భారత ఆటగాడు సిరిల్ వర్మ వియత్నాం ఇంటర్నేషనల్ చాలెంజ్ కప్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో
హనోయ్ (వియత్నాం): భారత ఆటగాడు సిరిల్ వర్మ వియత్నాం ఇంటర్నేషనల్ చాలెంజ్ కప్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్స్‌లో పరాజయం చవిచూశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ సిరిల్ వర్మ 17–21, 14–21తో నాలుగో సీడ్ మౌలానా పాంజీ అహ్మద్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు.
పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ జోడి 21–17, 21–16తో యొషికి సుకమొటొ–షున్ సుకె యమముర (జపాన్) జంటపై గెలిచింది.