
కౌలాలంపూర్: గత సీజన్ భారత స్టార్ షట్లర్లకు మిశ్రమ ఫలితాలిచి్చంది. కానీ ఇప్పుడు ఒలింపిక్ నామ సంవత్సరం కావడంతో మన బ్యాడ్మింటన్ ఆటగాళ్లంతా నూతనోత్సాహంతో కొత్త సీజన్‌కు శ్రీకారం చుట్టేపనిలో ఉన్నారు.
నేటి నుంచి జరిగే మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో శుభారంభమే లక్ష్యంగా మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, ప్రపంచ 8వ ర్యాంకర్ ప్రణయ్, డబుల్స్‌లో అగ్రశ్రేణి జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కోటి ఆశలతో కొత్త ఏడాదిని విజయవంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు. నేడు జరిగే తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో శ్రీకాంత్, వెంగ్ హాంగ్ యంగ్ (చైనా)తో లక్ష్య సేన్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment