
World Badminton Championship: Kidambi Srikanth Wins First Round (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేయగా... 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–12, 21–16తో పాబ్లో అబియాన్ (స్పెయిన్)పై నెగ్గాడు.
మరో మ్యాచ్‌లో 16వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–17, 7–21, 18–21తో 28వ ర్యాంకర్ మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమిత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 16–21, 15–21తో జోయెల్ ఎల్పీ–రస్ముస్ జార్ (డెన్మార్క్) జంట చేతిలో పరాజయం పాలైంది.