కౌలాంలపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరు ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో భారత షట్లర్ పీవీ సింధు 15-21, 21-19, 11-21 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. దాంతో భారత్ కథ సెమీస్‌లోనే ముగిసినట‍్లయ్యింది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు.. రెండో గేమ్‌లో పోరాడి గెలిచింది. అయితే నిర‍్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు చేతులెత్తేయడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇది తై జు యింగ్‌పై సింధుకు తొమ్మిదో ఓటమి కాగా, వరుసగా ఐదో ఓటమి.
అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో శ‍్రీకాంత్ 13-21, 13-21 తేడాతో ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పరాజయం చెందాడు. వరుస రెండు గేమ్‌లను మొమోటాకు సమర్పించుకున్న శ్రీకాంత్ టోర్నీ నుంచి వైదొలిగాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా చేజార్చుకున్న శ్రీకాంత్.. రెండో గేమ్‌లో సైతం ఘోరంగా వైఫల‍్యం చెంది మ్యాచ్‌ను సమర్పించుకున్నాడు. ఇది మొమోటాపై శ్రీకాంత్‌కు ఆరో ఓటమి.
Comments
Please login to add a commentAdd a comment