
బాలి: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లో ఓడిపోయారు. ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ సింధు కేవలం 32 నిమిషాల్లో 13–21, 9–21తో ఓటమి చవిచూసింది. యామగుచి చేతిలో సింధు ఓడటం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం.
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత సింధు ఆడిన మూడో టోర్నీలోనూ సెమీఫైనల్ దశ దాటలేదు. మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో 41 నిమిషాలపాటు జరిగిన జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ శ్రీకాంత్ 14–21, 9–21తో పరాజయం పాలయ్యాడు. సెమీస్‌లో ఓడిన సింధు, శ్రీకాంత్‌లకు 8,400 డాలర్ల (రూ. 6 లక్షల 23 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment