Pre-quarters
-
ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ జంట
పారిస్: ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ ద్వయం 21–7, 21–18తో డొమినిక్–సెరెనా (ఆస్ట్రియా) జోడీపై గెలిచింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ 21–9, 21–5తో రాచెల్ (ఐర్లాండ్)పై, ఐరా శర్మ 12–21, 21–14, 21–17తో లియోనైస్ (ఫ్రాన్స్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కిడాంబి శ్రీకాంత్ 21–15, 21–10తో భారత్‌కే చెందిన అజయ్ జయరామ్‌పై, కిరణ్ జార్జి 13–21, 21–16, 23–21తో సహచరుడు ప్రణయ్‌పై, చిరాగ్ సేన్ 21–13, 21–12తో చికో వార్దోయో (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్ 7–21, 17–21తో తోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. -
ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్
ఫ్లోరిడా: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ఫెడరర్ 7–5, 6–3తో ఫిలిప్ క్రాజినోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో ఫెడరర్‌కిది 52వ విజయం కావడం విశేషం. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ 14 ఏస్‌లు సంధించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్యా యువ సంచలనం డానిల్ మెద్వెదెవ్‌తో ఫెడరర్ ఆడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ మెద్వెదెవ్ 7–6 (7/5), 6–7 (5/7), 7–6 (7/0)తో రీలి ఒపెల్కా (అమెరికా)పై గెలిచాడు. గత ఏడాది కాలంలో మెద్వెదెవ్ మూడు టైటిల్స్ సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. హలెప్ ముందంజ... ఇదే టోర్నీ మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ హలెప్ (రొమేనియా) క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో హలెప్ 6–3, 6–3తో 38 ఏళ్ల వీనస్ విలియమ్స్ (అమెరికా)పై విజయం సాధించింది. మూడో రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ ఒసాకా (జపాన్)పై నెగ్గిన సు వె సెయి (చైనీస్ తైపీ) మరో గొప్ప విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. సు వె సెయి 6–3, 6–7 (0/7), 6–2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్)ను ఓడించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3 తో గార్సియా (ఫ్రాన్స్)పై, ఐదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 2–6, 6–3, 7–5తో యులియా (కజకిస్తాన్)పై గెలిచారు. -
ప్రిక్వార్టర్స్‌లో సౌరవ్ ఘోషాల్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు సౌరవ్ ఘోషాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికాలోని షికాగోలో జరుగుతున్న ఈ టోర్నీలో సౌరవ్ రెండో రౌండ్లో 13–11, 11–6, 11–8తో లుకాస్ సెర్మీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ క్రీడాకారిణి జోష్నా చినప్ప పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో జోష్నా 10–12, 7–11, 7–11తో జాయ్ చాన్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయింది. World Squash Championship: Saurav Ghosal enters pre-quarters, Joshna Chinappa out -
మన సత్తాకు పరీక్ష!
భువనేశ్వర్: ప్రపంచకప్‌ను ఘనమైన విజయంతో ఆరంభించిన భారత హాకీ జట్టు పటిష్టమైన బెల్జియంను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంను ఓడిస్తే టీమిండియా నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెడుతుంది. బుధవారం తొలి మ్యాచ్‌లో భారత్ 5–0తో దక్షిణాఫ్రికాను కంగుతినిపించింది. ఇకపైనా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆ మ్యాచ్‌లో భారత్ అటాకింగ్‌లో అదరగొట్టింది. ఫార్వర్డ్‌లో మన్దీప్ సింగ్, సిమ్రన్‌జిత్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్ మ్యాచ్ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ స్ట్రయికర్లంతా ఫామ్‌లో ఉన్నారు. మన్‌ప్రీత్ సింగ్ మిడ్‌ఫీల్డ్‌లో రాణించాడు. అయితే డిఫెండర్లు హర్మన్‌ప్రీత్ సింగ్, బీరేంద్ర లాక్రా, సురేందర్ కుమార్‌లు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఈ రక్షణ పంక్తితో పాటు గోల్ కీపర్ పి.ఆర్.శ్రీజేశ్ కూడా పెట్టని గోడలా ఉంటేనే పటిష్టమైన బెల్జియంను భారత్‌ను నిలువరించగలదు. లేదంటే ఘనవిజయం వెంటే పరాజయం వెక్కిరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే భారత్‌కు నిలకడే అసలు సమస్య! ఒక మ్యాచ్‌లో చెలరేగి... మరుసటి మ్యాచ్‌లో అలసత్వం ప్రదర్శించడం రివాజే. పైగా ప్రపంచ ఐదో ర్యాంకర్ భారత్‌కు బెల్జియంతో పేలవమైన రికార్డుంది. 2013 నుంచి ఇప్పటివరకు ఇరు జట్లు 19 సార్లు తలపడితే భారత్ ఐది మ్యాచ్‌ల్లోనే గెలిచింది. బెల్జియం మాత్రం 13 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. చివరిసారిగా నెదర్లాండ్స్‌లో ఈ ఏడాది జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో తలపడగా... ‘డ్రా’ ఫలితం ఎదురైంది. మరోవైపు రియో ఒలింపిక్స్ రన్నరప్ బెల్జియం తక్కువ ర్యాంకులో ఉన్న కెనడాపై 2–1తో చెమటోడ్చి గెలిచింది. అందివచ్చిన పెనాల్టీ కార్నర్లను బెల్జియం ఆటగాళ్లు గోల్స్‌గా మలచడంలో విఫలమయ్యారు. దీంతో ఓ కూన జట్టుపై పోరాడి గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఒక మ్యాచ్‌తో, ఒక్క ఫలితంతో ప్రపంచ టాప్–3 జట్టును తక్కువ అంచనా వేయలేం. ఆతిథ్య దేశంపై గెలిచే సత్తా బెల్జియంకు ఉంది. ఫార్వర్డ్, డిఫెన్స్ అందరూ ఒక్క సారిగా కదంతొక్కితే భారత్‌కు కష్టాలు తప్పవు. ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీలో ఏ ఒక్క పొరపాటైనా మూల్యం భారీగానే ఉంటుంది. కాబట్టి ఇరుజట్లు కూడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడాలి. గత మ్యాచ్‌లో పెనాల్టీ కార్నర్లతో అనుభవమైన బెల్జియంకు భారత్‌తో ఎలా ఆడాలో తెలుసు. తప్ప కుండా మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది. పాక్ పరాజయం ప్రపంచకప్‌ను అత్యధికంగా నాలుగుసార్లు గెలిచిన పాకిస్తాన్ జట్టుకు శుభారంభం దక్కలేదు. పూల్ ‘డి’లో భాగంగా జర్మనీతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 0–1తో ఓడిపోయింది. జర్మనీ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను మార్కో మిల్ట్‌కౌ 36వ నిమిషంలో చేశాడు. ఇదే పూల్‌లోని మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 7–0తో మలేసియాను చిత్తుగా ఓడించింది. నెదర్లాండ్స్ తరఫున జెరోన్ హెర్ట్‌బెర్గర్ ‘హ్యాట్రిక్’ సాధించగా... మిర్కో ప్రుసెర్, మింక్ వాన్ డెర్ వీర్డెన్, రాబర్ట్ కెంపర్‌మన్, బ్రింక్‌మన్ ఒక్కో గోల్ సాధించారు. ►రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ప్రిక్వార్టర్స్‌లో సోనియా
న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు దూసుకెళ్తున్నారు. మూడో రోజు శనివారం జరిగిన అన్ని బౌట్లలో భారత బాక్సర్లు విజయం సాధించారు. యువ బాక్సర్ సోనియాతో పాటు పింకీ, సిమ్రన్‌జీత్ కౌర్‌లు తొలి బౌట్లలో సునాయాసంగా గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు చేరారు. శనివారం 57 కేజీల విభాగంలో జరిగిన తొలి బౌట్లో సోనియా 5–0తో దోవా తౌజనీ (మొరాకో)పై విజయం సాధించింది. హరియాణాకు చెందిన 21 ఏళ్ల సోనియాకు ఇదే తొలి ప్రపంచ చాంపియన్‌షిప్ కావడం విశేషం. 51 కేజీల విభాగంలో పింకీ 4–1తో అనుష్ గ్రిగోరియాన్ (అర్మేనియా)పై నెగ్గింది. 64 కేజీల విభాగంలో సిమ్రన్‌జీత్ 4–1తో అమేలియా మూరే (అమెరికా)ను చిత్తుచేసింది. నేడు జరుగనున్న బౌట్లలో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్‌తో సహా ఐదుగురు భారత బాక్సర్లు బరిలో దిగనున్నారు. -
ఎం‘బాప్రే’..!
కొదమ సింహాలు కదంతొక్కిన వేళ... ఆటగాళ్ల దూకుడుతో పోటీ రక్తికట్టింది... ఆధిపత్యం అటుఇటు చేతులు మారింది... గోల్స్‌పై గోల్స్‌తో నాకౌట్ కిక్కెక్కించింది... ఆఖరి క్షణాల వరకు ఉత్కంఠ రేకెత్తింది... ఫ్రాన్స్ టీనేజ్ మెరిక కైలిన్ ఎంబాపె మెరుపులకు అర్జెంటీనా వెలుగు మసకబారింది! ఫలితంగా సూపర్ స్టార్ మెస్సీ నాయకత్వంలోని జట్టు పయనం 2018 ప్రపంచకప్‌లో ప్రి క్వార్టర్స్‌తోనే ముగిసింది. కజన్: ప్రపంచ కప్ నుంచి అర్జెంటీనా నిష్క్రమించింది. కెప్టెన్ లియోనల్ మెస్సీ అసహాయుడిగా మిగిలిపోగా... గత మ్యాచ్ హీరో మార్కస్ రొజొ ‘మొదటే’ ముప్పు తెచ్చిపెట్టగా... కీలక సమయంలో దక్కిన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేక... ప్రత్యర్థిని మరెవరూ నిలువరించలేని పరిస్థితుల్లో ఆ జట్టు పరాజయం మూటగట్టుకుంది. 19 ఏళ్ల యువ కెరటం కైలిన్ ఎంబాపె మెరుపులు... బెంజమిన్ పవార్డ్ చురుకైన ఆటతో తొలి నాకౌట్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌దే పైచేయి అయింది. మాజీ చాంపియన్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన పోరులో ఫ్రాన్స్ 4–3తో అర్జెంటీనాను మట్టికరిపించింది. ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనాపై ఫ్రాన్స్ జట్టుకిదే తొలి విజయం కావడం విశేషం. ఫ్రాన్స్ తరఫున ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఎంబాపె (64వ, 68వ నిమిషాలు) రెండు గోల్స్ కొట్టగా, ఆంటోన్ గ్రీజ్మన్ (13వ ని.), పవార్డ్ (57వ ని.) చెరో గోల్ చేశారు. అర్జెంటీనాకు డి మారియా (41వ ని.), మెర్కాడో (48వ ని.), కున్ అగ్యురో (90+3వ ని.) స్కోరు అందించారు. ఆ హీరోనే దెబ్బకొట్టాడు... ఫ్రాన్స్ ఏకంగా ఆరు మార్పులతో మ్యాచ్‌లో దిగింది. దిగ్గజ జట్ల మధ్య పోటీ అందుకు తగ్గట్లే ప్రారంభమైంది. మాస్కెరనో షాట్‌తో అర్జెంటీనాకు మొదటి అవకాశం దక్కింది. మరోవైపు గ్రీజ్మన్ కొట్టిన ఫ్రీ కిక్ గోల్బార్ అంచుల్లోంచి పక్కకుపోయింది. 4–3–3 వ్యూహంతో దిగిన అర్జెంటీనా కంటే ఫ్రాన్సే (4–2–3–1) సౌకర్యంగా కనిపించింది. గత మ్యాచ్‌లో నైజీరియాపై కీలక గోల్‌తో హీరోగా నిలిచిన రొజొ ఈసారి పెద్ద పొరపాటు చేశాడు. 11వ నిమిషంలో పాస్‌ను అందుకుని పరిగెడుతున్న ఎంబాపెను కిందపడేశాడు. దీంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ దక్కింది. దీనిని గ్రీజ్మన్... సునాయాసంగా నెట్లోకి కొట్టి జట్టుకు ఆధిక్యం అందించాడు. తర్వాత సైతం వేగం, బంతిని అట్టిపెట్టుకుంటూ పాస్‌లతో ప్రత్యర్థిని ఎంబాపె హడలెత్తించాడు. మరోవైపు 19వ నిమిషంలోనూ ఫ్రాన్స్‌కు ఫ్రీ కిక్ లభించినా పోగ్బా సద్వినియోగం చేయలేకపోయాడు. అటు సహచరుల నుంచి పాస్‌లు అందకపోవడంతో మెస్సీ వద్దకు బంతి రావడమే గగనమైంది. పైగా ఫ్రాన్స్ దాడులు చేసేలా అర్జెంటీనా దారిచ్చింది. ప్రతిఘటించే ప్రయత్నంలో వరుసగా ఇద్దరు ఆటగాళ్లు ఎల్లోకార్డులు అందుకున్నారు. అగ్యురో, హిగుయెన్లను దింపకపోవడం కూడా దెబ్బకొట్టింది. సెంటర్ ఫార్వర్డ్ లేకపోవడంతో ఫ్రాన్స్ రక్షణ శ్రేణిని ఇబ్బంది పెట్టలేకపోయింది. ఐనా అర్జెంటీనా బంతిని నియంత్రణలో ఉంచుకుంది. తొలి భాగం ముగియవస్తుందనగా... బనేగా పాస్‌ను డి బాక్స్ ముందు అందుకున్న డి మారియా 25 గజాల నుంచి గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. ఆధిక్యంలో నిలిచినా... రెండో భాగం ప్రారంభంలోనే అర్జెంటీనాకు ఊహించని రీతిలో గోల్ దక్కింది. బాక్స్ ఏరియా లోపల పాస్‌ను అందుకున్న మెస్సీ గోల్‌పోస్ట్‌లోకి పంపే ప్రయత్నం చేశాడు. నేరుగా వస్తే ఫ్రాన్స్ కీపర్ దానిని నిరోధించేవాడే. కానీ మధ్యలో ఉన్న మెర్కాడొ కాలికి బంతి నెట్లోకి చేరింది. అర్జెంటీనా 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆనందాన్ని పవార్డ్ పది నిమిషాల్లోనే ఆవిరి చేశాడు. హెర్నాండెజ్ అందించిన క్రాస్ పాస్‌ను సరిగ్గా డి బాక్స్ దగ్గర దొరకబుచ్చుకున్న పవార్డ్... ఓవైపు ఒరుగుతూ ముచ్చటైన రీతిలో గోల్‌గా మలిచాడు. గణాంకాలు 2–2తో సమమై... అరగంట ఆట మాత్రమే మిగిలి ఉన్న దశలో ఎంబాపె విజృంభించాడు. నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టి ఫ్రాన్స్‌ను పైమెట్టున నిలబెట్టాడు. 64వ నిమిషంలో మరోసారి హెర్నాండెజ్ క్రాస్ ఇవ్వగా... గోల్‌పోస్ట్ ఎదుట జరిగిన డ్రామాలో ఎంబాపె చురుగ్గా స్పందించి బంతిని గోల్‌పోస్ట్‌లోకి కొట్టాడు. తర్వాతి గోల్‌ను అయితే మళ్లీమళ్లీ చెప్పుకొనేలా కేవలం మూడంటే మూడే పాస్‌ల్లో నెట్లోకి కొట్టాడు. అర్జెంటీనా కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినా... దాదాపు అందుకోలేనంత ఆధిక్యంలోకి వెళ్లిన ఫ్రాన్స్ మ్యాచ్‌ను మరింత ఆధీనంలోకి తీసుకుంది. దీంతో మెస్సీ బృందం చేసేదేమీలేకపోయింది. ఇంజ్యూరీ సమయంలో మెస్సీ క్రాస్ పాస్‌ను అగ్యురో హెడర్ గోల్‌తో ఒకింత ఆశ రేపాడు. చివరి క్షణం (90+6)లోనూ అద్భుతం జరుగుతుందేమో అనిపించింది. అయితే బంతి గోల్‌పోస్ట్ పైకి వెళ్లడంతో అర్జెంటీనా ఆశలు ఆవిరయ్యాయి. ఫ్రాన్స్ హర్షాతిరేకాల్లో మునిగిపోయింది. మెస్సీని మించినోడు... అర్జెంటీనాను ముంచినోడు అర్జెంటీనా దిగ్గజం, 31 ఏళ్ల లియోనల్ మెస్సీకి ప్రపంచ కప్‌ను తీరని కలగానే మిగిల్చిన ఈ మ్యాచ్... 19 ఏళ్ల ఫార్వర్డ్ ఎంబాపెను అంతర్జాతీయ స్టార్‌ను చేసింది. వాస్తవానికి రెండు జట్ల మధ్య తేడా ఎంబాపెనే. చిరుత పరుగుతో మ్యాచ్ గతినే మార్చేశాడతడు. పాస్‌లతో పాటు ఆట ఆసాంతం ఒకే వేగం కనబర్చిన ఎంబాపె నాలుగు నిమిషాల తేడాతో రెండు గోల్స్ కొట్టి ప్రత్యర్థిని కుదేలు చేశాడు. అతడిని అందుకునే ప్రయత్నంలోనే అర్జెంటీనా గత మ్యాచ్ హీరోలు బనేగా, రొజొ ఎల్లో కార్డులకు గురయ్యారు. ఫ్రాన్స్ జట్టులో అందరి దృష్టి గ్రీజ్మన్, పోగ్బాపై ఉండగా... వారిని తోసిరాజంటూ ఎంబాపె సరికొత్త హీరోగా అవతరించాడు. మళ్లీ వస్తావా మెస్సీ...? అన్నీ తానే అయి రెండు ప్రపంచ కప్‌లలో అర్జెంటీనాను నడిపించిన మెస్సీ మరో కప్‌లో ఆడతాడనేది అనుమానమే. ఇప్పటికే ఓసారి రిటైర్మెంట్ ప్రకటించి, అందరి ఒత్తిడితో విరమించుకున్న అతడు... రష్యాలో ఏమంత ప్రభావం చూపలేకపోయాడు. ఐస్లాండ్ వంటి ప్రత్యర్థి కూడా అతడే లక్ష్యంగా వ్యూహం రచించి విజయవంతమైంది. నైజీరియాతో మ్యాచ్‌లో మాత్రమే గోల్ కొట్టగలిగిన మెస్సీ ... ఫ్రాన్స్‌పై మెరుపు పాస్‌లు అందించి స్కోరుకు దోహదపడగలిగాడు. కానీ తన స్థాయి ఆటగాడు గోల్ కొడితేనే ప్రత్యర్థికి పంచ్ తగులుతుంది. ప్రపంచకప్‌లో తమ జట్టు పయనంపై తన రిటైర్మెంట్ నిర్ణయం ఆధారపడి ఉంటుందని మెస్సీ నెల క్రితం ప్రకటించాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడో...? కొసమెరుపు: క్రీడల్లో 10వ నంబర్ జెర్సీకి ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. క్రికెట్లో సచిన్ ఇదే జెర్సీ ధరించేవాడు. మెస్సీది కూడా 10వ జెర్సీనే. ఈ మ్యాచ్‌లో మెరిసిన ఎంబాపె 10వ నంబరు జెర్సీతోనే ఆడాడు. మెస్సీ తన మార్కు చూపలేకపోయాడు. విశేషాలు ► తాను ఆడిన ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు మెస్సీ ఒక్క గోల్ చేయకపోవడం గమనార్హం. ► ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో కేవలం ఐదోసారి మాత్రమే అర్జెంటీనా తన ప్రత్యర్థి జట్టుకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ సమర్పించుకుంది. ► 1986లో బెల్జియం (యూఎస్ఎస్ఆర్ చేతిలో 3–4తో ఓటమి) తర్వాత కనీసం మూడు గోల్స్ చేసి ప్రపంచకప్ మ్యాచ్‌లో పరాజయం పాలైన రెండో జట్టుగా అర్జెంటీనా నిలిచింది. ► గ్రీజ్మన్ గోల్ చేసిన మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు ఫ్రాన్స్ ఓడిపోలేదు. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 26–24, 21–15తో అయా ఒహోరి (జపాన్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–18, 21–9తో జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో సాయిప్రణీత్ 12–21, 7–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూశాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 16–21, 15–21తో టకుటో ఇనుయి–యూకీ కనెకో (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అకానె యామగుచి (జపాన్)తో సైనా నెహ్వాల్; యింగ్ యింగ్ లీ (మలేసియా)తో సింధు; వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్ తలపడతారు. -
ప్రిక్వార్టర్స్‌లో సాయి ఉత్తేజిత
బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ గ్రేడ్–5 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు శుభారంభం చేయగా... కుదరవల్లి శ్రీకృష్ణప్రియ, జక్కా వైష్ణవి రెడ్డి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సాయి ఉత్తేజిత 25–23, 21–16తో వైవోని లీ (జర్మనీ)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శ్రీకృష్ణప్రియ 11–21, 15–21తో లిన్నీ అలెజాండ్రా మైనకి (ఇండోనేసియా) చేతిలో... వైష్ణవి రెడ్డి 19–21, 17–21తో జూలీ జాకబ్సన్ (డెన్మార్క్) చేతి లో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో గురుసాయిదత్ 21–16, 21–11తో మూడో సీడ్ వైగోర్ కోలో (బ్రెజిల్)పై, సౌరభ్ వర్మ 21–11, 21–18తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)పై, సమీర్ వర్మ 22–20, 21–10తో థామస్ రూక్సెల్ (ఫ్రాన్స్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. -
ప్రిక్వార్టర్స్‌లో శ్రీకృష్ణప్రియ ఓటమి
♦ సిరిల్ వర్మ కూడా ♦ చైనీస్ తైపీ గ్రాండ్ ప్రి టోర్నీ తైపీ: చైనీస్ తైపీ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీ తొలిరౌండ్లో స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకున్న హైదరాబాద్ అమ్మాయి శ్రీకృష్ణప్రియకు ప్రిక్వార్టర్స్‌లో నిరాశే ఎదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 79వ ర్యాంకర్ శ్రీకృష్ణప్రియ 20–22, 13–21తో షువో సున్ యంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. తొలి గేమ్‌లో హోరాహోరీగా పోరాడిన శ్రీకృష్ణప్రియ, రెండోగేమ్‌లో తేలిపోయింది. 37 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో షువో సున్ యంగ్ 4 గేమ్ పాయింట్లు సాధించగా... కృష్ణప్రియ ఒక్కటీ గెలవలేకపోయింది. పురుషుల విభాగంలోనూ హైదరాబాద్ కుర్రాడు, 16వ సీడ్ సిరిల్ వర్మ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో పదహారో సీడ్ సిరిల్ వర్మ 12–21, 16–21తో లీ జీ జియా (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ మ్యాచ్ 28 నిమిషాల్లో ముగిసింది. మళ్లీ టాప్–10లోకి శ్రీకాంత్ వారం వ్యవధిలో రెండు సూపర్ సిరీస్ టైటిళ్లను గెలిచి భీకరమైన ఫామ్‌లో ఉన్న తెలుగు కుర్రాడు కిడాంబి శ్రీకాంత్ గురువారం ప్రకటించిన ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి చేరుకున్నాడు. మహిళల విభాగంలో పీవీ సింధు 5వ ర్యాంకుకు పడిపోగా... సైనా ఒక స్థానం ఎగబాకి 15 ర్యాంకుకు చేరుకుంది. -
ప్రిక్వార్టర్స్‌లో సాయిప్రణీత్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ సాయిప్రణీత్, సౌరభ్ వర్మ... మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, సాయి ఉత్తేజిత రావు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో సాయిప్రణీత్ 21–15, 21–13తో సతీశ్‌థరన్ (మలేసియా)పై, సౌరభ్ 21–17, 20–22, 21–14తో ఆనంద్ పవార్ (భారత్)పై గెలిచారు. అయితే కశ్యప్, ప్రతుల్ జోషి, శుభాంకర్ డే రెండో రౌండ్లోనే ఓడిపోయారు. మరోవైపు మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సైనా 21–5, 21–10తో మార్టినా రెపిస్కా (స్లొవేకియా)పై, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సాయి ఉత్తేజిత 13–21, 24–22, 27–25తో జెస్సికా ముల్జాతి (ఇండోనేసియా)పై నెగ్గారు. శ్రీకృష్ణప్రియ, రుత్విక శివాని, శైలి రాణే, రితూపర్ణ దాస్, రేష్మా కార్తీక్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
సింధు సునాయాసంగా..
⇒ క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన భారత స్టార్ ⇒జయరామ్‌కు చుక్కెదురు ⇒ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వుహాన్: చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత నం.1 ప్లేయర్, రియో ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు జోరు కొనసాగుతోంది. మహిళల సింగిల్స్‌లో అలవోకగా విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్, నాలుగో సీడ్ సింధు 21–14, 21–15తో ప్రపంచ 15వ ర్యాంకర్ అయా ఓహోరి (జపాన్)పై అలవోకగా విజయం సాధించింది. కేవలం 40 నిమిషాల్లో ముగిసిన ఈమ్యాచ్‌లో భారతస్టార్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. తొలిగేమ్ ఆరంభంలో 0–3తో వెనుకంజలో నిలిచిన సింధు అనంతరం దూకుడు ప్రదర్శించి వరుసగా ఆరు పాయింట్లు సాధించి 6–3తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం 7–7తో స్కోరు సమమైనా సింధు మరింత జోరును కొనసాగించి 18–10తో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ దశలో అయా పోరాడినా.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వకుండా ఆ గేమ్‌ను సింధు కైవసం చేసుకుంది. రెండోగేమ్ ఆరంభంలోనూ 0–4తో సింధు వెనుకంజలో నిలిచింది. ఈ దశలో కీలకపాయింట్లు సాధించి 5–5, 8–8తో సింధు రెండుసార్లు స్కోరును సమం చేసింది. అనంతరం దూకుడు ప్రదర్శించిన భారతస్టార్ చెలరేగి 18–11తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం అదే జోరులో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్, ప్రపంచ ఏడో ర్యాంకర్ హే బింగ్జియావో (చైనా)తో సింధు తలపడనుంది. బింగ్జియావోతో మూఖాముఖిపోరులో 3–4తో సింధు వెనుకంజలో నిలిచింది. గతేడాది ఇరువురు ఆరుసార్లు తలపడగా..చెరో మూడుసార్లు విజయం సాధించారు. చివరిసారి గత నవంబర్‌లో చైనా ఓపెన్‌లో ఇరువురు తలపడగా.. సింధు గెలుపొందింది. ఈక్రమంలో క్వార్టర్స్‌లో సింధు మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ అజయ్ జయరామ్ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ జయరామ్ 19–21, 10–21తో ప్రపంచ 32వ ర్యాంకర్ జెన్ హావో హుసు (చైనీస్‌తైపీ)పై ఓడిపోయాడు. దీంతో ఈ టోర్నీలో కేవలం సింధు మాత్రమే బరిలో ఉన్నట్లయ్యింది. 2014 టోర్నీ ఎడిషన్‌లో సింధు కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈసారి తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకోవాలని భారతస్టార్ భావిస్తోంది. -
సిరిల్ వర్మ ఓటమి
హనోయ్ (వియత్నాం): భారత ఆటగాడు సిరిల్ వర్మ వియత్నాం ఇంటర్నేషనల్ చాలెంజ్ కప్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్స్‌లో పరాజయం చవిచూశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ సిరిల్ వర్మ 17–21, 14–21తో నాలుగో సీడ్ మౌలానా పాంజీ అహ్మద్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ జోడి 21–17, 21–16తో యొషికి సుకమొటొ–షున్ సుకె యమముర (జపాన్) జంటపై గెలిచింది. -
మనోజ్ సంచలనం
రియో ఒలింపిక్స్ పురుషుల లైట్‌వెయిట్ (64 కేజీ) విభాగంలో భారత బాక్సర్ మనోజ్ కుమార్ తొలి రౌండ్లో విజయంతో ప్రి-క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత ఎవల్దాస్తో పోరులో మనోజ్ 2-1తో విజయం సాధించాడు. పురుషుల బాంటమ్ వెయిట్ (56కేజీల) విభాగంలో భారత బాక్సర్ శివ థాపా.. క్యూబాకు చెందిన రామిరెజ్ రొబీసీ చేతిలో 0-3తో ఓటమి పాలయ్యాడు. మరోవైపు, భారత బాక్సర్లు రియో ఒలింపిక్స్‌లో నిషేధం నుంచి తప్పించుకున్నారు. బాక్సర్లు ధరించాల్సిన దుస్తులు ఏఐబీఏ ప్రమాణాలకు అనుగుణంగా లేవని.. దీంతో నిషేధం తప్పదని హెచ్చరికలు రావటంతో... వెంటనే కొత్తవాటిని తెప్పించి ఇచ్చారు. గోల్ఫ్ పురుషుల వ్యక్తిగత ఈవెంట్ (రెండో రౌండ్) అనిర్బర్ లాహిరి, శివ్ చౌరాసియా సమయం: సాయంత్రం 4.00 గంటల నుంచి షూటింగ్ పురుషుల 50మీ. రైఫిల్ ప్రోన్ చైన్ సింగ్, గగన్ నారంగ్ సమయం: సాయంత్రం 5.30 గంటల నుంచి పురుషుల స్కీట్ (క్వాలిఫికేషన్స్) మైరాజ్ ఖాన్ సమయం: సాయంత్రం 6.00 గంటల నుంచి పురుషుల 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ (క్వాలిఫికేషన్స్) గుర్ప్రీత్ సింగ్ సమయం: రాత్రి 8.45 గంటల నుంచి బ్యాడి మంటన్ మహిళల డబుల్స్ (గ్రూప్ ‘ఎ’) గుత్తా జ్వాల - అశ్విని x పీక్-ముస్కెన్స్ (నెదర్లాండ్స్) సమయం: సాయంత్రం 5.30 గంటల నుంచి పురుషుల డబుల్స్ (గ్రూప్ ‘డి’) సుమీత్- మను అత్రి x చాయ్-హోంగ్ (చైనా) సమయం: రాత్రి 7.50 గంటల నుంచి ఆర్చరీ పురుషుల వ్యక్తిగత ఈవెంట్ ప్రిక్వార్టర్స్ అతాను దాస్ x లీ సుంగ్ యెన్ (కొరియా) సమయం: సాయంత్రం 5.43 గంటల నుంచి అథ్లెటిక్స్ పురుషుల 400మీ. పరుగు హీట్స్ మొహమ్మద్ అనాస్ యహియా సమయం: సాయంత్రం 6.23 గంటల నుంచి మహిళల షాట్‌పుట్ మన్‌ప్రీత్ కౌర్ సమయం: సమయం 6.35 గంటల నుంచి పురుషుల 800మీ. హీట్స్ జిన్సన్ జాన్సన్ సమయం: సాయంత్రం 6.58 గంటల నుంచి పురుషుల డిస్కస్ త్రో (క్వాలిఫికేషన్స్) వికాస్ గౌడ సమయం: రాత్రి 7.25 గంటల నుంచి పురుషుల 20కి.మీ నడక గుర్మీత్ సింగ్, మనీష్ సింగ్, క్రిష్ణన్ గణపతి సమయం: రాత్రి 11.00 గంటల నుంచి పురుషుల లాంగ్‌జంప్ అంకిత్ శర్మ శనివారం తెల్లవారుజామున 5.50 గంటల నుంచి పురుషుల హాకీ భారత్ x కెనడా సమయం: రాత్రి 9.00 గంటల నుంచి బాక్సింగ్ పురుషుల మిడిల్ వెయిట్ 75కేజీ ప్రిక్వార్టర్స్ వికాస్ కృషన్ యాదవ్ x ఓండర్ సిపాల్ (టర్కీ) సమయం: శనివారం తెల్లవారుజామున 3.00 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్ - 1, 2లలో ప్రత్యక్ష ప్రసారం -
ప్రి క్వార్టర్స్‌లో సింధు
మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ మకావు: భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు మకావు ఓపెన్ బ్యాడ్మింటన్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 21-13, 22-20తో కిమ్ హో మిన్ (కొరియా)పై విజయం సాధించింది. పురుషుల విభాగంలో ఏడో సీడ్ హెచ్.ఎస్. ప్రణయ్ 21-19, 21-15తో లిన్ చియా (చైనీస్ తైపీ)పై నెగ్గి ప్రి క్వార్టర్స్‌కు చేరగా... 15వ సీడ్ సాయి ప్రణీత్ 21-11, 21-8తో సావట్యుగిన్ (ఉజ్బెకిస్తాన్)పై నెగ్గి ముందంజ వేశాడు. అయితే మరో స్టార్ ఆటగాడు అజయ్ జయరామ్ 11-21, 17-21తో లిన్ గుపియు (చైనా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ విభాగంలో జ్వాల-అశ్విని జోడీకి కూడా చుక్కెదురయింది. తొలి రౌండ్లో జ్వాల జోడి 16-21, 15-21తో ఫుకుషిమా-మిరోటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. -
ఇండోనేషియా ప్రిక్వార్టర్స్ కి సైనా, కశ్యప్
జకర్తా: భారత నం.1 స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సింగిల్స్ విభాగంలో ఇండోనేషియా ఓపెన్ ప్రిక్వార్టర్స్ లో ప్రవేశించింది. పి.వి.సిందూ ఇంటి దారి పట్టింది. పురుషుల కేటగిరిలో పారుపల్లి కశ్యప్ సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్స్ కి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన మ్యాచ్ లో థాయ్‌లాండ్ కి చెందిన నిచాన్ జిందాపొన్పై 21-16, 21-18 తేడాతో విజయం సాధించింది. తొలిసెట్ ను సులువుగా కైవసం చేసుకున్న సైనాకు రెండోసెట్ లో కొంత ప్రతిఘటన ఎదురైంది. ఓ దశలో 18-17 తో వెనకబడి ఉన్న సైనా వరుసగా నాలుగు పాయింట్లు తన ఖాతాలో వేసుకొని విజయం సాధించింది. 2009, 2010, 2012 సంవత్సరాలలో సైనా ఇండోనేషియా ఓపెన్ నెగ్గిన విషయం తెలిసిందే. పారుపల్లి కశ్యప్ 21-17, 21-7 తేడాతో వరుస సెట్లను కైవసం చేసుకొని థాయ్‌లాండ్ కి చెందిన టనొంగ్ సాక్ పై విజయం సాధించాడు. ఈ రెండు సెట్లను కేవలం 29 నిమిషాల్లోనే ముగించడం విశేషం. సిందూ ఓటమి హైదరాబాదీ షట్లర్ పి.వి.సిందూ 21-15, 21- 14 తేడాతో వరస సెట్లు కోల్పోయి చైనాకి చెందిన క్రీడాకారిణి హు యా చింగ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ ఓటమితో సిందూ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. -
సింధు ముందుకు...
ప్రి క్వార్టర్స్‌లో హైదరాబాదీ - శ్రీకాంత్ కూడా... - ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కోపెన్‌హాగెన్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో ‘బై’ లభించిన ఆమె బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించింది. గత ఏడాది ఈ టోర్నీలో కాంస్యం గెలుచుకున్న సింధు 21-12, 21-17 స్కోరుతో ఓల్గా గొలోవనోవా (రష్యా)ను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ 21-18, 21-13తో రాజీవ్ ఓసెఫ్ (ఇంగ్లండ్)పై గెలిచి ప్రి క్వార్టర్స్‌కు చేరాడు. మరో ఆటగాడు. అజయ్ జైరాం రెండో రౌండ్లో థాయిలాండ్‌కు చెందిన టనోంగ్‌సక్ చేతిలో 17-21, 14-21తో ఓడిపోయాడు. జ్వాల-అశ్విని జోడి నిష్ర్కమణ: మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడి రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. భారత ద్వయంపై ఐదో సీడ్ కింగ్ టియాన్-యున్లీ జావో (చైనా) జోడి 21-16, 21-8తో ఘన విజయం సాధించింది. మరో వైపు పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి (భారత్) జోడి మూడో రౌండ్లోకి ప్రవేశించగా...ప్రణవ్ చోప్రా- అక్షయ్ దివాల్కర్ జంట నిష్ర్కమించింది. మను-సుమీత్ 21-19, 21-19తో 15వ సీడ్ హషిమొటో-హిరాటా (జపాన్)పై విజయం సాధించారు. అయితే ప్రణవ్-అక్షయ్ ద్వయం ఐదో సీడ్ జుంగ్ కిమ్-రంగ్ కిమ్ (కొరియా) చేతిలో 15-21, 17-21తో ఓటమిపాలైంది. -
ప్రిక్వార్టర్స్‌లో సోలంకి
వరల్డ్ యూత్ బాక్సింగ్ న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. 52 కేజీల విభాగంలో ఆసియా రజత పతక విజేత గౌరవ్ సోలంకి, 64 కేజీల కేటగిరీలో నీరజ్ పర్సార్లు ప్రిక్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. బల్గేరియాలోని సోఫియాలో గురువారం జరిగిన 52 కేజీల రెండో రౌండ్ బౌట్లో సోలంకి 2-1తో దిమిత్రి అసాను (బల్గేరియా)పై విజయం సాధించాడు. తొలి రౌండ్లో అసాను పంచ్‌లకు కాస్త తడబడిన భారత బాక్సర్ తర్వాతి రెండు రౌండ్లలో చెలరేగాడు. పదునైన పంచ్‌లతో వ్యూహాత్మకంగా ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. 64 కేజీ రెండో రౌండ్లో చగ్రెల్బెగ్ పజేవ్ (తుర్కుమెనిస్థాన్) బౌట్ నుంచి తప్పుకోవడంతో టెక్నికల్ నాకౌట్ (టీకేఓ) ద్వారా నీరజ్‌ను విజేతగా ప్రకటించారు. ప్రిక్వార్టర్స్‌లో సోలంకి.. విలియమ్ డోంగే (ఐర్లాండ్)తో; నీరజ్... నెనైల్ జార్జో (రొమేనియా)తో తలపడతారు. -
ప్రిక్వార్టర్స్‌లో సుమిత్, వికాస్
అల్మాటీ (కజకిస్థాన్): ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మరో ఇద్దరు భారత బాక్సర్లు ముందంజ వేశారు. ఒలింపియన్ సుమిత్ సంగ్వాన్ (81 కేజీలు), వికాస్ మాలిక్ (60 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. దీంతో ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించిన భారత బాక్సర్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. మన్దీప్ జాంగ్రా (69 కేజీ) పరాజయం చవిచూశాడు. ఆదివారం ఇక్కడ జరిగిన పోటీల్లో సుమిత్ 2-1తో తొమ్మిదో సీడ్ పెట్రూ సియోబను (మాల్దోవా)కు షాకిచ్చాడు. ప్రతి రౌండ్లోనూ చక్కని ఆధిపత్యం కనబరిచిన భారత బాక్సర్ చివరి రౌండ్లో మాత్రం పాయింట్ వెనుకబడ్డాడు. చివరకు 30-27, 30-27, 28-29తో ప్రత్యర్థిపై జయకేతనం ఎగరవేశాడు. మరో పోరులో వికాస్ 2-1తో పొలండ్‌కు చెందిన డేవిడ్ మిచెలస్పై గెలుపొందాడు. ఈ బౌట్లో విజయం కోసం ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. దీంతో రెండు రౌండ్లలో స్కోరు టై అయింది. అయితే ఒక రౌండ్లో భారత బాక్సర్ ఆధిక్యం కనబరచడంతో 2-1తో గెలిచినట్లు జడ్జీలు ప్రకటించారు. వికాస్ 28-28, 29-27, 28-28తో గెలిచాడు. ప్రిక్వార్టర్స్‌లో ఇతను ఐదో సీడ్ మిక్లోస్ వర్గా (హంగేరి)తో, సుమిత్... ఎనిమిదో సీడ్ సియర్హే నొవికవూ (బెలారస్)తో తలపడతారు. మన్దీప్... సెర్దార్ హుదమెర్డియెవ్ (తుర్క్మెనిస్థాన్) చేతిలో కంగుతిన్నాడు. సతీష్ కుమార్ (ప్లస్ 91 కేజీ) 3-0తో మిరోద్జిదిన్ కరిమోవ్ (తజకిస్థాన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. నానో సింగ్, శివతాపా, మన్‌ప్రీత్, మనోజ్ కుమార్ల ప్రిక్వార్టర్స్ బౌట్లు సోమవారం జరగనున్నాయి. -
ప్రి క్వార్టర్స్‌లో థాపా, నానో సింగ్
అల్మాటి (కజకిస్థాన్): యువ బాక్సర్ శివ థాపా, థోక్చోమ్ నానో సింగ్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ప్రిక్వార్టర్స్‌కు చేరారు. అయితే 2009 ఈవెంట్లో కాంస్యం నెగ్గిన విజేందర్ ఈసారి మాత్రం రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. విజేందర్ 79 కేజీ విభాగంలో ఐర్లాండ్‌కు చెందిన యూరోపియన్ చాంపియన్ జేసన్ క్విగ్లే చేతిలో ఓడిపోయాడు. తొలి రెండు బౌట్స్‌లో ఒక్కో పాయింట్ వెనుకబడిన విజేందర్ చివరి బౌట్లో హెచ్చరికకు గురయ్యాడు. మరోవైపు తొలి రౌండ్లో బై లభించిన నానో (49 కేజీ విభాగం) 3-0 తేడాతో స్కాట్లాండ్కు చెందిన అకీల్ అహ్మద్‌ను మట్టికరిపించాడు. నాలుగో సీడ్ శివ థాపా 56 కేజీ విభాగంలో ఫిలిపినో మారియో ఫెర్నాండెజ్‌ను ఓడిం చాడు. సోమవారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో నానో సింగ్ ఐదో సీడ్ ఆంటోనీ చకోన్ రివెరా (ప్యూర్టోరికో)తో, శివ థాపా అర్జెంటీనాకు చెందిన ఆల్బర్టో మెలియన్తో తలపడతారు. మన్‌ప్రీత్ (91కేజీ), మనోజ్ కుమార్ (64కేజీ) ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించారు.