♦ సిరిల్ వర్మ కూడా
♦ చైనీస్ తైపీ గ్రాండ్ ప్రి టోర్నీ
తైపీ: చైనీస్ తైపీ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీ తొలిరౌండ్‌లో స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకున్న హైదరాబాద్ అమ్మాయి శ్రీకృష్ణప్రియకు ప్రిక్వార్టర్స్‌లో నిరాశే ఎదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 79వ ర్యాంకర్ శ్రీకృష్ణప్రియ 20–22, 13–21తో షువో సున్ యంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. తొలి గేమ్‌లో హోరాహోరీగా పోరాడిన శ్రీకృష్ణప్రియ, రెండోగేమ్‌లో తేలిపోయింది. 37 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో షువో సున్ యంగ్ 4 గేమ్ పాయింట్లు సాధించగా... కృష్ణప్రియ ఒక్కటీ గెలవలేకపోయింది. పురుషుల విభాగంలోనూ హైదరాబాద్ కుర్రాడు, 16వ సీడ్ సిరిల్ వర్మ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో పదహారో సీడ్ సిరిల్ వర్మ 12–21, 16–21తో లీ జీ జియా (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ మ్యాచ్ 28 నిమిషాల్లో ముగిసింది.
మళ్లీ టాప్–10లోకి శ్రీకాంత్
వారం వ్యవధిలో రెండు సూపర్ సిరీస్ టైటిళ్లను గెలిచి భీకరమైన ఫామ్‌లో ఉన్న తెలుగు కుర్రాడు కిడాంబి శ్రీకాంత్ గురువారం ప్రకటించిన ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి చేరుకున్నాడు. మహిళల విభాగంలో పీవీ సింధు 5వ ర్యాంకుకు పడిపోగా... సైనా ఒక స్థానం ఎగబాకి 15 ర్యాంకుకు చేరుకుంది.
ప్రిక్వార్టర్స్‌లో శ్రీకృష్ణప్రియ ఓటమి
Published Fri, Jun 30 2017 1:47 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM
Advertisement
Advertisement