సాయిప్రణీత్‌కు సవాల్‌ | sai praneeth looks stay on another title | Sakshi
Sakshi News home page

సాయిప్రణీత్‌కు సవాల్‌

Published Mon, Jun 12 2017 3:47 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

సాయిప్రణీత్‌కు సవాల్‌

సాయిప్రణీత్‌కు సవాల్‌

జకార్తా: వరుసగా రెండు అంతర్జాతీయ టైటిల్స్‌ సాధించి జోరు మీదున్న భారత బ్యాడ్మింటన్‌ యువతార భమిడిపాటి సాయిప్రణీత్‌ మరో టైటిల్‌పై గురి పెట్టాడు. ఈరోజు(సోమవారం) మొదలయ్యే ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నమెంట్‌లో సాయిప్రణీత్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్‌ విభాగాల్లో మ్యాచ్‌లు ఉంటాయి.

 

మంగళవారం మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ, థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో విజేతగా నిలిచిన సాయిప్రణీత్‌కు ఇండోనేసియా ఓపెన్‌లో మాత్రం తొలి రౌండ్‌లోనే అగ్ని పరీక్ష ఎదురుకానుంది. మొదటి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ సన్‌ వాన్‌ హో (దక్షిణ కొరియా)తో సాయిప్రణీత్‌ ఆడనున్నాడు. సాయిప్రణీత్‌తోపాటు పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో భారత్‌ నుంచి కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్‌ బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement