
సింగపూర్‌లో సత్తాచాటిన భారత షట్లర్లు
సింగపూర్: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్లో భారత షట్లర్లు సాయి ప్రణీత్, కిడాంబి శ్రీకాంత్ సత్తాచాటారు. పురుషుల సింగిల్స్ టైటిల్ రేసులో వీరిద్దరూ ఫైనల్‌కు దూసుకెళ్లి.. భారత్‌కు స్వర్ణ పతకాన్ని ఖాయం చేశారు.
శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో సాయి ప్రణీత్ 21-6, 21-8 స్కోరుతో లీ డాంగ్‌పై అలవోకగా విజయం సాధించాడు. మరో సెమీస్‌లో శ్రీకాంత్ 21-13, 21-14తో ఆంథోనిను ఓడించాడు. ఫైనల్ సమరంలో ప్రణీత్, శ్రీకాంత్ అమీతుమీ తేల్చుకోనున్నారు. ఫైనల్లో ఎవరు గెలిచినా పసిడి, రజత పతకాలు రెండూ భారత్‌కు దక్కనున్నాయి.