![Sindhu, Srikanth in pre-quarters; Praneeth, Satwik-Chirag exit Malaysia Open - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/28/kidamb.jpg.webp?itok=y2NjDe6X)
పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 26–24, 21–15తో అయా ఒహోరి (జపాన్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21–18, 21–9తో జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో సాయిప్రణీత్ 12–21, 7–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూశాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 16–21, 15–21తో టకుటో ఇనుయి–యూకీ కనెకో (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అకానె యామగుచి (జపాన్)తో సైనా నెహ్వాల్; యింగ్ యింగ్ లీ (మలేసియా)తో సింధు; వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment