sumith reddy
-
శ్రీకాంత్ శుభారంభం.. తొలి రౌండ్లోనే సాయిప్రణీత్‌కు షాక్
World Badminton Championship: Kidambi Srikanth Wins First Round (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేయగా... 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–12, 21–16తో పాబ్లో అబియాన్ (స్పెయిన్)పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో 16వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–17, 7–21, 18–21తో 28వ ర్యాంకర్ మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమిత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 16–21, 15–21తో జోయెల్ ఎల్పీ–రస్ముస్ జార్ (డెన్మార్క్) జంట చేతిలో పరాజయం పాలైంది. చదవండి: KS Bharat Century: విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం.. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ భారీ ధర కన్ఫర్మ్ -
సుమీత్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: నేపాల్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు. కఠ్మాండూలో ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 21–19, 21–15తో భారత్‌కే చెందిన ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్ జంటను ఓడించింది. మహిళల డబుల్స్‌లో కె.మనీషా–రుతుపర్ణ (భారత్) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో మనీషా–రుతుపర్ణ జంట 10–21, 21–18, 11–21తో టాప్ సీడ్ సెత్యానా మపాసా–గ్రోన్యా సోమర్‌విలె (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ కాంస్య పతకం గెలిచాడు. సెమీఫైనల్లో సిరిల్ వర్మ 11–21, 16–21తో కావో క్వాంగ్ ఫామ్ (వియత్నాం) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
సుమీత్ జంటకు డబుల్స్ టైటిల్
ముంబై: స్వదేశంలో జరిగిన టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు మెరిశారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మూడు విభాగాల్లో భారత క్రీడాకారులు టైటిల్స్ సాధించారు. పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి అర్జున్ రామచంద్రన్‌తో కలిసి టైటిల్ దక్కించుకోగా... మహిళల సింగిల్స్‌లో అస్మిత చలిహా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ చాంపియన్స్‌గా నిలిచారు. మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి గుమ్మడి వృశాలి... మహిళల డబుల్స్‌లో జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) జోడీ రన్నరప్‌గా నిలిచారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–అర్జున్ ద్వయం 21–10, 21–16తో టాప్ సీడ్ గో జె ఫె–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) జంటను చిత్తుగా ఓడించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో వృశాలి 16–21, 13–21తో అష్మిత చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆసియా జూనియర్ చాంపియన్ లక్ష్య సేన్ 21–15, 21–10తో ప్రస్తుత జూనియర్ ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)ను బోల్తా కొట్టించాడు. ఈ గెలుపుతో గత నెలలో కెనడాలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కున్లావుత్ చేతిలో ఎదురైన ఓటమికి లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో మేఘన–పూర్వీషా రామ్ ద్వయం 10–21, 11–21తో ఎన్జీ వింగ్ యుంగ్–యెంగ్ ఎన్గా టింగ్ (హాంకాంగ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
బ్యాడ్మింటన్‌లో మరో ‘జంట’
పెళ్లి చేసుకోనున్న సుమిత్, సిక్కి రెడ్డి సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారులు సుమిత్ రెడ్డి, సిక్కి రెడ్డి ఒకింటి వారు కానున్నారు. హైదరాబాద్‌కు చెందిన సుమిత్, సిక్కి రెడ్డిల నిశ్చితార్థం ఫిబ్రవరి 1న జరుగనుంది. వివాహం డిసెంబరులో జరుగుతుంది. గతేడాది రియో ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ విభాగంలో మనూ అత్రితో కలిసి 25 ఏళ్ల సుమిత్ భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఒలింపిక్స్ చరిత్రలో పురుషుల డబుల్స్ విభాగంలో పాల్ఠ్గన్న తొలి భారతీయ జోడీగా సుమిత్-మనూ అత్రి గుర్తింపు పొందింది. మనూ అత్రితో కలిసి సుమిత్ 2016లో కెనడా ఓపెన్, 2015లో మెక్సికో ఓపెన్ గ్రాండ్‌ప్రి డబులఖ్స టైటిల్స్ ను సాధించాడు. మరోవైపు 23 ఏళ్ల సిక్కి రెడ్డి గత ఏడాది మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రణవ్ చోప్రాతో కలిసి బ్రెజిలఖ ఓపెనఖ, రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టైటిల్స్ ను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక ‘ఉబెర్ కప్’లో రెండుసార్లు (2014, 2016లో) కాంస్యాలు సాధించిన... 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో సిక్కి రెడ్డి సభ్యురాలిగా ఉంది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు ‘జంట’గా మారడం కొత్తేం కాదు. గతంలో ‘అట్లాంటా ఒలింపియన్’... జాతీయ మాజీ చాంపియన్ పీవీవీ లక్ష్మిని ప్రస్తుత ? కోచ్ పుల్లెల గోపీచంద్; జాతీయ మాజీ చాంపియన్ సయాలీ గోఖలేను సాగర్ చోప్రా వివాహం చేసుకోగా... వారి బాటలోనే మరికొందరు నడుస్తున్నారు. గత నెలలో డబుల్స్ క్రీడాకారిణి ప్రద్న్యా గాద్రెను ప్రణవ్ చోప్రా పెళ్లాడగా... మహారాష్ట్ర క్రీడాకారిణి అరుంధతి పంతవానెను కేరళ ఆటగాడు అరుణ్ విష్ణు వివాహం చేసుకున్నాడు.