-
పెళ్లి చేసుకోనున్న సుమిత్, సిక్కి రెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారులు సుమిత్ రెడ్డి, సిక్కి రెడ్డి ఒకింటి వారు కానున్నారు. హైదరాబాద్‌కు చెందిన సుమిత్, సిక్కి రెడ్డిల నిశ్చితార్థం ఫిబ్రవరి 1న జరుగనుంది. వివాహం డిసెంబరులో జరుగుతుంది. గతేడాది రియో ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ విభాగంలో మనూ అత్రితో కలిసి 25 ఏళ్ల సుమిత్ భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఒలింపిక్స్ చరిత్రలో పురుషుల డబుల్స్ విభాగంలో పాల్ఠ్గన్న తొలి భారతీయ జోడీగా సుమిత్-మనూ అత్రి గుర్తింపు పొందింది. మనూ అత్రితో కలిసి సుమిత్ 2016లో కెనడా ఓపెన్, 2015లో మెక్సికో ఓపెన్ గ్రాండ్‌ప్రి డబులఖ్స టైటిల్స్ ను సాధించాడు.
మరోవైపు 23 ఏళ్ల సిక్కి రెడ్డి గత ఏడాది మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ప్రణవ్ చోప్రాతో కలిసి బ్రెజిలఖ ఓపెనఖ, రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టైటిల్స్ ను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక ‘ఉబెర్ కప్’లో రెండుసార్లు (2014, 2016లో) కాంస్యాలు సాధించిన... 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో సిక్కి రెడ్డి సభ్యురాలిగా ఉంది.
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు ‘జంట’గా మారడం కొత్తేం కాదు. గతంలో ‘అట్లాంటా ఒలింపియన్’... జాతీయ మాజీ చాంపియన్ పీవీవీ లక్ష్మిని ప్రస్తుత ? కోచ్ పుల్లెల గోపీచంద్; జాతీయ మాజీ చాంపియన్ సయాలీ గోఖలేను సాగర్ చోప్రా వివాహం చేసుకోగా... వారి బాటలోనే మరికొందరు నడుస్తున్నారు. గత నెలలో డబుల్స్ క్రీడాకారిణి ప్రద్న్యా గాద్రెను ప్రణవ్ చోప్రా పెళ్లాడగా... మహారాష్ట్ర క్రీడాకారిణి అరుంధతి పంతవానెను కేరళ ఆటగాడు అరుణ్ విష్ణు వివాహం చేసుకున్నాడు.