మరోసారి సెమీస్ లో తడబడిన సైనా | Saina Nehwal lose in semis at Malaysia Open | Sakshi
Sakshi News home page

మరోసారి సెమీస్ లో తడబడిన సైనా

Published Sat, Apr 9 2016 6:26 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

Saina Nehwal lose in semis at Malaysia Open

షా ఆలమ్(మలేసియా):మలేషియా ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిష్క్రమించింది.  శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సైనా 19-21, 13-21 తేడాతో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. తొలి  గేమ్ ఆదిలోనే  సైనా 0-7 తేడాతో వెనుకంజ వేసి అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది.

 

ఇక ఆ తరువాత రెండో గేమ్లో పూర్తిగా డీలాపడ్డ  సైనా ప్రత్యర్థికి వరుస పాయింట్లను సమర్పించుకుని ఓటమి పాలైంది. దీంతో సైనా నెహ్వాల్ వరుసగా మూడో సెమీ ఫైనల్ ఓటమిని మూటగట్టుకుంది.  అంతకుముందు స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి, ఇండియన్ సూపర్ సిరీస్లలో కూడా సైనా సెమీస్ అడ్డంకిని దాటలేకపోయింది. కాగా, గతంలో ఈ టోర్నీలో మూడు సార్లు సెమీస్ తోనే సరిపెట్టుకున్న సైనా మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement