
సిడ్నీ: అలవోక విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు భమిడిపాటి సాయి ప్రణీత్, సమీర్ వర్మ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ సాయిప్రణీత్ 21–12, 21–14తో మౌలానా పంజి అహ్మద్ (ఇండోనేసియా)పై; నాలుగో సీడ్ సమీర్ వర్మ 21–16, 21–12తో టకుమా ఉయెదా (జపాన్)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి జంట 21–17, 21–17తో హుక్ జిన్ చొయి–యుంగ్ హూన్ పర్క్ జోడీపై; అర్జున్–రామచంద్రన్ ద్వయం 21–15, 25–23తో ఒకముర–ఒనోదెరా (జపాన్) జంటపై గెలిచింది.
మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తెలుగు అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి 5–21, 5–21తో హన్ యూ (చైనా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మేఘన–పూర్విషా జంట 11–21, 13–21తో మికి కశిహర–మియుకీ కటో (జపాన్) జోడీ చేతిలో ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో శివమ్ శర్మ–పూర్విషా రామ్ ద్వయం 6–21, 13–21తో సెంగ్ జాయి సియొ–చై యూజుంగ్ (కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment