రెండు వరుస గేమ్‌ల్లో సైనా విజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు. ఇరువురి మధ్య తొలి గేమ్ హోరీ హోరీగా సాగింది. తొలి గేమ్‌లో సైనా ఐదు పాయింట్లతో ఆధిక్యంలో నిలవగా, ఆపై ఆన్ సెంగ్ పుంజుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువురి స్కోరు 23-23గా సమంగా నిలిచింది. ఆపై సైనా వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక రెండో గేమ్ ఏకపక్షంగా జరిగింది. ఆన్ సె యంగ్‌కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా వరుసగా పాయింట్లు సాధిస్తూ సైనా దూసుకుపోయారు. ఫలితంగా 10 పాయింట్ల తేడాతో ఆన్ సె యంగ్‌పై పైచేయి సాధించిన సైనా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకున్నారు. ఆన్ సె యంగ్‌పై సైనాకు ఇది తొలి విజయం. గతేడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సైనాపై ఆన్ సె యంగ్ విజయం సాధించారు. తాజా గెలుపుతో దానికి సైనా ప్రతీకారం తీర్చుకున్నారు. తదుపరి గేమ్‌లో స్పెయిన్ స్టార్ కరోలినా మార్టిన్‌తో సైనా తలపడనున్నారు. -
శ్రీకాంత్ ఓటమి
కౌలాలంపూర్: తొలిరోజేమో సమీర్ వర్మ, హెచ్.ఎస్.ప్రణయ్... రెండో రోజు సైనా నెహ్వాల్... మూడో రోజు పీవీ సింధు... ఇలా మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మొదలైన రోజు నుంచి ప్రతీ రౌండ్లో ఒకరిద్దరు భారత షట్లర్లు ఓడుతూ వచ్చారు. నేడు కిడాంబి శ్రీకాంత్ ఓటమితో భారత్ పోరాటం ముగిసింది. బరిలో మిగిలివున్న ఒకే ఒక్క తెలుగుతేజం క్వార్టర్ ఫైనల్లో కంగుతిన్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 18–21, 19–21తో ఒలింపిక్ చాంపియన్, నాలుగో సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. తొలిగేమ్ ఆరంభంలో 6–3తో జోరు పెంచిన శ్రీకాంత్ ఒక్కసారి మినహా 16–15స్కోరు దాకా ఆధిక్యంలోనే కొనసాగాడు. కానీ ఒలింపిక్ చాంపియన్ ఆఖర్లో జాగ్రత్తగా ఆడటం, ఏపీ ఆటగాడు అనవసర తప్పిదాలు చేయడం గేమ్‌ను చేజార్చింది. రెండో గేమ్‌లో ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. 7–8 వరకు చక్కగా పోరాడిన తెలుగు షట్లర్... చెన్ లాంగ్ జోరు పెంచడంతో 8–16తో వెనుకబడ్డాడు. ఆ తర్వాత పుంజుకున్న శ్రీకాంత్ వరుసగా పాయింట్లు గెలిచి 18–18తో ప్రత్యర్థిని నిలువరించాడు. చివర్లో మళ్లీ చైనా ఆటగాడు వరుసగా స్కోరు చేయడంతో శ్రీకాంత్‌కు పరాజయం తప్పలేదు. వీళ్లిద్దరు ఇప్పటి వరకు ఏడు సార్లు ముఖాముఖీగా తలపడ్డారు. భారత స్టార్ ఒకే ఒక్కసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ (2017)లో గెలిచాడు. ఇది మినహా నేటి మ్యాచ్ సహా ఆరు సార్లు ఆంధ్రప్రదేశ్ ఆటగాడికి ఓటమి ఎదురైంది. -
క్వార్టర్స్‌లో శ్రీకాంత్ ఓటమి
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ శ్రీకాంత్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో శ్రీకాంత్ 18-21, 19-21 తేడాతో ఒలింపిక్ చాంపియన్, నాలుగో సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో శ్రీకాంత్ ఒత్తిడిని అధిగమించలేక ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్‌ను మూడు పాయింట్ల తేడాతో కోల్పోయిన శ్రీకాంత్.. రెండో గేమ్‌ను రెండు పాయింట్ల తేడాతో వదులుకున్నాడు. ఫలితంగా టోర్నీ నుంచి శ్రీకాంత్ నిష్క్రమించాడు. -
మలేసియా ఓపెన్: సింధు ఔట్
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో భాగంగా రెండో రౌండ్లో సింధు 18-21, 7-21 తేడాతో సుంగ్ జీ హ్యూన్( దక్షిణా కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సింధు.. రెండో గేమ్‌లో కనీసం పోరాటం చేయడంలో విఫలమయ్యారు. ఫలితంగా గేమ్‌తో మ్యాచ్‌ను కూడా చేజార్చుకుని టోర్నీ నుంచి నిష్క్రమించారు. మరొవైపు పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్ పోరులో శ్రీకాంత్ 21-11, 21-15 తేడాతో కొసిట్ ఫెట్‌ప్రదబ్ ( థాయ్‌లాండ్)పై గెలిచి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లో మాత్రం కాస్త కష్టపడి విజయం సాధించాడు. -
క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్
ఫుజౌ (చైనా): భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ చైనా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–12, 21–15తో అన్‌సీడెడ్ ఒంగ్‌బామ్‌రంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)పై నెగ్గింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సింధు తొలి గేమ్‌లో 11–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే అధిపత్యం కొనసాగిస్తూ గేమ్ గెలుచుకుంది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన సింధు గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 10–21, 21–9, 21–9తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హెచ్ఎస్ ప్రణయ్ 11–21, 14–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 16–21, 21–14, 21–15తో వాహ్యూ నాయకా ఆర్య–యూసుఫ్ సంతోసో (ఇండోనేసియా) జోడీపై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 19–21, 21–15, 17–21తో షిహో తనాకా–కొహరు యోనెమోటో (జపాన్) జోడీ చేతిలో ఓడింది. -
సింధు తొమ్మిదో ‘సారీ’
కౌలాంలపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరు ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో భారత షట్లర్ పీవీ సింధు 15-21, 21-19, 11-21 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. దాంతో భారత్ కథ సెమీస్‌లోనే ముగిసినట్లయ్యింది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు.. రెండో గేమ్‌లో పోరాడి గెలిచింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు చేతులెత్తేయడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇది తై జు యింగ్‌పై సింధుకు తొమ్మిదో ఓటమి కాగా, వరుసగా ఐదో ఓటమి. అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో శ్రీకాంత్ 13-21, 13-21 తేడాతో ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పరాజయం చెందాడు. వరుస రెండు గేమ్‌లను మొమోటాకు సమర్పించుకున్న శ్రీకాంత్ టోర్నీ నుంచి వైదొలిగాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా చేజార్చుకున్న శ్రీకాంత్.. రెండో గేమ్‌లో సైతం ఘోరంగా వైఫల్యం చెంది మ్యాచ్‌ను సమర్పించుకున్నాడు. ఇది మొమోటాపై శ్రీకాంత్‌కు ఆరో ఓటమి. -
సెమీస్‌లో శ్రీకాంత్‌కు షాక్
కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా శనివారం జరిగిన సెమీ ఫైనల్లో ప్రపంచ నాల్గో ర్యాంకర్ శ్రీకాంత్ 13-21, 13-21 తేడాతో ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పరాజయం చెందాడు. వరుస రెండు గేమ్‌లను మొమోటాకు సమర్పించుకున్న శ్రీకాంత్ టోర్నీ నుంచి వైదొలిగాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా చేజార్చుకున్న శ్రీకాంత్.. రెండో గేమ్‌లో సైతం ఘోరంగా వైఫల్యం చెందాడు. -
మలేసియా ఓపెన్: సెమీ ఫైనల్లో పీవీ సింధు
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సైతం సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. కొద్దిసేపటి క్రితమే పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్‌కు ప్రవేశించిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఒలంపిక్ విజేత కరోలినా మారిన్(స్సెయిన్)పై సింధు 22-20, 21-19తో వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి గేమ్ నుంచే దూకుడుగా ఆడుతూ వచ్చిన సింధు విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆ తర్వాత పుంజుకున్న మారిన్ వరుసగా స్కోరు సమం చేస్తూ వచ్చింది. కాగా ఈ క్రమంలో జోరు పెంచిన సింధు 22-20తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత రెండో గేమ్‌లోనూ సింధు తొలి నుంచే ఆధిక్యం సాధిస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే విరామానికి 11-6తో మరోసారి ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి నుంచి దూకుడు పెంచిన మారిన్ అద్భుతంగా చెలరేగి స్కోరు సమం చేసే ప్రయత్నం చేసింది. కానీ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండానే సింధు 21-19తో రెండో గేమ్‌ను కైవసం చేసుకొని సెమీస్‌లోకి అడుగుపెట్టింది. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడనుంది. ఈ ఇద్దరు ఇప్పటి వరకు 11 సార్లు తలపడగా.. సింధు కేవలం మూడు సార్లు మాత్రమే నెగ్గింది. ఇక శ్రీకాంత్ 21-18, 21-14 తేడాతో బ్రైస్ లీవర్‌డెజ్(ఫ్రెంచ్)పై గెలిచి సెమీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఏకపక్షంగా సాగిన పోరులో శ్రీకాంత్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌ను కష్టపడి గెలిచిన శ్రీకాంత్.. రెండో గేమ్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్నాడు. శ్రీకాంత్ సెమీస్‌లో జపాన్ ఆటగాడు కెంటా మోమోటాతో తొలిసారి తలపడనున్నాడు. చదవండి: మలేసియా ఓపెన్ సెమీ ఫైనల్లో శ్రీకాంత్ -
మలేసియా ఓపెన్: సెమీ ఫైనల్లో శ్రీకాంత్
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21-18, 21-14 తేడాతో బ్రైస్ లీవర్‌డెజ్(ఫ్రెంచ్)పై గెలిచి సెమీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఏకపక్షంగా సాగిన పోరులో శ్రీకాంత్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌ను కష్టపడి గెలిచిన శ్రీకాంత్.. రెండో గేమ్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్నాడు. తొలి గేమ్‌లో శ్రీకాంత్ 18-20 తో వెనుకబడిన దశలో తిరిగి పుంజుకున్నాడు. వరుసగా రెండు గేమ్ పాయింట్లను సాధించి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత లీవర్డెజ్కు మరో అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో శ్రీకాంత్ 10-1 తేడాతో దూసుకుపోయాడు. ఆ దశలో ప్రత్యర్థి నుంచి ప్రతి ఘటన ఎదురైనప్పటికీ శ్రీకాంత్ నిలదొక్కుకుని విజయం సాధించాడు. -
మలేసియా ఓపెన్: సైనా ఔట్
కౌలాంలపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ కథ ముగిసింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 15-21, 13-21 తేడాతో యమగూచి(జపాన్) చేతిలో పరాజయం పాలైంది. 36 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో యమగూచి చెలరేగి ఆడింది. ఈ రెండు గేమ్‌ల్లోనూ సైనాకు ఏమాత్రం అవకాశం ఇవ్వని యమగూచి ఆకట్టుకుని క్వార్టర్స్‌లోకి చేరగా, సైనా రెండో రౌండ్ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. వీరిద్దరూ ముఖాముఖి పోరులో ఇప్పటివరకూ ఆరుసార్లు తలపడగా యమగూచి ఐదుసార్లు విజయం సాధించింది. కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లోనే సైనా గెలుపొందింది. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 26–24, 21–15తో అయా ఒహోరి (జపాన్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–18, 21–9తో జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో సాయిప్రణీత్ 12–21, 7–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూశాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 16–21, 15–21తో టకుటో ఇనుయి–యూకీ కనెకో (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అకానె యామగుచి (జపాన్)తో సైనా నెహ్వాల్; యింగ్ యింగ్ లీ (మలేసియా)తో సింధు; వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్ తలపడతారు. -
శ్రమించి నెగ్గిన సింధు
⇒ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్, సాయిప్రణీత్ ⇒సమీర్, సౌరభ్, జయరామ్ ఓటమి ⇒సింగపూర్ ఓపెన్ టోర్నీ సింగపూర్ సిటీ: గతవారం మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు... సింగపూర్ ఓపెన్‌లో మాత్రం అతికష్టమ్మీద తొలి రౌండ్ అడ్డంకిని దాటింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సింధు 10–21, 21–15, 22–20తో ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్, ప్రపంచ 10వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై కష్టపడి గెలిచింది. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో తడబడింది. రెండో గేమ్‌లో ఒకదశలో స్కోరు 6–6 వద్ద ఉన్నపుడు ఈ హైదరాబాద్ అమ్మాయి ఒక్కసారిగా చెలరేగింది. వరుసగా తొమ్మిది పాయింట్లు నెగ్గి 15–6తో ముందంజ వేసింది. అదే జోరులో రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఆరంభంలో వరుసగా మూడు పాయింట్లు గెలిచి 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒకుహారా తేరుకోవడంతో మ్యాచ్ పోటాపోటీగా సాగింది. స్కోరు 9–8 వద్ద ఉన్నపుడు సింధు విజృంభించి వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 16–8తో విజయానికి చేరువైంది. స్కోరు 20–14 వద్ద సింధు విజయానికి ఒక పాయింట్ దూరంలో ఉన్నపుడు... ఒకుహారా వరుసగా ఆరు పాయింట్లు గెలిచి స్కోరును 20–20తో సమం చేసింది. అయితే సింధు ఒత్తిడికి లోనుకాకుండా వరుసగా రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ గెలుపుతో సింధు, ఒకుహారా ముఖాముఖి రికార్డులో 3–3తో సమమయ్యారు. చివరిసారి వీరిద్దరూ 2016 రియో ఒలింపిక్స్ సెమీఫైనల్లో తలపడగా... సింధు పైచేయి సాధించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫిత్రియాని (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. మహిళల సింగిల్స్ మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో రితూపర్ణ దాస్ (భారత్) 18–21, 13–21తో సు యా చింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో మిశ్రమ ఫలితాలు మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. శ్రీకాంత్, సాయిప్రణీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... సౌరభ్ వర్మ, సమీర్ వర్మ, అజయ్ జయరామ్ తొలి రౌండ్లో ఓడిపోయారు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–12, 21–11తో నిషిమోటో (జపాన్)పై, సాయిప్రణీత్ 17–21, 21–7, 21–19తో ఎమిల్ (డెన్మార్క్)పై గెలిచారు. సౌరభ్ వర్మ 15–21, 14–21తో ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా) చేతిలో, సమీర్ వర్మ 26–28, 21–23తో హు యున్ (హాంకాంగ్) చేతిలో, జయరామ్ 16–21, 7–21తో షి యుచి (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం 21–19, 21–19తో యున్ లూ లిమ్–యాప్ చెంగ్ వెన్ (మలేసియా) జోడీపై గెలుపొందగా... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంట 8–21, 16–21తో కమురా–సోనోడా (జపాన్) ద్వయం చేతిలో ఓడింది. -
క్వార్టర్ ఫైనల్లో అజయ్ జయరామ్
మలేసియా ఓపెన్ కూచింగ్: భారత ఆటగాడు అజయ్ జయరామ్ మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సంచలన విజయం సాధించాడు. నాలుగు రోజుల క్రితం ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచి ఊపు మీదున్న విక్టర్ అక్సెల్సన్ను అతను కంగు తినిపించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో అన్ సీడెడ్ జయరామ్ 9–21, 21–14, 21–19తో నాలుగో సీడ్ అక్సెల్సన్ను ఓడించాడు. 44 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన ఈ సమరంలో భారత ఆటగాడు అసాధారణ పోరాటపటిమ కనబరిచాడు. తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికీ రెండో గేమ్‌లో పుంజుకోవడంతో 8–3తో ఆధిక్యంలోకి వచ్చాడు. అయితే ప్రత్యర్థి కూడా దీటుగా బదులివ్వడంతో ఒక దశలో 12–12తో స్కోరు సమమైంది. అప్పుడు వరుసగా ఆరు పాయింట్లు సాధించి 18–12తో ప్రత్యర్థిని నిలువరించి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కూడా ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. దీంతో 12–12, 18–18 వద్ద స్కోర్లు సమమయ్యాయి. ఆ తర్వాత దూసుకెళ్లి 20–18 ఆధిక్యంలో నిలిచిన జయరామ్ మరో పాయింట్‌తో మ్యాచ్‌లో గెలుపొందాడు. -
మరోసారి సెమీస్ లో తడబడిన సైనా
షా ఆలమ్(మలేసియా):మలేషియా ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సైనా 19-21, 13-21 తేడాతో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. తొలి గేమ్ ఆదిలోనే సైనా 0-7 తేడాతో వెనుకంజ వేసి అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. ఇక ఆ తరువాత రెండో గేమ్‌లో పూర్తిగా డీలాపడ్డ సైనా ప్రత్యర్థికి వరుస పాయింట్లను సమర్పించుకుని ఓటమి పాలైంది. దీంతో సైనా నెహ్వాల్ వరుసగా మూడో సెమీ ఫైనల్ ఓటమిని మూటగట్టుకుంది. అంతకుముందు స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి, ఇండియన్ సూపర్ సిరీస్‌లలో కూడా సైనా సెమీస్ అడ్డంకిని దాటలేకపోయింది. కాగా, గతంలో ఈ టోర్నీలో మూడు సార్లు సెమీస్ తోనే సరిపెట్టుకున్న సైనా మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయడం గమనార్హం. -
అధికారికంగా సైనాకి అగ్రస్థానం
సైనా నెహ్వాల్... ఇక అధికారికంగా ప్రపంచ నంబర్‌వన్. వారం క్రితమే సైనాకు అగ్రస్థానం ఖరారైనా బీడబ్ల్యుఎఫ్ అధికారికంగా ర్యాంక్‌లను గురువారం ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్‌లో 78, 541 పాయింట్లతో ఆమె అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల ముగిసిన ఇండియన్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరుకోవడంతో సైనా ఈ ఘనతను అందుకుంది. కరోలినా మారిన్ (స్పెయిన్-73, 618) రెండు, లీ జురుయ్ (చైనా-71, 414) మూడో ర్యాంక్‌లో నిలిచారు. హైదరాబాద్ అమ్మాయి పి.వి.సింధు (55, 635) తొమ్మిదో ర్యాంక్‌లో ఉంది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ నాలుగో ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. హెచ్.ఎస్. ప్రణయ్ 14, పారుపల్లి కశ్యప్ 17వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. -
పేస్‌కు 54వ టైటిల్
మలేసియా ఓపెన్ కైవసం కౌలాలంపూర్: తన కెరీర్లో 98వ కొత్త భాగస్వామితో బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ టైటిల్ సాధించాడు. ఆదివారం ముగిసిన మలేసియా ఓపెన్ టోర్నీలో 41 ఏళ్ల పేస్ తన సహచరుడు మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలండ్)తో కలిసి విజేతగా నిలిచాడు. ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్‌ను జమచేసుకున్నాడు. గంటన్నరపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ పేస్-మట్కోవ్‌స్కీ జోడి 3-6, 7-6 (7/5), 10-5తో రెండో సీడ్ జేమీ ముర్రే (బ్రిటన్)-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంటపై గెలిచింది. కెరీర్లో 91వ ఫైనల్ ఆడిన పేస్‌కిది 54వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. 1997 నుంచి ప్రతి ఏడాది పేస్ కనీసం ఒక్క డబుల్స్ టైటిల్ అయినా గెలుస్తూ వస్తున్నాడు. -
శ్రీకాంత్‌కు షాక్
స్విస్ ఓపెన్ బాసెల్: ఆంధ్రప్రదేశ్ యువతార కిడాంబి శ్రీకాంత్ స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్, ప్రపంచ 20వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-19, 18-21, 17-21తో అన్‌సీడెడ్ హెన్రీ హుర్స్‌కెనైన్ (స్వీడన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. 53 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ మూడు గేముల్లోనూ పలుదశల్లో వెనుకబడ్డాడు. తొలి గేమ్‌లో తేరుకున్నా... తర్వాతి రెండు గేముల్లో మాత్రం కోలుకోలేకపోయాడు. ఈ ఏడాది నాలుగో టోర్నీ ఆడుతోన్న శ్రీకాంత్ తొలి రౌండ్లో ఓడిపోవడం ఇది రెండోసారి. కొరియా ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిన శ్రీకాంత్... మలేసియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించాడు. ఇండియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.