ప్రి క్వార్టర్స్‌లో సింధు | Shuttler PV Sindhu enters second round at Macau Open | Sakshi
Sakshi News home page

ప్రి క్వార్టర్స్‌లో సింధు

Published Thu, Nov 26 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM

ప్రి క్వార్టర్స్‌లో సింధు

ప్రి క్వార్టర్స్‌లో సింధు

మకావు ఓపెన్ బ్యాడ్మింటన్
మకావు: భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు మకావు ఓపెన్ బ్యాడ్మింటన్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 21-13, 22-20తో కిమ్ హో మిన్ (కొరియా)పై విజయం సాధించింది. పురుషుల విభాగంలో ఏడో సీడ్ హెచ్.ఎస్. ప్రణయ్ 21-19, 21-15తో లిన్ చియా (చైనీస్ తైపీ)పై నెగ్గి ప్రి క్వార్టర్స్‌కు చేరగా... 15వ సీడ్ సాయి ప్రణీత్ 21-11, 21-8తో సావట్యుగిన్ (ఉజ్బెకిస్తాన్)పై నెగ్గి ముందంజ వేశాడు.

అయితే మరో స్టార్ ఆటగాడు అజయ్ జయరామ్ 11-21, 17-21తో లిన్ గుపియు (చైనా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ విభాగంలో జ్వాల-అశ్విని జోడీకి కూడా చుక్కెదురయింది. తొలి రౌండ్‌లో జ్వాల జోడి 16-21, 15-21తో ఫుకుషిమా-మిరోటా (జపాన్) చేతిలో ఓడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement