
చాంగ్‌జూ: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ కథ ముగిసింది. టోర్నీలో మిగిలిన ఏకైక భారత షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ శుక్రవారం క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలయ్యాడు. ఇండోనేసియాకు చెందిన ఏడో సీడ్ ఆంథోనీ సినిసుకా జిన్‌టింగ్ 16–21, 21–6, 21–16తో సాయిప్రణీత్‌ను ఓడించాడు. నెల రోజుల క్రితం ఇదే జిన్‌టింగ్‌ను వరల్డ్ చాంపియన్‌షిప్‌లో చిత్తు చేసిన ప్రణీత్‌కు ఈసారి ప్రతికూల ఫలితం వచ్చింది. ఆరంభంలో ఆధిక్యం కనబర్చిన ప్రణీత్ తొలి గేమ్‌ను సునాయాసంగానే గెలుచుకున్నా... రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. మూడో గేమ్‌లో 11–7తో భారత ఆటగాడు ముందంజలో నిలిచి కూడా తర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment