
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ సంచలన విజయంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 12–21, 21–18, 21–16తో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
తదుపరి రౌండ్‌లో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో శ్రీకాంత్ తలపడతాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా (భారత్) జోడీ 21–13, 21–16తో ఫ్రాన్సెస్కా కోర్బి–అలీసన్ లీ (అమెరికా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment