హైదరాబాద్ యువ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి
న్యూఢిల్లీ : హైదరాబాద్ యువ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ 14-21, 21-15, 21-15తో నిలుక కరుణరత్నె (శ్రీలంక)పై విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో లీ చోంగ్ వీ (మలేసియా)తో సాయిప్రణీత్ ఆడతాడు. అజయ్ జయరామ్ 21-12, 17-21, 21-12తో యులి ప్రాసెట్యో (ఇండోనేసియా)పై గెలి చి క్వార్టర్స్‌కు చేరాడు.
మహిళల డబుల్స్ ప్రిక్వా ర్టర్స్‌లో జ్వాల-అశ్విని 16-21, 21-16, 21-17తో సమంత బార్నింగ్-ఐరిస్ తబెలింగ్ (నెదర్లాండ్స్)లపై, సిక్కి రెడ్డి-ప్రద్నా 21-15, 21-12తో జోహానా గొలిస్‌జెవ్‌స్కీ-కార్లా నెల్టె (జర్మనీ)లపై నెగ్గారు.