పేస్‌కు 54వ టైటిల్
మలేసియా ఓపెన్ కైవసం
కౌలాలంపూర్: తన కెరీర్‌లో 98వ కొత్త భాగస్వామితో బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ టైటిల్ సాధించాడు. ఆదివారం ముగిసిన మలేసియా ఓపెన్ టోర్నీలో 41 ఏళ్ల పేస్ తన సహచరుడు మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలండ్)తో కలిసి విజేతగా నిలిచాడు. ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్‌ను జమచేసుకున్నాడు. గంటన్నరపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ పేస్-మట్కోవ్‌స్కీ జోడి 3-6, 7-6 (7/5), 10-5తో రెండో సీడ్ జేమీ ముర్రే (బ్రిటన్)-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంటపై గెలిచింది. కెరీర్‌లో 91వ ఫైనల్ ఆడిన పేస్‌కిది 54వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. 1997 నుంచి ప్రతి ఏడాది పేస్ కనీసం ఒక్క డబుల్స్ టైటిల్ అయినా గెలుస్తూ వస్తున్నాడు.