![Kidambi Srikanth Beats Brice Leverdez To Reach Semi Finals - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/29/Kidambi-Srikanth1.jpg.webp?itok=X70_dOhq)
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక‍్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21-18, 21-14 తేడాతో బ్రైస్ లీవర్‌డెజ్(ఫ్రెంచ్)పై గెలిచి సెమీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఏకపక్షంగా సాగిన పోరులో శ్రీకాంత్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌ను కష్టపడి గెలిచిన శ్రీకాంత్.. రెండో గేమ్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్నాడు.
తొలి గేమ్‌లో శ్రీకాంత్ 18-20 తో వెనుకబడిన దశలో తిరిగి పుంజుకున్నాడు. వరుసగా రెండు గేమ్ పాయింట్లను సాధించి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత లీవర్‌డెజ్‌కు మరో అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో శ్రీకాంత్ 10-1 తేడాతో దూసుకుపోయాడు. ఆ దశలో ప్రత్యర్థి నుంచి ప్రతి ఘటన ఎదురైనప్పటికీ శ్రీకాంత్ నిలదొక్కుకుని విజయం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment