కుమమోటో: జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి టాప్ సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ తొలి రౌండ్‌లోనే ని్రష్కమించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ ఐదో ర్యాంక్ ద్వయం సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–16, 18–21, 16–21తో ప్రపంచ 21వ ర్యాంక్ జంట లూ చింగ్ యావో–యాంగ్ పో హాన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది.
63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్, చిరాగ్ తొలి గేమ్ గెలిచినా ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకున్నారు. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కొడాయ్ నరోకా (జపాన్)తో లక్ష్య సేన్; లీ చెయుక్ యి (హాంకాంగ్)తో హెచ్‌ఎస్ ప్రణయ్; లిన్ చున్‌యి (చైనీస్ తైపీ)తో ప్రియాన్షు రజావత్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment