China Open tournament
-
పోరాడి ఓడిన సాత్విక్–చిరాగ్ జంట
ఫుజౌ (చైనా): ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ... భారత యువ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంటకు ఓటమి తప్పలేదు. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ద్వయం పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 16–21, 20–22తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జంట కెవిన్ సంజయ సుకముల్జో–మార్కస్ గిడియోన్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడింది. సెమీస్‌లో నిష్క్రమించిన సాత్విక్–చిరాగ్ జంటకు 9,800 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 40 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జోడీ ఆరంభంలోనే 7–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఇండోనేసియా ద్వయం నెమ్మదిగా తేరుకొని వరుస పాయింట్లు సాధించి విరామానికి 11–9తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత అదే ఊపులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో మాత్రం రెండు జోడీలు ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. కీలకదశలో అనుభవజ్ఞులైన కెవిన్–గిడియోన్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఓవరాల్‌గా కెవిన్–గిడియోన్ చేతిలో భారత జంటకిది వరుసగా ఎనిమిదో ఓటమికాగా... ఈ ఏడాది మూడోది. ఆగస్టులో థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో టైటిల్ నెగ్గిన సాత్విక్–చిరాగ్... గతవారం ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. -
మళ్లీ సంచలనం
ఇన్నాళ్లూ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో భారత్ తరఫున సింగిల్స్ విభాగాల్లోనే గొప్ప ఫలితాలు కనిపించేవి. అయితే సింగిల్స్ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా డబుల్స్ విభాగంలో అద్భుత ఆటతీరుతో అదరగొడుతూ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. గతవారం ఫ్రెంచ్ ఓపెన్ లో రన్నరప్‌గా నిలిచే క్రమంలో ఈ ఏడాది ప్రపంచ చాంపియన్స్ జోడీని ఓడించిన ఈ భారత జంట తాజాగా 2018 ప్రపంచ చాంపియన్స్ జంటను మట్టికరిపించి మరో సంచలనం సృష్టించింది. ఫుజౌ (చైనా): భారత సింగిల్స్ అగ్రశ్రేణి క్రీడాకారులు ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయిన నిరాశను మరిపిస్తూ పురుషుల డబుల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ జంట సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో స్ఫూర్తిదాయక విజయం సాధించింది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–19, 21–15తో 2018 ప్రపంచ చాంపియన్స్, మూడో ర్యాంక్ జోడీ లీ జున్ హుయ్–లియు యు చెన్ (చైనా)పై సంచలన విజయం సాధించింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ సాధికారిక ఆటను ప్రదర్శించారు. రెండు గేముల్లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. తొలి గేమ్‌లో 15–11తో నాలుగు పాయింట్ల ఆధిక్యంలో ఉన్న భారత జోడీకి ఆ తర్వాత గట్టిపోటీ ఎదురైంది. సొంతగడ్డపై, సొంత ప్రేక్షకుల మద్దతుతో పుంజుకున్న చైనా జంట 18–18తో స్కోరును సమం చేసింది. అయితే సాత్విక్–చిరాగ్ ఈ కీలకదశలో వరుసగా రెండు పాయింట్లు గెలిచి 20–18తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మరో పాయింట్ కోల్పోయినా... వెంటనే మరో పాయింట్ గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకున్నారు. ఇక రెండో గేమ్‌లో సాత్విక్–చిరాగ్ జంటకు ఆరంభంలో ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 12–12 వద్ద భారత జంట వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 15–12తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని భారత జంట విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ద్వయం కెవిన్ సంజయ సుకముల్జో–మార్కస్ గిడియోన్ (ఇండోనేసియా)లతో సాత్విక్–చిరాగ్ జంట ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో భారత జంట 0–7తో వెనుకంజలో ఉంది. -
ప్రణీత్, కశ్యప్ ఔట్
ఫుజౌ (చైనా): చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్ సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్ సింధు, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్ ఇప్పటికే ఇంటిదారి పట్టగా... తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ కూడా వెనుదిరిగారు. గురువారం 84 నిమిషాల పాటు సాగిన ప్రిక్వార్టర్ పోరులో ప్రపంచ 11వ ర్యాంకర్ సాయిప్రణీత్ 20–22, 22–20, 16–21తో టోర్నీ నాలుగో సీడ్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్‌లో నువ్వా–నేనా అన్నట్లు పోరాడటంతో స్కోరు 20–20తో సమమైంది. చివర్లో వరుసగా రెండు పాయింట్లు సాధించిన డెన్మార్క్ షట్లర్ తొలి గేమ్‌ను గెలిచాడు. రెండో గేమ్‌లోనూ ఇద్దరు ఆటగాళ్లు తొలుత హోరాహోరీగా ఆడినప్పటికీ కీలక సమయంలో పాయింట్లు సాధించిన ప్రణీత్ 19–13తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ దశలో తడబడిన ప్రణీత్ వరుసగా 5 పాయింట్లను ప్రత్యర్థికి కోల్పోయి ఆధిక్యాన్ని 19–18కి తగ్గించుకున్నాడు. అనంతరం ప్రణీత్ ఒక పాయింట్, ఆంటోన్సెన్ రెండు పాయింట్లు తమ ఖాతాలో వేసుకోగా స్కోర్ 20–20తో సమమైంది. అయితే ఇక్కడ ఎటువంటి పొరపాటు చేయని ప్రణీత్ రెండు పాయింట్లు సాధించి రెండో గేమ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో డెన్మార్క్ షట్లర్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మరో ప్రిక్వార్టర్ పోరులో కశ్యప్ 13–21, 19–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. తొలి గేమ్‌లో ఏ మాత్రం పోటీ ఇవ్వని కశ్యప్ రెండో గేమ్‌లో మాత్రం పోరాడాడు. అయితే 19–17తో ఉన్న సమయంలో ఒత్తిడికి లోనైన కశ్యప్ వరుసగా 4 పాయింట్లను ప్రత్యర్థికి సమర్పించుకొని ఇంటి ముఖం పట్టాడు. సాత్విక్‌కు మిశ్రమ ఫలితాలు భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురైయ్యాయి. డబుల్స్‌లో చిరాగ్ శెట్టితో జత కట్టిన సాయిరాజ్ క్వార్టర్స్ చేరగా... మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం ప్రిక్వార్టర్స్ అడ్డంకిని దాటలేకపోయాడు. డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం 21–18, 21–23, 21–11తో ఆరో సీడ్ హిరోయుకి ఎండో– యుట వటనాబె (జపాన్) జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్– అశ్విని పొన్నప్ప జంట 21–23, 16–21తో టోర్నీ ఐదో సీడ్ సియో సెయుంగ్ జే– చే యుజుంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది. నేడు జరిగే క్వార్టర్స్ పోరులో టోర్నీ మూడో సీడ్ లి జున్ హుయ్– లియు యున్ చెన్ (చైనా) జంటతో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం తలపడుతుంది. -
సింధుకు చుక్కెదురు
ఫుజౌ (చైనా): అంతర్జాతీయస్థాయిలో స్టార్ ప్లేయర్ హోదా వచ్చాక... వారి ఆటతీరును ప్రత్యర్థులు ఎల్లవేళలా పరిశీలిస్తారని... లోపాలను గుర్తిస్తూ కొత్త వ్యూహాలు రచిస్తారని... అవకాశం రాగానే వాటిని అమలు చేసి అనుకున్న ఫలితం సాధిస్తారని... ప్రపంచ చాంపియన్, భారత మేటి షట్లర్ పీవీ సింధు కూడా ఇందుకు మినహాయింపు కాదని తెలుస్తోంది. గత ఆగస్టులో విశ్వవిజేతగా అవతరించాక సింధుకు తన ప్రత్యర్థుల నుంచి మరింత గట్టిపోటీ ఎదురవుతోంది. దాని ఫలితమే ఆమెకు ఎదురవుతున్న వరుస పరాజయాలు. తాజాగా మంగళవారం మొదలైన చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆరో సీడ్ పీవీ సింధు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రపంచ 42వ ర్యాంకర్ పాయ్ యు పో (చైనీస్ తైపీ)తో 74 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సింధు 13–21, 21–18, 19–21తో ఓడిపోయింది. రెండు నెలల క్రితం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్లో పాయ్ యు పోపై అలవోకగా నెగ్గిన సింధు ఈసారి ఆమె చేతిలోనే ఓడిపోవడం గమనార్హం. నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో సింధు 18–15తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ వెంటనే వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి 18–19తో వెనుకబడింది. ఆ తర్వాత స్కోరు సమం చేసినా... పాయ్ యు పో వరుసగా రెండు పాయింట్లు నెగ్గి తొలిసారి సింధుపై విజయం సాధించింది. ఆగస్టులో విశ్వవిజేతగా నిలిచాక... సింధు పాల్గొన్న ఐదు టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ దశను దాటలేదు. ఈ ఐదు పర్యాయాలు ఆమెను వేర్వేరు క్రీడాకారిణులు ఓడించడం గమనార్హం. ప్రణయ్‌కు నిరాశ: పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ (భారత్) 17–21, 18–21తో రస్ముస్ గెమ్కే (డెన్మార్క్) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని (భారత్) 9–21, 8–21తో లి వెన్ మె–జెంగ్ యు (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ శెట్టి (భారత్) 21–9, 21–15తో ఫిలిప్–రియాన్ (అమెరికా)లపై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–అశ్విని 21–19, 21–19తో హర్ల్‌బర్ట్–జోసెఫిన్ వు (కెనడా)లపై గెలిచారు. -
సింధు క్వార్టర్స్ దాటేనా?
ఫుజౌ (చైనా): ప్రపంచ చాంపియన్‌గా అవతరించాక ఆడిన ప్రతీ టోర్నీలో నిరాశపరిచిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు... ఈ ఏడాది లోటుగా ఉన్న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ సూపర్ టైటిల్‌ను సాధించేందుకు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నేటి నుంచి మొదలయ్యే చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సింధుతోపాటు భారత్‌కే చెందిన మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో బరిలోకి దిగనున్నారు. ఇద్దరికీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. ప్రపంచ చాంపియన్ అయ్యాక సింధు చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీతోపాటు కొరియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లో పాల్గొంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఆమె మిగతా మూడు టోర్నీల్లో ప్రిక్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. మంగళవారం మొదలయ్యే చైనా ఓపెన్‌లోనూ సింధుకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. తొలి రౌండ్లో పాయ్ యు పో (చైనీస్ తైపీ)తో ఆడనున్న సింధు ఈ రౌండ్‌ను దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో కిర్స్టీ గిల్మోర్ (స్కాట్లాండ్) లేదా కిమ్ గా యున్ (దక్షిణ కొరియా)లతో తలపడుతుంది. ఈ అడ్డంకిని అధిగమిస్తే సింధుకు క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్, మూడుసార్లు విశ్వవిజేతగా నిలిచిన కరోలినా మారిన్ (స్పెయిన్) లేదా ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) ఎదురవుతారు. ముఖాముఖి రికార్డులో సింధుపై వీరిద్దరికి మెరుగైన రికార్డు ఉంది. మరోవైపు సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో చైనా ప్లేయర్ కాయ్ యాన్ యాన్‌తో తలపడుతుంది. తొలి రౌండ్లో గెలిస్తే సైనాకు ప్రిక్వార్టర్ ఫైనల్లో బుసానన్ (థాయ్‌లాండ్) లేదా లైన్ జార్స్‌ఫెల్ట్ (డెన్మార్క్) ఎదురయ్యే చాన్స్ ఉంది. ఈ రౌండ్‌నూ దాటితే క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ అకానె యామగుచి (జపాన్) రూపంలో సైనాకు కఠిన ప్రత్యర్థి ఉండే అవకాశముంది. వైదొలిగిన శ్రీకాంత్... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ వైదొలగగా... ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్‌లు బరిలో ఉన్నారు. తొలి రౌండ్ పోరులో టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్; సిత్తికోమ్ తమాసిన్ (థాయ్‌లాండ్)తో కశ్యప్; లీ చియుక్ యు (హాంకాంగ్)తో సమీర్ వర్మ; రాస్ముస్ గెమ్కే (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతారు. -
సాయిప్రణీత్ పరాజయం
చాంగ్జూ: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ కథ ముగిసింది. టోర్నీలో మిగిలిన ఏకైక భారత షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ శుక్రవారం క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలయ్యాడు. ఇండోనేసియాకు చెందిన ఏడో సీడ్ ఆంథోనీ సినిసుకా జిన్‌టింగ్ 16–21, 21–6, 21–16తో సాయిప్రణీత్‌ను ఓడించాడు. నెల రోజుల క్రితం ఇదే జిన్‌టింగ్‌ను వరల్డ్ చాంపియన్‌షిప్‌లో చిత్తు చేసిన ప్రణీత్‌కు ఈసారి ప్రతికూల ఫలితం వచ్చింది. ఆరంభంలో ఆధిక్యం కనబర్చిన ప్రణీత్ తొలి గేమ్‌ను సునాయాసంగానే గెలుచుకున్నా... రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. మూడో గేమ్‌లో 11–7తో భారత ఆటగాడు ముందంజలో నిలిచి కూడా తర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయాడు. -
సాత్విక్–అశ్విని జంట సంచలనం
చాంగ్జౌ (చైనా): అంతర్జాతీయ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత జోడీ మరో సంచలనం సృష్టించింది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప ద్వయం ప్రపంచ 12వ ర్యాంక్ జోడీ లారెన్ స్మిత్–మార్కస్ ఇలిస్ (ఇంగ్లండ్)ను బోల్తా కొట్టించింది. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 25వ ర్యాంక్ జంట సాత్విక్–అశ్విని 21–13, 20–22, 21–17తో ఈ ఏడాది గోల్డ్కోస్ట్కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన లారెస్ స్మిత్–మార్కస్ ఇలిస్ జోడీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గతంలో ఈ జంటతో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన భారత జోడీ మూడో ప్రయత్నంలో విజయం రుచి చూడటం విశేషం. అయితే పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 19–21, 20–22తో గో వీ షెమ్–తాన్ వీ కియోంగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్పప్ప ద్వయం 10–21, 18–21తో కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓటమి పాలైంది. ప్రణయ్ పరాజయం పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. తొలి రౌండ్లో ఏడో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 21–9, 21–19తో రాస్ముస్ జెమ్కే (డెన్మార్క్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... మరో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 16–21, 12–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో బుసానన్ (థాయ్‌లాండ్)తో పీవీ సింధు; సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)తో శ్రీకాంత్; జెంగ్ సివె–హువాంగ్ యాకియోంగ్ (చైనా)లతో సాత్విక్–అశ్విని; మథియాస్ క్రిస్టియాన్సన్–క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; చెన్ హంగ్ లింగ్–వాంగ్ చి లిన్ (చైనీస్ తైపీ)లతో సుమీత్ రెడ్డి–మనూ అత్రి తలపడతారు. ►ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
సింధు, సైనాలపై దృష్టి
చాంగ్జౌ: భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ చైనా ఓపెన్‌పై కన్నేశారు. రెండేళ్ల క్రితం (2016) ఇక్కడ విజేతగా నిలిచిన సింధు ఈసారీ టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది. నేటి నుంచి జరిగే చైనా ఓపెన్‌లో 23 ఏళ్ల సింధు మూడో సీడ్‌గా బరిలోకి దిగనుంది. జపాన్ ఓపెన్ నుంచి తప్పుకున్న సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్... డబుల్స్‌లో సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప, సాత్విక్ సాయిరాజ్, ప్రణవ్ చోప్రా, సుమీత్ రెడ్డి, మను అత్రి ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ ఏడాది జోరు మీదున్న సింధు పాల్గొన్న ప్రతీ మేజర్ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచింది. గత వారం జరిగిన జపాన్ ఓపెన్‌లో మాత్రం రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. మంగళవారం జరిగే మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సింధు... చెంగ్ ఎన్గన్ యి (హాంకాంగ్)తో తలపడనుండగా, 2014 చైనా ఓపెన్ విజేత అయిన సైనాకు సుంగ్ జీ హున్ (కొరియా) రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురైంది. ఏషియాడ్ రన్నరప్ సింధు, కాంస్య విజేత సైనాలు ప్రిక్వార్టర్స్ దశ దాటితే... క్వార్టర్ ఫైనల్స్ వీళ్లిద్దరి మధ్యే జరుగుతుంది. -
చైనా ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి
-
ఎదురులేని సింధు
చైనా ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి పుజు (చైనా): కెరీర్లో లోటుగా ఉన్న సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో అడుగు ముందుకేసింది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మారుు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 22-20, 21-10తో హీ బింగ్జియావో (చైనా)పై విజయం సాధించింది. ఈ సీజన్లో నాలుగు టైటిల్స్ (బిట్ బర్గర్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, జపాన్ ఓపెన్, స్విస్ ఓపెన్) సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హీ బింగ్జియావో నుంచి సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. ఒకదశలో 1-5తో, 14-17తో వెనుకబడిన సింధు నెమ్మదిగా తేరుకొని తుదకు 20-20తో స్కోరును సమం చేసింది. అదే జోరులో వరుసగా రెండు పారుుంట్లు నెగ్గి 21 నిమిషాల్లో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సింధు పూర్తి ఆధిపత్యం చలారుుంచింది. ఆరంభంలో 7-3తో ముందంజలో ఉన్న సింధు ఆ తర్వాత నిలకడగా పారుుంట్లు సాధించి 14-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సింధు వెనుదిరిగి చూడకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 5-3తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో అజయ్ జయరామ్ పోరాటం ముగిసింది. ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో జయరామ్ 15-21, 14-21తో ఓడిపోయాడు. -
సెమీస్‌లో సానియా జోడి
బీజింగ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... చైనా ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 7-6 (5), 6-4తో జూలియా జార్జెస్ (జర్మనీ)-కరోలినా ప్లిస్కోవా (చెక్)పై నెగ్గారు. గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ ద్వయం స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో కలిపి ఇప్పటికే ఏడు ట్రోఫీలను ఈ జోడి సొంతం చేసుకుంది.